E-Paper
Advertisement

పోలీసులకు హింట్ ఇచ్చి మరీ చంపే కిల్లర్… ట్విస్టుల మీద ట్విస్టులు… సీజన్ 2 రచ్చ షురూ

పోలీసులకు హింట్ ఇచ్చి మరీ చంపే కిల్లర్… ట్విస్టుల మీద ట్విస్టులు… సీజన్ 2 రచ్చ షురూ
Advertisement

Crime Drama OTT : పోలీసుల జీవితం అంటే నేరస్థులను పట్టుకోవడం, కేసులను పరిష్కరించడం మాత్రమే కాదు. విధి నిర్వహణలో ఎదురయ్యే ప్రమాదాలు, కుటుంబ సమస్యలు, సహోద్యోగులతో ఏర్పడే విభేదాలు కూడా ఎఫెక్ట్ చేస్తుంటాయి. ఓ పోలీసు అధికారి కొత్త నగరానికి వెళ్లి అక్కడి బృందంతో కలిసి పని చేయాల్సి వస్తే, కొత్త వాతావరణానికి అలవాటు పడటంతో పాటు కొత్త కేసులను కూడా సాల్వ్ చేయాల్సి వస్తుంది. అలాంటి పోలీసు డ్రామా కొనసాగింపుగా వచ్చిన సిరీస్ Boston Blue Season 2. నేర పరిశోధనలతో పాటు కుటుంబ సంబంధాలు, ఉద్యోగపరమైన ఒత్తిళ్లను కళ్ళకు కట్టినట్టుగా చూపించిన ఈ క్రైమ్ డ్రామాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

ఈ సిరీస్‌ లో డానీ రీగన్ అనే పోలీసు అధికారి కీలక పాత్రలో కనిపిస్తాడు. గతంలో న్యూయార్క్ పోలీసు విభాగంలో పని చేసిన అతడు, తర్వాత బోస్టన్ పోలీసు విభాగంలో బాధ్యతలు చేపడతాడు. కొత్త నగరం, కొత్త సహోద్యోగులు, కొత్త విధానాల మధ్య తన పనిని కొనసాగించాల్సి వస్తుంది. అనుభవం ఉన్న అధికారిగా అతడికి కేసులను పరిశోధించడం, నేరస్థుల కదలికలను అర్థం చేసుకోవడం తెలుసు. కానీ ప్రతి నగరానికి ఒక్కో రకం పని తీరు ఉంటుంది. అందుకే బోస్టన్‌ లో అతడి ప్రయాణం కూడా కాస్త కష్టంగానే ఉంటుంది.

Advertisement

డిటెక్టివ్ లీనా సిల్వర్‌తో కలిసి డానీ పని చేస్తాడు. ఆమె తన విధుల పట్ల నిబద్ధత కలిగిన అధికారిణి. అయితే గతంలో జరిగిన కాల్పుల ఘటన ఆమె జీవితాన్ని, ఉద్యోగాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ ఘటన తర్వాత ఆమె మళ్లీ సాధారణ విధుల్లోకి రావడం, తనపై ఉన్న బాధ్యతలను నిర్వహించడం అంత సులభం కాదు. శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా ఆ సంఘటన నుంచి బయటపడాల్సి ఉంటుంది.

రెండో సీజన్‌ లో ఈ పరిణామాల ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. డానీకి ఉద్యోగపరంగా ఎదిగే అవకాశాలు, పదోన్నతికి సంబంధించిన కష్టాలు ఎదురవుతాయి. కానీ ఉన్నత పదవికి వెళ్లడం అంటే మరింత బాధ్యతను స్వీకరించడం మాత్రమే కాదు. తన నిర్ణయాల వల్ల ఇతరుల జీవితాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో కూడా ఆలోచించాలి. మరోవైపు, లీనా తన గత అనుభవాల నుంచి కోలుకుంటూ తన సామర్థ్యాన్ని మళ్లీ నిరూపించుకోవాల్సి ఉంటుంది.

Advertisement

పోలీసు విభాగంలోని ఇతర అధికారుల జీవితాలు కూడా కథకు మరో కోణాన్ని అందిస్తాయి. ఒక నేరం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ఎంత దూరం వెళ్తారు ? విధి నిర్వహణలో వ్యక్తిగత భావోద్వేగాలను ఎలా నియంత్రించుకుంటారు ? మరి ఇంతకీ జరిగిన నేరం వెనకున్న నిందితుడు ఎవరు ? ఆ సైకో ఎందుకు అలా చేశాడు ? గతంలో జరిగిన ఘటనలు వర్తమాన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయి ? అనే అంశాల చుట్టూ రెండో సీజన్ కథ నడుస్తుంది.

Also Read : పక్షిలో మాంత్రిక శక్తులు… దేవుళ్లు, రాక్షసుల మధ్య చిక్కుకునే యువతి… హర్రర్ ఫాంటసీ సిరీస్

తెలుగులో ఉందా?

ఈ సీజన్లో డోనీ వాల్‌బర్గ్ డానీ రీగన్ పాత్రలో, సోనెక్వా మార్టిన్-గ్రీన్ లీనా సిల్వర్ పాత్రలో నటించారు. మాగీ లాసన్, మార్కస్ స్క్రిబ్నర్, గ్లోరియా రూబెన్, ఎర్నీ హడ్సన్ తదితరులు కూడా కీలక పాత్రల్లో కనిపిస్తారు. రెండో సీజన్ 2026 అక్టోబర్ 9న స్ట్రీమింగ్ కి వచ్చిదని. తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు గానీ… సిరీస్ ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. పోలీసు పరిశోధనలు, కుటుంబ డ్రామా కలగలిసిన సిరీస్‌లను ఇష్టపడేవారు దీనిపై ఓ లుక్కేయండి.

Related News

గ్రామ దేవత ప్రతిరూపంగా భావించే దున్నపోతు… బలిచ్చే రోజే మిస్సింగ్… రవితేజ సోదరుడి కొడుకు మూవీ స్ట్రీమింగ్

దొంగతనాలు చేసే అమ్మాయికి సీక్రెట్ స్పై మిషన్… టార్గెట్ కొడుకుతోనే ప్రేమలో… క్రేజీ కొరియన్ థ్రిల్లర్

అంగారకుడిపై మనుషుల శరీరాలను ఆక్రమించే దుష్టశక్తులు… హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో

పక్షిలో మాంత్రిక శక్తులు… దేవుళ్లు, రాక్షసుల మధ్య చిక్కుకునే యువతి… హర్రర్ ఫాంటసీ సిరీస్

కోహినూర్‌ను మించిన వజ్రం కోసం వేట… హంపి ట్రిప్ లో అదిరిపోయే ఛేజింగ్… బెంగాలీ అడ్వెంచర్ థ్రిల్లర్

స్మగ్లింగ్ సామ్రాజ్యంలో బట్టల షాప్ కుర్రాడి మాస్ రాంపేజ్… పృథ్వీరాజ్ ఊరమాస్ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

వరుస హత్యలు… అంతుచిక్కని ఆధారాలు… 5 భాషల్లో రచ్చ లేపుతున్న మోస్ట్ డేంజరస్ సైకో థ్రిల్లర్

Big Stories

Advertisement
×