E-Paper
Advertisement

మీమ్స్ తో మంట పెడుతున్న ‘కాక్రోచ్ పార్టీ’.. అభిజీత్ ప్లాన్ ఏంటి?

మీమ్స్ తో మంట పెడుతున్న ‘కాక్రోచ్ పార్టీ’.. అభిజీత్ ప్లాన్ ఏంటి?

Cockroach Party: కాక్రోచ్ పార్టీని లీడ్ చేస్తున్నది ఎవరో కాదు.. జెన్ జీల ఆగ్రహం నుంచే ఈ పార్టీ పుట్టింది.. పార్టీ వెబ్‌సైట్, గూగుల్ ఫామ్ ద్వారా కేవలం 72 గంటల్లోనే 1 లక్ష మందికి పైగా యూత్ సభ్యులుగా నమోదైయ్యారు. మెంబర్ షిప్ ప్రారంభించిన మొదటి 48 గంటల్లోనే ఈ సంఖ్య 40 వేల దాటింది.

జెన్ జీల జోష్‌తో దూసుకెళ్తున్న నయా పార్టీ..!

ఇక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అయితే ఈ పార్టీకి ఊపు వేరే లెవెల్ లో ఉంది. మే 20 నాటికి 37 లక్షల మంది ఫాలోవర్లుగా మారారు. ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై కేవలం రెండు రోజుల్లోనే ఫాలోవర్ల సంఖ్య 50 వేలు దాటింది. ఇది మామూలు పార్టీ కాదు భయ్యా… ఇది జెన్ జీల నయా జెనరేషన్ పార్టీ. ఇది అసలైన పొలిటికల్ పార్టీనా.. లేదంటే సోషల్ మీడియాలో సెటైరికల్ పార్టీనా అన్న విషయాలను పక్కన పెడితే ప్రస్తుతానికైతే ట్రెండింగ్ లో ఉన్న పార్టీ. అంతటా చర్చనీయాంశమవుతున్న పార్టీ.

అభిజీత్ ప్లాన్ ఏంటి..?

ఇతడి పేరు అభిజీత్ దీప్కే.. బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. ఇతడే ఈ కాక్రోచ్ పార్టీని లీడ్ చేస్తున్నాడు. అభిజీత్ కు ఇక్కడేం పని అనుకుంటున్నారా..? అక్కడే అసలైన పొలిటికల్ గేమ్ ఉంది.. దేశంలో జెన్ జీల ఉద్యమానికి దారి తీస్తోందా? ఇలాంటి చర్చ ఇప్పుడు అంతటా జరుగుతోంది. మరి ఉన్నట్లుండి ఈ కొత్త పార్టీ ఎలా పుట్టింది? వెరైటీగా బొద్దింకల జనతా పార్టీ అని పేరెందుకు పెట్టారు? ఎవర్ని టార్గెట్ చేస్తున్నారు? ఏం జరిగింది? ఇప్పుడిదే అంతటా జరుగుతున్న చర్చ.

కాక్రోచ్ పార్టీ పుట్టుక వెనుక ఉన్న అసలు వివాదం

అసలు మ్యాటర్ తెలియాలంటే.. మే 15న సుప్రీం కోర్టులో ఓ ఇన్సిడెంట్ గురించి తెలుసుకోవాలి. మే 15, 2026న సీనియర్ న్యాయవాదుల హోదా కేటాయింపు నియామకాల ఆలస్యంపై దాఖలైన ఒక కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చీలతో కూడిన బెంచ్ విచారించింది. ఆ పిటిషన్ అనవసరమైందని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా, కొంతమంది ప్రవర్తనను ఉద్దేశించి సీజేఐ ఘాటు కామెంట్స్ చేశారంటున్నారు. సమాజంలో వ్యవస్థలపై దాడి చేసే కొంతమంది ఇప్పటికే ఉన్నారని, బొద్దింకల్లాంటి కొంతమంది మీడియా, సోషల్ మీడియా, ఆర్‌టీఐ కార్యకర్తలుగా మారి అందరిపై దాడులు చేయడం మొదలుపెడతారన్నట్లుగా కామెంట్స్ చేశారంటున్నారు. ఇదొక వెర్షన్. ఈ కామెంట్స్ దేశంలోని నిరుద్యోగ యువతను కించపరిచేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వివిధ వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.

