Big Stories

Anant – Radhika Pre Wedding Celebrations : టాక్ ఆఫ్ ది ట్రెండ్.. అంబానీల “అనంత” సంబరం..

anant radhika pre wedding celebrations updates
anant radhika pre wedding celebrations updates

Anant – Radhika Pre Wedding Celebrations Events(Celebrity news today) : అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఇంత మంది ప్రముఖులు వస్తుంటే.. అక్కడ సౌకర్యాలు ఎలా ఉంటాయో ఊహించుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. కళ్లు మిరుమిట్లు గొలిపేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాహతకు ఏ మాత్రం తగ్గకుండా అందర్నీ ఆకర్షిస్తున్నారు. ఇక, వధూవరులు సంగతి చెప్పనవసరం లేదు. బంధానికి తగ్గట్లు అనుబంధాన్ని ఏర్పరచుకున్న జంట.

- Advertisement -

వినోదంతో పాటు కళలకీ ప్రాధాన్యం ఇచ్చేలా ఈ వేడుకలను ప్లాన్ చేసారు అంబానీ ఫ్యామిలీ. పెళ్లి వేడుకల కోసం ఏకంగా 14 ఆలయాలు నిర్మించారు. గుజరాత్‌లోని జామ్‌నగర్ టెంపుల్ కాంప్లెక్స్‌లో ఈ ఆలయాల్ని నిర్మించారు. భారత దేశ సంస్కృతి, ఆధ్యాత్మికత ప్రతిబింబించేలా వీటిని రూపొందించారు. ఎందరో నిపుణులైన శిల్పులు ఇక్కడి ఆలయాలన్ని అందంగా తీర్చి దిద్దారు. స్థానిక హస్త కళాకారులు ఇక్కడి విగ్రహాలను తయారు చేశారు. ఎంతో అందంగా చెక్కిన స్తంభాలు, దేవతల శిల్పాలు, ఫ్రెస్కో శైలి పెయింటింగ్స్ ఇందులో ఉన్నాయి. తరతరాలుగా వచ్చిన నిర్మాణ శైలులను ప్రతిబింబించేలా సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా నిలుస్తున్నాయి. వారి నైపుణ్యంతో ఆయా ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. వివాహానికి ముందే ఈ ఆలయాలు ఇంత అందంగా రూపుదిద్దుకోవడం తమ ఇంట జరగనున్న వివాహ వేడుకకు మంచి శుభారంభంమని అంబానీ ఫ్యామిలీ తెగ సంబరపడింది. ఇప్పుడు ఇదే ఆనందాన్ని అతిథులు కూడా ఆస్వాదిస్తారని పెళ్లి కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది.

- Advertisement -

Read More : అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. నీతా అంబానీ ఎమోషనల్ పోస్ట్

అనంత్‌-రాధిక ల ప్రీ వెడ్డింగ్‌ సంబరాలకు విచ్చేస్తున్న విశిష్ట అతిథులను సాదరంగా స్వాగతం పలికేందుకు అంబానీ కుటుంబం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జామ్‌నగర్‌లో కావలసినన్ని స్టార్ హోటల్స్ లేకపోవడం వల్ల, స్టార్ హోటళ్లను తలదన్నేలా అల్ట్రా-లగ్జరీ టెంట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అతిథుల కోసం ఏర్పాటు చేసిన ఈ టెంట్లలో టైల్డ్ బాత్‌రూమ్‌లు సహా సకల సౌకర్యాలను ఉంచారు. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భారతీయ సంస్కృతిని ఇంటర్నేషనల్ సెలబ్రిటీలకు పరిచయం చేసే విధంగా ప్లాన్ చేశారు. అతిథులకు తమ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికేందుకు గుజరాత్‌లోని లాల్‌పుర్, కచ్‌లో మహిళలు తయారు చేసిన కండువాలను సిద్ధం చేశారు. హెయిర్ స్టైలింగ్, చీర డ్రాపింగ్, మేకప్‌​కు ఏర్పాట్లు చేశారు. అయితే, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో అతిథులకు సేవలు అందించనున్నట్లు సమాచారం. అంటే.. వేడుకలకు ఎవరు ముందొస్తే వారికి మరిన్ని ప్రత్యేక సదుపాయాలు ఉంటాయని ముందుగానే ప్రకటించారు.

