BigTV English

Damacharla Brothers Clash: ఆస్తుల వివాదమా..? ఆధిపత్యమా..? దామచర్ల బ్రదర్స్‌ మధ్య గ్యాప్ ఎందుకు?

Damacharla Brothers Clash: ఆస్తుల వివాదమా..? ఆధిపత్యమా..? దామచర్ల బ్రదర్స్‌ మధ్య గ్యాప్ ఎందుకు?

Damacharla Brothers Clash: ఆ అన్న తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరుతో అక్కడ రాజకీయాల్లో రోజురోజుకి హీట్ పెరిగిపోతోంది. ఇద్దరు మధ్య పచ్చ గడ్డి వేసినా మండుతుంది.. అన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, తమ్ముడు దామచర్ల సత్య ఇద్దరూ ప్రకాశం జిల్లా టీడీపీలో కీలక నేతలే.. ఎన్నికల దాకా రామక్ష్మణుల్లా కనిపించిన ఆ అన్నదమ్ముళ్ల మధ్య ఇప్పుడు ఆధిపత్యపోరు మొదలైంది.. అసలు వారి మధ్య అంత గ్యాప్ పెరగడానికి కారణమేంటి? రాజకీయంగా ఆధిపత్యం సాధించాలనా? ఆస్తుల వివాదమా?


టీడీపీలో మంత్రిగా పనిచేసిన దామచర్ల ఆంజనేయులు

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో దామచర్ల కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దివంగత మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ.. కొండేపి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ఆయన మరణానంతరం తాత దామచర్ల ఆంజనేయులు వారుసుడిగా ఒంగోలు ప్రస్తుత ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2004 వరకు జనరల్ నియోజకవర్గంగా ఉన్న కొండేపి 2009 నాటికి ఎస్సీ నియోజకవర్గంగా మారడంతో దామచర్ల జనార్ధన్ ఒంగోలు నియోజకవర్గాన్ని నమ్ముకొని రాజకీయ జీవితం ప్రారంభించారు.


కొండేపి టీడీపి బాధ్యతలు చూస్తున్న దామచర్ల సత్య

ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్ధన్ నాలుగు సార్లు పోటీ చేసి రెండు సార్లు గెలుపొందారు. కొండేపి నియోజకవర్గంలో దామచర్ల ఆంజనేయులు మరో మనుమడు దామచర్ల సత్య రాజకీయ అరంగ్రేటం చేసి కొండేపి నియోజకవర్గ టీడీపీ బాధ్యతలను చూస్తున్నారు. కొండేపి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌డ్ కావడంతో అక్కడ నుండి డోలా బాలవీరాంజనేయస్వామికి తెలుగుదేశం పార్టీ టిక్కెట్టు ఇప్పించి ఆయనను మూడు సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడంలో దామచర్ల సత్య ఆయన తండ్రి పూర్ణచంద్రరావు కీలక పాత్ర పోషించారు.

సత్యకు మారిటైం బోర్డు కార్పోరేషన్ చైర్మన్ పదవి

తక్కువ సమయంలోనే దామచర్ల సత్య రాజకీయంగా అంచలంచెలుగా ఎదిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సత్య అత్యంత సన్నిహితమయ్యారు. ఆ క్రమంలో ఒంగోలులో దామచర్ల జనార్దన్ అటు కొండేపి నియోజకవర్గంలో దామచర్ల సత్య పార్టీలో పాతుకుపోయారు. దామచర్ల సత్య పార్టీకి చేస్తున్న సేవలు గుర్తించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయనకు మారిటైం బోర్డు కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది.

దామచర్ల కుటుంబంలో ఆధిపత్య పోరు

రాజకీయంగా జిల్లాలో దామచర్ల అంజనేయులు వారసులుగా జిల్లాలో అటు జనార్దన్, ఇటు సత్య ఇరుపురు టీడీపీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల కాలంలో దామచర్ల కుటుంబంలో ఆధిపత్య పోరు మొదలైందన్న ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా ఎమ్మెల్యే జనార్ధన్‌కు సత్యకు మధ్య నడుస్తుంది రాజకీయ ఆధిపత్య పోరా లేకుంటే కుటుంబంలో ఆస్తుల వివాదమా అన్నది అంటుపట్టకపోయినా.. వారిద్దరి మధ్య సత్సంబంధాలు బాగా తగ్గిపోయాయంట.