Also Read: మద్యం ప్రియులకు షాక్​.. త్వరలో పెరగనున్న ధరలు.. సిఫార్సు చేసిన కమిటీ!

వైరల్ వివాదంపై సీజేఐ అధికారిక ప్రకటన

ఈ వివాదం ముదరడంతో మరుసటి రోజే అంటే మే 16న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఒక అధికారిక ప్రకటన ద్వారా వివరణ ఇచ్చారు. మీడియాలోని ఒక వర్గం తన వ్యాఖ్యలను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుని, వక్రీకరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలు దేశంలోని సాధారణ యువతను లేదా నిరుద్యోగులను ఉద్దేశించినవి కావని, న్యాయవ్యవస్థలోకి నకిలీ బోగస్ డిగ్రీలతో ప్రవేశించి, వ్యవస్థను పాడుచేస్తున్న వారిని మాత్రమే తాను పరాన్నజీవులు అన్నానని స్పష్టం చేశారు. ఇలాగే నకిలీ ఐడెంటిటీలు ఉన్న కొందరు వ్యక్తులు మీడియా, సోషల్ మీడియా ఇతర గౌరవప్రదమైన వృత్తుల్లోకి కూడా చొరబడ్డారని, వారి గురించే తాను మాట్లాడానని చెప్పారు. దేశ యువతను తాను విమర్శించాననడం పూర్తిగా ఆధారం లేనిదన్నారు. యువత దేశ వికాసానికి మూలస్తంభాలు అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. తాను కేవలం కోర్టుల పరువు తీసేలా వ్యవహరించే నకిలీ వ్యక్తుపైనే మాట్లాడానన్నారు.

జెన్ జీ కోపానికి కొత్త రూపం

రైట్.. ఇప్పుడు మళ్లీ కాక్రోచ్ జనతా పార్టీ దగ్గరికి వద్దాం. ఆల్ ఆఫ్ సడెన్ గా అయితే ఈ పార్టీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇది పడి లేచిన కెరటంగా మారుతుందా.. లేదంటే చల్లారుతుందా అన్నది తర్వాతి సంగతి. ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో కాక్రోచ్ మేనియానే. నిరుద్యోగం, పేపర్ లీకేజీలు ఇలాంటి తీవ్రమైన సమస్యలపై పాత పద్ధతిలో కాకుండా, మీమ్స్ అలాగే సెటైర్లతో నిరసన తెలపడం ఈ పార్టీ స్పెషల్ గా మారింది. యూత్ అంతా ఇప్పుడు మై భీ కాక్రోచ్ అంటూ ఈ పార్టీలో భారీగా చేరుతున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆన్‌లైన్ పొలిటికల్ గ్రూప్ గా మారింది. ఇంటర్నెట్ జోక్‌గా ప్రారంభమైన ఈ ఉద్యమం, ఇప్పుడు కామెడీ, రాజకీయ ఆగ్రహం, జెన్ జీ ఇంటర్నెట్ కల్చర్ ను జాయింట్ చేస్తూ డిజిటల్ ఉద్యమంగా మారింది. ప్రతిపక్ష నాయకులు, మీమ్ పేజీలు, విద్యార్థులు, నిపుణులు అందరూ ఈ ట్రెండ్‌ను వైరల్ చేసి కాక్రోచ్ పార్టీ యాక్షన్ ప్లాన్ పెరిగేందుకు కారణమయ్యారు.

మీమ్స్‌తో మంట పెడుతున్న కాక్రోచ్ పార్టీ..!

సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో ఈ పార్టీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఒక్కసారి ఈ పోస్ట్ చూడండి.. ( YAMUNA CLEANING ) యమునా నదిని బొద్దింక సెటప్ లో క్లీన్ చేస్తూ ఈ వీడియో తీశారు. నిరుద్యోగానికి ఇది నిలువుటద్దం అంటూ రాసుకొచ్చారు. ఇక్కడ చూడండి.. ఇదీ తాజా నీట్ లీకేజీ గురించి చేసిన మీమ్. ముఖమంతా కాక్రోచ్. NTA చేసిన తప్పులు, కేంద్రం చేసిన తప్పుల్ని ఎండగడుతూ, పిల్లలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో ర్యాప్ సాంగ్ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు.

రాజకీయ సెటైర్‌తో పాటు యాక్షన్ ప్లాన్ కూడా..!

సోమరిపోతులు, నిరుద్యోగుల గొంతుక అన్న ట్యాగ్‌లైన్‌ను పెట్టి, వ్యవస్థ లెక్కలోకి తీసుకోవడం మరిచిపోయిన ప్రజల పక్షాన తమ పార్టీ నిలుస్తుందని కాక్రోచ్ జనతా పార్టీలో రాసుకొచ్చారు. దేశ ప్రజలు పన్నులతో కడుతున్న డబ్బు ఎక్కడికి పోయిందని గట్టిగా, పదేపదే, అడగడానికే తాము ఇక్కడ ఉన్నామంటూ రాసుకొచ్చారు. ఇదే సైట్‌లో సభ్యత్వ ఫారాలు, పొలిటికల్ స్లోగన్స్, అలాగే ఆన్‌లైన్ ప్రచారాలు, చర్చలలో పాల్గొనేలా యూత్ కు సిగ్నల్ ఇచ్చేలా కార్యాచరణ కనిపిస్తోంది.

Also Read: జగిత్యాల జిల్లాలో విషాదం.. కోనేరులో మునిగి ముగ్గురు చిన్నారుల మృతి!

కాక్రోచ్ పార్టీ మేనిఫెస్టోలో హాట్ డిమాండ్స్..!

కాక్రోచ్ జనతా పార్టీ మేనిఫెస్టో పేరుతో కొన్ని కీలక విషయాలను ప్రస్తావించింది. అవన్నీ ఆలోచింపజేసేలా ఉన్నాయంటున్నారు. పార్టీ మేనిఫెస్టో, ప్రజాస్వామ్య సంస్థల జవాబుదారీతనం, రాజకీయ డిమాండ్లతో పాటు సెటైర్లు కూడా మేనిఫెస్టోలో ఉన్నాయి. వీళ్లు ప్రస్తావించినవేంటో ఓసారి చూద్దాం. క్యాబినెట్ పదవుల్లో మహిళలకు 50% రిజర్వేషన్, రాజకీయ పార్టీలు మారే ఎమ్మెల్యేలు, ఎంపీలపై 20 ఏళ్ల ఎన్నికల నిషేధం, జడ్జిలు పదవీ విరమణ తర్వాత రాజ్యసభ పదవులపై నిషేధం, గోడీ మీడియా యాంకర్ల బ్యాంకు ఖాతాలపై విచారణ, ఎన్నికల సమయంలో చట్టబద్ధమైన ఓట్లను తొలగిస్తే చర్యలు తీసుకోవడం ఇలాంటివి ఉన్నాయి. దీనిపై ఓ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. సో గ్రౌండ్ క్లియర్ గా ఉంది. మ్యాటర్ హాట్ గా ఉంది. కథలో డెప్త్ ఉంది. మొత్తంగా బొద్దింకల పార్టీ ట్రెండింగ్ లో ఉంది. ఇది ఎటు దారి తీస్తుందన్నది మాత్రం క్లారిటీ లేదు.

కాక్రోచ్ పార్టీ ఎదుగుదలకు ఇవే కారణాలా..?