మార్చి 1 నుండి 3వ తేదీ వరకూ, మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ ప్రీ వెడ్డింగ్ ఉత్సవాల్లో ఐదు గ్రాండ్ ఈవెంట్‌లను ప్లాన్ చేశారు. అతిథులు వివిధ ఫంక్షన్‌లకు హాజరయ్యే క్రమంలో ప్రతి ఒక్క ఈవెంట్ ఆహ్వానితులకు అందించిన ‘ఈవెంట్ గైడ్’లో సూచించిన డ్రెస్ కోడ్‌తో అత్యంత ఆహ్లాదకరంగా ఉండనుంది. మార్చి 1 సాయంత్రం 5.30 గంటలకు కాక్‌టెయిల్ పార్టీతో వేడుకలు ప్రారంభమవగా.. మొదటి రోజు యాన్ ఈవినింగ్ ఇన్ ఎవర్ ల్యాండ్ అనే ఈవెంట్ తో సెలబ్రేట్ చేశారు. దీనికి ఎలిగెంట్ కాక్ టెయిల్ డ్రెస్ కోడ్‌తో హాజరవ్వాలి. ప్రీ వెడ్డింగ్ లో రెండో రోజు “ఎ వాక్ ఆన్ ద వైల్డ్ సైడ్” ఈవెంట్ ఉంటుంది. దీనికి జంగిల్ ఫీవర్ డ్రెస్ కోడ్ ను నిర్ణయించారు. ఈ ఈవెంట్ ను జామ్ నగర్ లోని అంబానీల జంతుసంరక్షణ కేంద్రం వెలుపల నిర్వహించనున్నారు. చివరి రోజు టస్కర్ ట్రైల్స్, హష్టాక్షర్ అనే 2 ఈవెంట్‌లు జరుగుతాయి. టస్కర్ ట్రైల్స్‌లో క్యాజువల్ చిక్ డ్రెస్ కోడ్ ఉంటుంది. హష్టాక్షర్ కార్యక్రమంలో హెరిటేజ్ ఇండియన్ దుస్తులతో హాజరవుతారు.

Read More : అంబానీయా మజాకా.. వెయ్యి కోట్లతో పెళ్లి..!

ఇక, దేశంలోని అత్యంత సంపన్న కుటుంబమైన అంబానీ ఫ్యామిలీ ఏమి చేసినా అది టాక్ ఆఫ్ ది ట్రెండ్ అవుతుంది. విలాసవంతమైన జీవితం గడిపే అంబానీ ఫ్యామిలీ.. తమ అతిథులకే ఇంతటి ఆతిధ్యం ఇస్తే.. సొంత కుటుంబంలో వారికి అందించే కానుకల్లో ఏమాత్రం వెనకాడరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు తమకు కాబోయే కోడలికి వివాహ కానుకలుగా కోట్ల రూపాయల విలువ చేసే లగ్జరీ గిఫ్ట్స్ అందించారు. అందులో రూ.4.5 కోట్లు విలువైన బెంట్లీ కారు, వెండి లక్ష్మీ గణపతి విగ్రహం, డైమండ్ నక్లెస్ వంటివి ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో వధువు రాధిక మర్చంట్ మరింత ప్రత్యేకంగా కనిపించబోతున్నారు. ఆమెతో పాటు పెళ్లి కుటుంబం కూడా ఈ వేడుకల్లో ప్రత్యేకంగా కనిపించబోతున్నారు. మొదటి నుండి ఎత్నిక్ దుస్తుల విషయంలో అంబానీలు చాలా ఫ్యాషన్‌గా వ్యవహరిస్తారు. కాగా.. ఈ వివాహ వేడుకల కోసం అంబానీ ఫ్యామిలీలో ఒకొక్కరి దుస్తులు అద్భుతాలనే చెప్పాలి. ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతా పెళ్లి కోసం అబు జానీ సందీప్ ఖోస్లా క్రియేషన్‌ను ధరిస్తుండగా.. అంబానీ కూతురు ఇషా అంబానీ వాలెంటినో రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లెహెంగాను ధరించనుంది.

