E-Paper
Advertisement

నెల్లూరు మేయర్‌ అభ్యర్థిగా ఆనం.. వైసీపీ అసలు వ్యూహం ఇదేనా?

నెల్లూరు మేయర్‌ అభ్యర్థిగా ఆనం.. వైసీపీ అసలు వ్యూహం ఇదేనా?
Advertisement

Nellore Mayor Election: రాష్ట్రంలో నెల్లూరు రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే. కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సామాజిక సమీకరణలపై పార్టీల్లో కసరత్తు మొదలైంది. మేయర్ రిజర్వేషన్ ఇంకా ఖరారు కాలేదు. అయితే కూటమి మాత్రం నెల రోజుల ముందే రూప్‌కుమార్ యాదవ్ పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతులు ఈ ఎంపికలో కీలకంగా వ్యవహరించారని సమాచారం. దీంతో వైసీపీ కూడా తన వ్యూహాలకు పదునుపెట్టింది. తాడేపల్లిలో జగన్‌తో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులు సమావేశమయ్యారు. ఆ సమావేశం తర్వాత..నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించారు.

ఓసీ వస్తే ఆనం.. బీసీ అయితే ఎవరు?

Advertisement

రిజర్వేషన్ తేలకముందే వైసీపీ అభ్యర్థిని ప్రకటించడం వెనుక రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. ఓసీ రిజర్వేషన్ వస్తే ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి వైసీపీ అభ్యర్థి. బీసీ రిజర్వేషన్ వస్తే మరో బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు వైసీపీ సిద్ధంగా ఉంది. మరోవైపు రూప్‌కుమార్ యాదవ్ బీసీ సామాజికవర్గానికి చెందిన నేత. ఓసీ రిజర్వేషన్ వస్తే, టీడీపీ కావాలనే బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపిందనే రాజకీయ ప్రచారానికి అవకాశం ఉంటుందని వైసీపీ భావిస్తోందంటున్నారు. ఇదే సమయంలో కూటమి కూడా ఇప్పుడు అభ్యర్థిని మార్చుతుందా, రిజర్వేషన్ బీసీలకే వస్తే రూప్‌కుమార్ యాదవ్‌నే కొనసాగిస్తారా లేక కొత్త అభ్యర్థిని తీసుకొస్తారా? అన్నది ఆసక్తిగా మారింది.

ఆనం ఎంపికలో మరో కీలక కోణం..

Advertisement

ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి ఎంపికలో మరో కీలక కోణం ఉంది. ఆయన కేవలం మేయర్ అభ్యర్థి మాత్రమే కాదు. నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్‌చార్జి కూడా. ఆయనని నెల్లూరు మేయర్ పీఠం కోసం రంగంలోకి దింపితే… మరి రూరల్ ఇన్‌చార్జి బాధ్యతలు ఏం అవుతాయి? అన్న ప్రశ్న వస్తోంది. ఇదే సమయంలో నెల్లూరు రూరల్‌పై మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆసక్తి చూపుతున్నారన్న ప్రచారం ఉంది. విజయ్‌కుమార్‌రెడ్డి మేయర్ బరిలోకి రావడంతో… రూరల్‌లో కొత్త రాజకీయ సమీకరణాలకు వైసీపీ తెరతీస్తుందా? అనిల్‌కుమార్ యాదవ్‌కు రూరల్ బాధ్యతలు అప్పగించే ఆలోచన ఉందా..? లేక విజయ్‌కుమార్‌రెడ్డే మేయర్ ఎన్నిక పూర్తయ్యే వరకు రూరల్ ఇన్‌చార్జిగా కొనసాగుతారా..?అన్న చర్చ నడుస్తోంది.

Also Read: 150 ఏళ్ల చరిత్ర ఉన్న నాంపల్లి స్టేషన్ గురించి మీకు తెలుసా?

Tags

Related News

మెట్రో పనుల వద్ద కుంగిన రోడ్డు.. గుంతలో ఇరుక్కుని బోల్తా పడ్డ కారు

పిడుగురాళ్లలో దారుణం.. పోలీస్ స్టేషన్ ముందే మహిళను నరికి చంపిన సైకో!

ఏపీ, తెలంగాణలో దసరా సెలవుల షెడ్యూల్ విడుదల!

తిరుమల లడ్డూలో కల్తీ నిజమే, జంతు కొవ్వు లేదన్న విజయసాయి రెడ్డి, ఇంకా ఏమన్నారంటే..

ఇద్దరు అధినేతల నుంచి సంకేతాలు.. ఫుల్‌జోష్‌లో వంగవీటి రాధా, నాలుగు దశాబ్దాల యుద్ధం ఖాయమా?

నా రూటే సెపరేటు.. ఆశ-ఆసక్తి లేదన్న బండ్ల గణేష్, తెర వెనుక అసలు ఏం జరిగింది?

మోదీ 25 ఏళ్ల పాలన పై వైఎస్ షర్మిల సెటైర్లు.. ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×