తన వ్యాఖ్యలపై ప్రధాన న్యాయమూర్తి వివరణ ఇచ్చినప్పటికీ ఆన్‌లైన్‌లో మాత్రం ఇది చల్లారడం లేదు. కాక్రోచ్ జనతా పార్టీ వైరల్ గా మారడానికి చాలానే కారణాలు కనిపిస్తున్నాయ్. ఓవైపు జనంలో అసంతృప్తి, ఇంకోవైపు వ్యవస్థలపై నమ్మకం పోవడం, నిరుద్యోగం, పరీక్షల వివాదాలు, పేపర్ లీక్ లు, ఇలాంటి చాలా అంశాలపై చాలా మందిలో పెరుగుతున్న అసంతృప్తికి, ఈ కాక్రోచ్ పార్టీ స్పీడ్ గా ఎదుగుదలకు లింక్ ఉన్నట్లు కనిపిస్తోంది. సెటైరికల్ మీమ్ లు, ప్రభుత్వ వ్యతిరేక మెసేజ్ లు సోషల్ మీడియాలో అటెన్షన్ క్రియేట్ చేశాయి. రాజ్యాంగానికి, భావ ప్రకటనా స్వేచ్ఛకు సంరక్షకుడిగా ఉండాల్సిన సుప్రీంకోర్టు సీజేఐ, యువతపై చేసిన విమర్శలు భారత్ లాంటి ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదని అభిజిత్ అంటున్నాడు.

ఇదే కాక్రోచ్ పార్టీ అర్హతలు..!

యువత గొంతు వినిపించేందుకు అవసరమైతే, బొద్దింక గుర్తింపును తామే స్వీకరించామంటున్నాడు. బొద్దింకలు కేవలం మురికి, కుళ్ళిపోయిన ప్రాంతాల్లోనే ఉంటాయనే సందేశాన్ని కూడా ఇది ఇస్తుందని, ఇది దేశ వ్యవస్థ ఎంతగా కుళ్లిపోయిందంటే, ఇప్పుడు బొద్దింకలు బయటకు రావాల్సి వస్తోందని అర్థం అని అభిజిత్ చెబుతున్న మాట. కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులుగా చేరాలంటే కొన్ని అర్హతలు కూడా పెట్టారు. నిరుద్యోగి అయి ఉండాలి. లేజీగా ఉండాలి. ఎక్కువ సేపు ఆన్ లైన్ లోనే ఉండాలి. విమర్శించే కెపాసిటీ ఉండాలంటున్నారు. తన స్నేహితులు ఏఐ ఆధారిత టూల్స్ సహాయంతో కేవలం కొన్ని గంటల్లోనే వెబ్‌సైట్ బ్రాండింగ్‌ను రూపొందించినట్లు అభిజిత్ అంటున్నాడు. తమ సిద్ధాంతం గాంధీ, అంబేద్కర్ నెహ్రూల నుంచి ప్రేరణ పొందిందని అన్నారు.

Also Read: ట్విస్ట్ అదిరింది.. ఆలూ చిప్స్, వాటర్ బాటిల్స్ అనుకుంటే షాకే.. లోపల రూ.3 కోట్ల గంజాయి!

కాక్రోచ్ పార్టీకి కొత్త చిక్కు..!

ఆన్ లైన్ లో మొదలైన ఓ ఉద్యమానికి నాలుగు రోజుల్లోనే విపరీతమైన ఆదరణ వస్తే కథ ఎలా ఉంటుంది? మొత్తం దేశమంతా అటే అటెన్షన్ తో ఉంటుంది కదా. అవును ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి పెద్ద చిక్కే వచ్చి పడుతోంది. సోషల్ మీడియా హ్యాండిల్ అకౌంట్లన్నీ హ్యాక్ చేసే కథ నడుస్తోంది. దీనిపై అభిజీత్ ఘాటుగానే రియాక్ట్ అయ్యాడు.

