E-Paper
Advertisement

ఆయ‌న అఘోర పూజ‌లు నిజ‌మే.. కానీ కాంగ్రెస్ కోసం కాదు.. తాంత్రిక‌ పూజ‌ల గుట్టు ర‌ట్టు చేసిన క‌విత‌

ఆయ‌న అఘోర పూజ‌లు నిజ‌మే.. కానీ కాంగ్రెస్ కోసం కాదు.. తాంత్రిక‌ పూజ‌ల గుట్టు ర‌ట్టు చేసిన క‌విత‌
Advertisement

క్షుద్ర పూజ‌లు హ‌రీశ్‌ను వ‌ద‌ల‌డం లేదు.. హ‌రీశ్‌ను క‌విత వ‌ద‌ల‌డం లేదు. నిను వీడ‌ని నీడ‌ను నేనే.. అన్న‌ట్టుగా పూజ‌ల వెనుక హ‌రీశ్‌.. హ‌రీశ్‌ను వెంటాడే ప‌నిలో కాంగ్రెస్‌.. ఇప్పుడు క‌విత ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది.

అస‌లు స్టోరీ ఇదీ అని మ‌ధ్య‌లో జోక్యం చేసుకున్నారు క‌విత‌. ఈ క్షుద్ర పూజ‌ల అంశం త‌మ‌కు దొరికిన అస్త్రమ‌ని సంబుర‌ప‌డ్డ‌ది కాంగ్రెస్‌. అందుకే రేవంత్ ఏ వేదిక ఎక్కినా.. పూజ‌లు చేస్తున్నారు. మ‌నం బాగుండొద్ద‌ట‌. వాన‌లు ప‌డొద్ద‌ట‌.. అని త‌మ పార్టీకి, ప్ర‌భుత్వానికి దీన్ని ఓన్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. అంతే కాదు.. వీళ్ల మూతిప‌ళ్లు రాల‌గొట్టండ‌ని పిలుపునివ్వ‌డ0 మూలంగా ఎన్నికల్లో ఓడించ‌0డని కోరుతూ వ‌స్తున్నాడు.

Advertisement

కానీ ఈ అస్త్రం ఇప్పుడు చేజారి పోయింది చేతి పార్టీకి. క‌విత అఘోర అస‌లు రూపానికి క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారివాళ‌. వాళ్ల‌కేం తెలుసు పిచ్చోళ్లు..  రాష్ట్రం కోసం.. ప్ర‌భుత్వం కోసం అని ఏవేవో ఊహించుకుంటున్నారు. ఆ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన‌దాన్ని నాకు అఘోర పూజ‌ల అస‌లు ర‌హ‌స్యం బాగా తెలుసు.. అని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. గుట్టుర‌ట్టు చేశారు.

కేసీఆర్ కోస‌మే ఆ పూజ‌లు చేస్తున్నాడ‌ని క‌విత క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ కోస‌మంటే .. ఆయ‌న ఆయురారోగ్యాల‌తో, క‌ల‌కాలం చ‌ల్లంగా ఉండాలని మీర‌నుకుంటే.. నిమ్మ‌కాయ‌ల మీద కాలేసిన‌ట్టే. ఆయ‌న ఆరోగ్యం త్వ‌ర‌గా చెడిపోవాల‌ని, తొంద‌ర‌గా అనారోగ్యం పాలు కావాల‌ని.. మొత్తానికి ఆయ‌న నాశ‌నం కోరుతూ ఈ పూజ‌లు చేపించాడ‌ని ఖుల్లంఖుల్లాగా చెప్పేశారు క‌విత‌.

Advertisement

ఇప్పుడే అయిపోలే ఈ అఘోర ముచ్చ‌ట్లు. హ‌రీశ్‌కు ఈ పూజ‌లు చేపించే అల‌వాటు ఇప్పుడే కొత్త కాద‌ట‌. ఎప్ప‌ట్నుంచో చేపిస్తున్నాడ‌ట‌. ఒకే ల‌క్ష్యం.. అది కేసీఆర్ తొంద‌ర‌గా అనారోగ్యం పాలుకావాల‌నే. ఈ విష‌యం చాలా మందికి తెలుసునని కూడా అన్నారు కవిత‌.

మీ డౌట్ క్లియ‌ర్ కావాలంటే.. ఏ పంతుల్ని అడిగినా ట‌కీ మ‌ని చెప్పేస్తార‌ట‌.. అవును.. అఘోర పూజ‌లు నిజ‌మే.. ఆయ‌న చేసే పూజ‌లు కేసీఆర్ కోస‌మేన‌ని. ఇంకో ముచ్చ‌ట కూడా చెప్పారండోయ్‌.. కేసీఆర్‌ను అడుగుప‌ట్టించేందుకు.. అన్ని విధాల నాశ‌నం చేసేందుకు, రోగాల పాలు చేసేందుకు అఘోర పూజ‌లు ఏమేమీ చేయాలో కూడా చాలా మందిని కలిసి చాలా ఎంక్వైరీలు చేశాడ‌ట హ‌రీశ్ రావు.

మొత్తానికి ఈ పూజ‌ల‌న్నింటిపైనా మంచి ప‌ట్టు సాధించి.. అవి ఎక్క‌డ చేయాలో స‌ర్చింగ్ చేసి.. మొక్కవోని దీక్ష‌తో, ఒకే ఒక్క ల‌క్ష్యంతో అలుపెర‌గ‌ని యోధుడిలా పూజ‌ల మీద పూజ‌లు.. చేపిస్తూనే ఉన్నాడ‌ట‌.. ఇవ‌న్నీ నేను చెబుతున్న ముచ్చ‌ట కాదు బాబు.. ఆమే స్వ‌యంగా చెప్పారు. క్లారిటీగా వివ‌రించారు. శ‌ష‌భిష‌లు లేకుండా అంద‌రి అనుమానాలు తీర్చారు. కాంగ్రెస్‌కు ఈ అఘోరా పూజ‌ల అంశం ఓన్ చేసుకోకుండా చేసేశారు.

రేవంత్ పెట్టుకున్న అఘోర రావు అనే పేరు మాత్రం కాంగ్రెస్ వాడుకోవ‌చ్చు ఎంచ‌క్కా. ఎందుకంటే.. పూజ‌లు చేసింది వాస్త‌వ‌మేన‌ని స్వ‌యంగా ఆ కుటుంబ స‌భ్యురాలు.. స్వ‌య‌నా కేసీఆర్ కూతురు.. చెప్పిన త‌రువాత ఇంకా అనుమానాలెందుకుంటాయి…? ఆ పూజ‌లు ప‌నిచేశాయా? చేస్తున్నాయా? ఇంకా పూజ‌లు చేయాల్సి ఉందా? ఇవ‌న్ని ముచ్చ‌ట్లు ప‌క్క‌నబెడితే.. పూజ‌ల‌ను న‌మ్ముకున్న‌ది మాత్రం వాస్త‌వం. ఆ పూజ‌ల వెనుక ఉన్న ఉద్దేశ్యం మాత్రం క్లియ‌ర్‌. ఇవీ ఇవాల్టి తాజా అఘోరా అప్‌డేట్స్‌.. ఈ ఎపిసోడ్ ఇక్క‌డితో అయిపోలేదు. ఆగ‌దు.. వెయిట్ అండ్ సీ…

 

Tags

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

టెన్త్ సర్టిఫికెట్ లేకున్నా జూనియర్ లెక్చరర్.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి సంచలనాలు!

కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×