Delimitationz: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మళ్లీ డీలిమిటేషన్ రాజకీయం తీవ్ర రూపం దాల్చింది. వర్షాకాల సమావేశాలను ఆగస్టు 13న వాయిదా వేసినా.. ప్రొరోగ్ చేయలేదంటూ కేంద్రమంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద కలకలమే రేపాయి. ప్రభుత్వం ఏ క్షణంలోనైనా సభను మళ్లీ సమావేశపరిచి ప్రత్యేక బిల్లులు తెచ్చే అవకాశం ఉందన్న వార్తలు విపక్షాల్లో కాకరేపుతున్నాయి.
ఈ ప్రచారం ఊపందుకోవడంతో ప్రధాని మోదీకి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపే నియోజకవర్గాల పునర్విభజన లాంటి సున్నితమైన అంశంపై కేంద్రం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకూడదని స్పష్టం చేశారు. బుల్డోజర్ తరహా నిర్ణయాలను పునరావృతం చేయవద్దని హెచ్చరిస్తూ.. కాంగ్రెస్ తరఫున మూడు కీలక డిమాండ్లను ప్రధాని ముందుంచారు.
Also read: కొరివితో తలగోక్కోవడం అంటే ఇదే మరి… వైరల్ వీడియో కోసం వెళ్ళి 1500 ఏళ్ల దుష్టశక్తిని నిద్ర లేపారు
ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 543 స్థానాల సంఖ్యను, రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని మార్చకుండా మరో 25 ఏళ్ల పాటు ఇలాగే కొనసాగించాలని ఖర్గే కోరారు. అలాగే డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా 2029 లోక్‌సభ ఎన్నికల నాటికే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. గతంలోనూ జులై 16న తాను రాసిన లేఖను గుర్తుచేసిన ఖర్గే.. తక్షణమే అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విపక్షాల డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారింది.
Also read: కొరివితో తలగోక్కోవడం అంటే ఇదే మరి… వైరల్ వీడియో కోసం వెళ్ళి 1500 ఏళ్ల దుష్టశక్తిని నిద్ర లేపారు