సెటైర్‌తో రాజకీయాలపై దాడి

దేశంలో తాజాగా జరుగుతున్న పరిణామాలపై సెటైరికల్ బాణంగా వచ్చిందే ఈ కాక్రోచ్ జనతా పార్టీలు. సెక్యులర్‌, సోషలిస్ట్‌, డెమోక్రటిక్‌, లేజీ తమ నినాదమని ప్రకటించాడు ఫౌండర్ అభిజిత్. ఇదంతా బయటి నుంచి చూస్తే కాస్త వింతగానే అనిపిస్తుంటుంది. కానీ కథ మాత్రం మరోలా ఉందిప్పుడు. పార్టీ యువత కోసం తమ పార్టీ పని చేస్తుందని, ప్రజల సొమ్ము ఎటు పోతుందో నిలదీయటానికి పార్టీ పెట్టామంటున్నారు. అటు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా కూడా రియాక్ట్ అయ్యారు. తన అర్హతల గురించి ప్రస్తావిస్తూ.. తనకు యాంటీ నేషనల్‌ పార్టీ సభ్యత్వం ఉందని, మీతో కలిసి పని చేయవచ్చా? అని ప్రశ్నించారు. యాంటీ నేషనల్‌ అంటూ బీజేపీ మద్దతుదారులు తనపై చేసే ఆరోపణలను సెటైరికల్ గా తిప్పికొడుతూ ఆమె ఇలా రియాక్ట్ అయ్యారు. దీనికి సీజేపీ బదులిచ్చింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడే యోధురాలైన మీకు స్వాగతం అంటూ జవాబిచ్చారు. అలాగేతృణమూల్‌కే చెందిన మరో ఎంపీ, మాజీ క్రికెటర్‌ కీర్తి ఆజాద్‌.. సీజేపీలో చేరటానికి అర్హతలేమిటి అని ప్రశ్నించగా.. 1983 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ను గెల్చుకోవటానికి మించిన అర్హత ఏముంటుందన్న జవాబు కాక్రోచ్ పార్టీ నుంచి వచ్చింది.

కాక్రోచ్ ఫౌండర్ క్లారిటీ

ప్రస్తుతం ట్రెండింగ్ చూస్తుంటే.. బంగ్లాదేశ్ , నేపాల్ మాదిరి భారత్ లోనూ జెన్ జీ ఉద్యమం జరగబోయేందుకు సంకేతమా అన్న చర్చ జరుగుతోంది. దీనిపై ఫౌండర్ క్లారిటీ ఇచ్చారు. మన జెన్ జీలు చాలా ఆలోచనా పరులు అని, చట్టంపై, రాజ్యాంగంపై గౌరవం ఉందని, మెచ్యూర్ గా ఆలోచిస్తారని కంపారిజన్స్ వద్దన్నాడు.

సీజేపీ అజెండాకు కొత్త సూచనలు

సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్‌ సీజేపీ అజెండాకు కొన్ని అదనపు అంశాలను సూచించారు. సమాచార హక్కు చట్టం కింద ప్రజలకు పార్టీ జవాబుదారీగా ఉండాలని, ఎలక్టోరల్‌ బాండ్స్‌తో సహా అజ్ఞాత వ్యక్తులు ఇచ్చే విరాళాల్ని స్వీకరించొద్దని, ఏనాటికి కూడా సీక్రెట్ గా కాక్రోచ్‌ కేర్స్‌ ఫండ్‌ను ప్రారంభించవద్దంటూ కామెంట్లు చేశారు. వీటికి సీజేపీ మద్దతు తెలపటమే కాదు.. తమ మేనిఫెస్టోలో భాగం చేస్తున్నామని చెప్పింది. తమను ఇలా ఉత్సాహపరచడమే కావాలని తెలిపింది. ఉనికిలోకి రావటంతోనే సంచలనంగా మారిన సీజేపీ నిజంగానే రాజకీయ పార్టీగా మారుతుందా? అన్నది ప్రస్తుతానికి క్లారిటీ లేదు.

సీజేపీ మేనిఫెస్టోలో సంచలన హామీలు..!

