E-Paper
Advertisement

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై క్రెడిట్ వార్..!

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై క్రెడిట్ వార్..!
Advertisement

Double Bedroom: కొబ్బరికాయ కొట్టింది ఒకరు.. గుమ్మడికాయ కొట్టింది మరొకరు.. హన్మకొండ డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ వేదికపై ఇదే సీన్ కనిపించింది. డబుల్ బెడ్రూం తాము కట్టించామంటే లేదు.. లేదు తామే కట్టించామంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెట్టారు. బీఆర్ఎస్ హయాంలో సగం చేసి వదిలేస్తే.. తామే పూర్తి చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అనడంతో అదే వేదికపై ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. బరాబర్ కేసీఆరే కట్టించారంటూ చెప్పుకొచ్చారంటూ సవాల్ చేశారు. ఈ సీన్ చూసిన రెండు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ సభా వేదిక వైపు దూసుకెళ్లడంతో ఒక్కసారిగా ఇళ్ల పంపిణీ పండుగ గందరగోళంగా మారింది.

కట్టింది బీఆర్ఎస్సా? పూర్తి చేసింది కాంగ్రెసా?

Advertisement

డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టింది బీఆర్ఎస్సా? పూర్తి చేసింది కాంగ్రెసా? అన్నది పక్కనపెడితే.. దశాబ్దాలుగా ఇళ్లు లేక అల్లాడుతున్న పేదలకు తాళాలు అప్పగించే పవిత్రమైన వేదికను.. రాజకీయ రగడగా మార్చడం ఎంతవరకు సమంజసం. క్రెడిట్ నాదంటే నాది అని కొట్టుకోవడం మాని.. మిగిలిన ఇళ్లను కూడా త్వరితగతిన పూర్తి చేసి అర్హులకు అందించడమే ప్రజాప్రతినిధులు చేయాల్సిన అసలైన బాధ్యత.

Tags

Related News

కేంద్రం నిర్ణయాలతో ధరల సూచి హైక్.. ధరల మంటతో సామాన్యుడి విల విల!

బిఆర్ఎస్‌కు బిగ్ షాక్ ఇవ్వబోతున్న మల్లారెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి..?

తెలంగాణలో పవన్ కళ్యాణ్ మాస్టర్ స్ట్రోక్.. పార్టీ పటిష్టం కోసం వేసిన స్కెచ్ ఇదే!

పక్కనే ఉంటూ యువనేత పుట్టిముంచనున్న ఆ ఇద్దరు..! మొన్నటి దాకా జీవన్‌రెడ్డి.. ఇప్పుడు కౌషిక్‌రెడ్డి.. !

ఖైరతాబాద్ ఎఫెక్ట్.. తెలంగాణ బీజేపీపై అమిత్ షా ఫుల్ ఫోకస్!

ఖైరతాబాద్‌పై కాంగ్రెస్‌లో మొదలైన పరేషాన్.. జంకుతున్న ఆ కీలక నేతలు?

తెలంగాణలో మహిళలకు భారీ గుడ్ న్యూస్.. రూ. 2.50 కోట్లతో కొత్త ప్రాజెక్ట్!

నిమజ్జనం పాటలను కూడా వదలని కేటీఆర్‌..! కేసీఆర్‌ను జనం మరవలేదని చెప్పేందుకు మరీ ఇంత అల్పత్వమా? ఆ సినిమా చూసి… కేసీఆర్‌ను తక్కువ చేసి…

Big Stories

Advertisement
×