E-Paper
Advertisement

Huzurabad: హుజురాబాద్‌లో సెగలు పుట్టిస్తున్న మున్సిపల్ రాజకీయం.. కౌశిక్ రెడ్డికి బండి సంజయ్, ప్రణవ్ సవాల్!

Huzurabad: హుజురాబాద్‌లో సెగలు పుట్టిస్తున్న మున్సిపల్ రాజకీయం.. కౌశిక్ రెడ్డికి బండి సంజయ్, ప్రణవ్ సవాల్!
Advertisement

Huzurabad: హుజురాబాద్ నియోజకవర్గం మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయం మరింత వేడెక్కింది. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. గత రెండు ఎన్నికల్లో నియోజకవర్గంలోని హుజరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సత్తా చాటింది. మాజీ మంత్రి ప్రస్తుత ఎంపీ ఈటల రాజేందర్ ఇక్కడ ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించడంతో అప్పట్లో బీఆర్ఎస్‌కు అప్పట్లో ఎదురులేకుండా పోయింది. అయితే ఈటల బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారిగా ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సారి ఆ రెండు మున్సిపాల్టీల్లో పాగా వేసేందుకు కాంగ్రెస్‌తో పాటు బిజెపి కూడా పావులు కదుపుతూ…హుజురాబాద్ బీఆర్ఎష్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డికి సవాల్ విసురుతున్నాయి..

ఈటల రాజేందర్ చరిత్ర రాసిన హుజురాబాద్ రాజకీయాలు

కరీంనగర్ జిల్లా హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో ఎన్నికల కోలాహలం పతాక స్థాయి చేరుతోంది. ఆ రెండు మున్సిపాల్టీల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఆ పురపాలక సంఘాలను గులాబీపార్టీ కైవసం చేసుకుంది. అప్పుడు ఆ పార్టీ ఇమేజ్ కంటే హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ హవానే అక్కడ నడిచిందంటారు. 2004 నుంచి 2021 వరకు హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ అప్రతిహంగా గెలుస్తూ వచ్చారు. అయితే మారిన రాజకీయ పరిణామాలతో 2021 బైపోల్స్‌లో ఈటల బీజేపీ నుంచి పోటీ చేసి ఏడో సారి విజయం సాధించారు. అలాంటాయన్ని గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పాడి కౌశిక్‌రెడ్డి ఓడించి మొదటి సారి ఎమ్మెల్యే అయ్యారు.

మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు

Advertisement

ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, బీజేపీలో ఉన్న ఈటల బీఆర్ఎస్‌కు ప్రత్యర్ధిగా మారిన తర్వాత హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాల్టీలకు తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో అక్కడ త్రిముఖ పోరు నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఆ రెండు మున్సిపాల్టీల ప్రచారంలో నువ్వానేనా అన్నట్లు దూసుకుపోతున్నాయి. ఇప్పుడు రాజేందర్ ఈ ఎన్నికల పైన దృష్టి పెట్టడం లేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ రెండు మున్సిపాలిటీల పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. అదే విధంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ప్రణవ్ ఇక్కడ గెలిచేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. మొత్తానికి మూడు పార్టీలు కూడా సై అంటే సై అంటున్నాయి.

హ్యాట్రిక్ కోసం బీఆర్ఎస్… చెక్ పెట్టేందుకు కాంగ్రెస్–బీజేపీ

ఈ రెండు మున్సిపాలిటీలు కూడా రాజకీయంగా ఎంతో చైతన్యం కలిగిన ప్రాంతాలే. మరి బీఆర్ఎస్ కి చెక్ పెట్టి అధికార కాంగ్రెస్ విజయం సాధిస్తుందా?.. లేదంటే బిజెపి పాగా వేస్తుందా?.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పార్టీకి హ్యాట్రిక్ విజయం అందిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ మూడు పార్టీలు వార్డుల వారీగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఏ చిన్నపాటి అవకాశాన్ని కూడా వదలడం లేదు. పాడి కౌశిక్ రెడ్డికి ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో ఈ రెండు మున్సిపాలిటీలు అత్యంత కీలకంగా మారాయి. గతంలో మాదిరిగానే మరోసారి తమ పార్టీనే పాగా వేస్తుందని ఆయన ధీమాతో ఉన్నారు.

ఎవరి జెండా ఎగురుతుంది? ఆసక్తికరంగా మారిన ఎన్నికలు

Advertisement

గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ అభ్యర్ధి ప్రణవ్ కూడా బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపారు. కచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురుతోందని ఆయన చెబుతున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇక్కడ ఇప్పటికే సమావేశం నిర్వహించారు. కచ్చితంగా కాషాయ జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రాజకీయంగా అందరి దృష్టి ఈ రెండు మున్సిపాలిటీల పైనే ఉంది. మూడు పార్టీలకు కూడా ఈ ఎన్నికలు అత్యంత కీలకం కావడంతో మూడు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని సర్వశక్తుల ఒడ్డుతున్నాయి.

బండి సంజయ్, ప్రణవ్ వ్యూహాలు… కౌశిక్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారు?

హుజురాబాద్ నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గా గెలిచాక మొదటిసారి జరుగుతున్న మునిసిపల్ ఎన్నికలు కావడంతో ఆయన చెమటోడ్చుతున్నారు. బిజేపి నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈసారి ఎలాగైనా మునిసిపల్ ఎన్నికల్లో గెలవాలని ప్రణాళికలు రూపోందిస్తుండగా…కాంగ్రెస్ ఇంచార్జ్ ప్రణవ్ బాబు మునిసిపల్ ఎన్నికలలో సత్తా చాటి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఎదురులేకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. మొత్తానికి హుజురాబాద్, జమ్మికుంట మునిసిపల్ ఎన్నికలు మాత్రం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కి సవాల్ విసురుతున్బాయి. దూకుడుగా ఉంటూ నిత్యం హాట్ టాపిక్ అవుతున్న కౌశిక్ రెడ్డి ఈ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారు? ఎన్ని వార్డుల్లో సత్తా చాటుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. మరి పురపోరులో కౌశిక్ రెడ్డి ఏ మాత్రం ప్రభావం చూపిస్తారో చూడాలి.

Also Read:  వనం వదిలి జనం వైపు.. పులి అడుగుల వెనుక అసలు కథ!

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×