తమ జెండా అజెండాలో కొన్ని కీలక అంశాలను కాక్రోచ్ పార్టీ ప్రస్తావిస్తోంది. నిజమైన ఏ ఒక్క ఓటరు ఓటు హక్కు కోల్పోకుండా చేస్తామని, ఓటింగ్‌ హక్కుల నిరాకరణ ఉగ్రవాదానికి ఏమాత్రం తక్కువ కాదన్నది. పార్లమెంటు సీట్ల సంఖ్యను పెంచకుండానే సగం సీట్లను మహిళలకు కేటాయిస్తామని, కేంద్ర క్యాబినెట్‌లో సగం పదవులు వారికే ఇస్తామన్నారు. అదానీ, అంబానీలకు చెందిన అన్ని మీడియా సంస్థల లైసెన్సులు రద్దు చేస్తామని, గోదీ మీడియా యాంకర్ల బ్యాంకు ఖాతాలపై దర్యాప్తు జరిపిస్తామన్నారు. దేశంలో నిజమైన స్వతంత్ర మీడియా పని చేయటానికి దారులు వేస్తామని ఇలాంటివెన్నో ప్రకటించారు.

కాక్రోచ్ పార్టీ కథలో డెప్త్ ఇదే..!

కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్తుతానికి సెటైరికల్ పార్టీగానే కనిపిస్తున్నప్పటికీ కథ చాలా పెద్దదిగానే కనిపిస్తోంది. ఉద్యోగ అవకాశాలు లేక, వ్యవస్థల్లోని లోపాల వల్ల ఇబ్బంది పడుతున్న యువత తమ అసంతృప్తిని తెలపడానికి ఈ కాక్రోచ్ అనే పదాన్ని ఒక ఆయుధంగా మార్చుకుంటున్నారు. తక్కువ చేసి మాట్లాడిన పదాన్నే తమ గుర్తింపుగా మార్చుకుని నిరసన తెలపడం ఇందులో కనిపిస్తుంది. ఈ డిజిటల్ వరల్డ్ లో ఏ చిన్న కాంట్రోవర్శీ కామెంట్ వచ్చినా, దానిపై మీమ్స్ హ్యాష్‌ట్యాగ్‌లతో సరికొత్త ట్రెండ్ సృష్టించడం కామనైపోయింది. కాక్రోచ్ జనతా పార్టీ కూడా అలాంటి ఒక ఇంటర్నెట్ ట్రెండ్ మాత్రమే. వ్యవస్థలను ప్రశ్నించే సోషల్ మీడియా ఆక్టివిస్టులు, ఆర్‌టీఐ కార్యకర్తలపై వచ్చే విమర్శలను తిప్పికొట్టడానికి యువత ఈ వర్చువల్ పార్టీని వేదికగా వాడుకుంటున్నారు. సైంటిఫిక్ కోణంలో చూస్తే బొద్దింక అన్నది ఎలాంటి కఠిన పరిస్థితులనైనా తట్టుకుని నిలబడే ఒక జీవి. రాజకీయ విశ్లేషణ పరంగా చూస్తే.. సమాజంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలు, రాజకీయ ఒత్తిడులు ఎదురైనా సామాన్య యువత సగర్వంగా బతుకు బండిని లాగిస్తోంది. ఈ పోరాట పటిమను, పట్టుదలను కూడా ఈ కాక్రోచ్ అనే లైఫ్ స్టైల్ తో కొందరు ముడిపెడుతున్నారు.

కాక్రోచ్ పార్టీ.. పెద్ద ఉద్యమానికి నాందినా..?

ప్రస్తుతానికి ఇది నిజమైన రాజకీయ పార్టీ కాదు. కానీ సమాజంలో యువత ఎదుర్కొంటున్న మానసిక ఘర్షణకు, నిరుద్యోగ సమస్యకు డిజిటల్ ప్రపంచంలో వారు చూపిస్తున్న సెటైరికల్ స్టైల్ కు ఇది అద్దం పడుతోంది. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీ త్వరలోనే యువత కోసం ఆన్‌లైన్ సదస్సులు కూడా నిర్వహించడానికి ప్లాన్ చేస్తోంది. అయితే ఈ పార్టీ కేవలం ఇంటర్నెట్ ఆధారిత నిరసన వేదికగానే మిగిలిపోతుందా లేక మరింత పెద్దదిగా ఎదుగుతుందా అన్నది చూడాలి.

Also Read: ఘోస్ట్ సిమ్‌ల గుండెల్లో ‘ఆక్టోపస్’.. 18 ప్రత్యేక బృందాలు.. 66 మంది అరెస్ట్!

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×