ఎన్నికల తర్వాత అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరు

ఈ అన్నదమ్ములు ఎన్నికల ముందు వరకు రామలక్షణుల్లా కనిపించారు. ఎన్నికల తర్వాత అన్న తమ్ముడు మధ్య అధిపత్యపు పోరు కనపడుతుంది. సత్య మారిటైం బోర్టు ఛైర్మన్ హోదాలో విజయవాడతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల టీడీపీ ఇన్చార్జిగా ఉన్నారు. దాంతో ఆయన అక్కడి రాజకీయాలకు పరిమితం కావాలని, జనర్ధన్ అంటున్నారంట. ఒంగోలులో రాజకీయాల్లో సత్య జోక్యం చేసుకోవద్దని, జనార్ధన్ టిడిపిలోని సత్య సన్నిహితుల వద్ద చెప్పారంట. కానీ ఎమ్మెల్యే జనార్దన్ కండిషన్స్‌కు సత్య ఒప్పుకోలేదంటున్నారు.

ఒంగోలు సత్యని ఆఫీసు పెట్టవద్దని సూచించిన జనార్ధన్

ఇటీవల ఒంగోలులో నెల్లూరు బస్టాండ్ వద్ద ఓ హోటల్ పక్కన మంత్రి బాలవీరాంజనేయస్వామి క్యాంప్ ఆఫీస్‌తో పాటు సత్య ఆఫీసు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఒంగోలులో మంత్రి స్వామి క్యాంప్ ఆఫీసు, సత్య ఆఫీసు ఉండకూడదని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సత్యకు సూచించారంట. ఒంగోలులో మంత్రి, సత్య ఆఫీసులు సెపరేట్‌గా ఉండటం మంచిది కాదని అవసరమైతే ఒంగోలు టీడీపీ ఆఫీస్ లో మంత్రి స్వామి క్యాంపు ఆఫీసు ఏర్పాటు చేసుకోవాలని జనార్దన్ సూచించారంట.

కొండేపి వ్యవహారాల్లో వేలుపెడుతున్న దామచర్ల జనార్ధన్

అయితే సోదరుడు ఎమ్మెల్యే జనార్దన్ సూచనలను లైట్ తీసుకొని మంత్రి క్యాంప్ ఆఫీస్ తో పాటు సత్య తన ఆఫీసుని ప్రారంభించారంట. దాంతో ఇద్దరి మధ్య గ్యాప్ మరింత పెరిగిందంటున్నారు. ఒంగోలులో వారి ఆఫీసులు ఏర్పాటు చేయడం వల్ల జనర్ధన్ రాజకియంగా తన ప్రాబల్యం తగ్గుతుందని భావనలో ఉన్నట్లు తెలుస్తోంది.. కొండేపి నియోజకవర్గంలో కొన్ని విషయాలలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనర్ధన్ వేలూ పెట్టడం ఈ గ్యాప్ కి ఓ కారణమని మరికొందరు చర్చించుకుంటున్నారు.

సత్య పుట్టిన రోజు సందర్భంగా ఒంగోలులో ఫ్లెక్సీలు

తాజాగా ఒంగోలులో దామచర్ల సత్య పుట్టిన రోజు సందర్భంగా కొండేపి నియోజకవర్గంతో పాటు ఒంగోలులో కూడా సత్య అభిమానులు కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఒంగోలు మున్సిపల్ సిబ్బంది దామచర్ల సత్య పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. అంతే కాకుండా ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో డివైడర్లు మరమ్మతులు జరుగుతున్నాయని, ఎవరు ఫ్లెక్సీలు కట్టినా శిక్షార్హులని నోటీసులు జారీ చేశారు. దాని వెనుక సత్య సోదరుడు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఉన్నారని, ఆయనే ఫ్లెక్సీలను తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని సత్య అభిమానులు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు.

పార్టీకి నష్టం జరుగుతుందని తమ్ముళ్ళ ఆవేదన

ఫ్లెక్సీలు తొలగిస్తున్న దృశ్యాలను కొంతమంది చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. మొత్తం మీద పరిశీలిస్తే గత కొంతకాలంగా దామచర్ల కుటుంబంలో ఉన్న వివాదాలు ఒక్కసారిగా బహిర్గతం కావడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య పోరుతో తప్పకుండా తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుందని పార్టీ కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఫ్లెక్సీలతో మొదలైన ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి

Tags

Related News

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

Big Stories

×