ముఖేష్‌-నీతా అంబానీల ముగ్గురు సంతానంలో చిన్నవాడైన అనంత్ అంబానీ ఎప్పుడూ ప్రత్యేకమైన వ్యక్తిగానే కనిపిస్తాడు. ఒకప్పుడు విపరీతమైన భారీ కాయంతో ఉన్న అనంత్ పెళ్లి సమయానికి సహజంగా బరువు తగ్గించుకొని అందర్నీ ఆశ్చర్య పరిచాడు. అప్పటి నుండే అనంత్ అంబానీ సాధారణ ప్రపంచంలోనూ పాపులర్ అయ్యాడు. ఇప్పుడు.. ఎన్‌కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్- శైలా మర్చంట్ చిన్న కుమార్తె అయిన రాధికా మర్చంట్‌తో అనంత్ అంబానీ పెళ్లి జరుగుతోంది. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ నిశ్చితార్థం గతేడాది జనవరిలోనే జరిగింది. ముంబైలోని ఆంటిలియాలో సంప్రదాయ పద్ధతిలో అనంత్ – రాధిక ల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. నిశ్చితార్థంలో కాబోయే వధూవరులిద్దరూ అప్పుడు సంప్రదాయబద్ధంగా మెరిసిపోయారు. ఇటీవల ‘లగన్‌ లఖ్‌వనూ’ వేడుక కూడా నిర్వహించారు.

Read More : అనంత్ అంబానీ మళ్లీ అంత బరువు ఎలా పెరిగారు..?

అయితే వధూవరులైన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ చిన్ననాటి నుండే స్నేహితులు. స్నేహం నుంచి అది ప్రేమగా మారింది. వారు చాలా సంవత్సరాలు డేటింగ్ కూడా చేశారు. చదువు పూర్తయ్యాక అనంత్ అంబానీ ఉన్నత విద్య కోసం రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ యూనివర్సిటీకి వెళ్లారు. రాధిక మర్చంట్ న్యూయార్క్ యూనివర్సిటీకి వెళ్లింది. ఇండియాకి తిరిగొచ్చాక మళ్లీ దగ్గరయ్యారు. ఒకసారి రాధిక.. అనంత్ ఒకే రంగు దుస్తులు ధరించి ఫోటోకి ఫోజులిచ్చారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వారిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత రాధికా మర్చంట్.. ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ వివాహానికి హాజరయ్యారు. దాంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది.

ఇది మాత్రమే కాదు.. ఇటలీలోని లేక్ కోమోలో జరిగిన ఇషా అంబానీ నిశ్చితార్థంలో కూడా రాధికా మర్చంట్ కనిపించింది. అనంత్ అంబానీతో కలిసి ఎర్రటి దుస్తుల్లో కెమెరాకు చిక్కారు. ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా కుమారుడు పృథ్వీ మొదటి పుట్టినరోజు వేడుకల్లోనూ రాధికా మర్చంట్ కూడా కనిపించింది. రాధిక, నీతా అంబానీల మధ్య బంధం కూడా చాలా బాగుంటుందట. రాధిక, నీతా తరచుగా వివాహ వేడుకలలో కలిసి కనిపిస్తారు. అంబానీ కుటుంబంలో జరిగే అన్ని కార్యక్రమాలకు రాధిక హాజరవుతారు. శ్లోకలాగే కుటుంబంలో తమ బాధ్యతలను నిర్వర్తిస్తారు. శ్లోకా మెహతా, రాధిక మర్చంట్ లు కూడా సొంత అక్కచెల్లెళ్ల కంటే ఎక్కువ ప్రేమ చూపించుకుంటారట. అలా అనంత్ అంబానీతో రాధిక ప్రయాణం చాలా కాలం కొనసాగుతూ ఇప్పుడు వివాహంతో పర్మినెంట్ అవ్వబోతోంది.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News