E-Paper
Advertisement

పసికందుల విక్రయ దందా పై హైకోర్టు ఫైర్.. ఆ శాఖకు నోటీసులు జారీ?

పసికందుల విక్రయ దందా పై హైకోర్టు ఫైర్.. ఆ శాఖకు నోటీసులు జారీ?
Advertisement

Illegal Adoption: మల్కాజ్‌గిరిలో 15 మంది. సూర్యాపేటలో మరో 11 మంది. అక్రమ దత్తత రాకెట్ నుంచి పోలీసులు రక్షించిన పసిపిల్లల సంఖ్య ఇది. వీళ్లందరినీ ఇప్పుడు ప్రభుత్వ సంరక్షణలో ఉంచారు. రాష్ట్రవ్యాప్తంగా 30 అక్రమ దత్తత కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు కోర్టుకు తెలిపారు. మొత్తం 176 మందిని నిందితులుగా గుర్తించారు.

స్కూల్ టీచర్లతో..

వీళ్లలో పిల్లల్ని కొనేవాళ్లు, అమ్మేవాళ్లు, మధ్యవర్తులు, ఆర్గనైజర్లు అంతా ఉన్నారు. కానీ, అసలు ప్రశ్న ఇక్కడే తలెత్తుతోంది. ఇప్పటివరకు కేవలం 27 మంది పిల్లల కన్నతల్లిదండ్రులను మాత్రమే గుర్తించగలిగారు. మిగతా పిల్లల తల్లిదండ్రుల ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. చాలామంది పసికందులు.. వాళ్ల అసలు తల్లిదండ్రులు ఎవరో తెలియని పరిస్థితి. అనేక మంది నిందితులు, కీలక మహిళా దళారీ ఇంకా పరారీలోనే ఉన్నారు. అంగన్‌వాడీలు, స్కూల్ టీచర్లతో గ్రామ స్థాయిలో యంత్రాంగం ఉన్నా.. పిల్లల మూలాలు కనుక్కోలేకపోవడంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.

Advertisement

Also read: ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

శిశు కేంద్రం..

మరోవైపు నల్గొండ శిశు కేంద్రంపై అమికస్ క్యూరీ సమగ్ర నివేదిక సమర్పించారు. పిల్లలకు వైద్య పరీక్షలు, సైకాలజిస్ట్ సేవలు అందించాలని సూచించారు. శిశు కేంద్రం వద్ద భద్రతా సిబ్బందిని నియమించాలని సిఫారసు చేశారు. పిల్లల పోషణ, దుస్తులు, వైద్య ఖర్చుల కోసం నిధులు పెంచాలని కూడా కోరారు. ఈ కేసులో హోంశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖను హైకోర్టు పార్టీలుగా చేర్చింది.

తప్పిపోయిన 27 మంది..

Advertisement

డీజీపీ మహిళా భద్రతా విభాగం, టెస్లాను కూడా పార్టీలుగా చేర్చాలని ఆదేశించింది. తప్పిపోయిన 27 మందికి తల్లిదండ్రులు దొరికారు. మరి.. మిగతా పిల్లల పరిస్థితేంటి? ఈ ప్రశ్నకు సమాధానం కోసం.. రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్లు దాఖలు చేయాలి. ఈ కేసులో.. హోంశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖను పార్టీలుగా చేర్చింది హైకోర్టు. డీజీపీ మహిళా భద్రతా విభాగం, టెస్లాను కూడా పార్టీలుగా చేర్చాలని ఆదేశించింది. తదుపరి విచారణని.. అక్టోబర్ 5కి వాయిదా వేసింది.

Also read: SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

Tags

Related News

DSC ఉద్యోగాల అమ్మకాలపై వైసీపీ సంచలన ఆధారాలు.. షాక్‌లో కూటమి సర్కార్!

దేశ రాజధానిలో ఘోరాతి ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిని కూడా వదలని కిరాతకులు?

తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్‌…! ఆ పదం రాసినందుకు ఇలేకరికి ఇచ్చిపడేసిన పెద్దసారు..!

క్రికెట్ చరిత్రలోనే హెచ్‌సీఏ చెత్త రికార్డు.. సోషల్ మీడియాలో పిచ్చ ట్రోల్స్!

పవర్‌ స్టేషన్స్‌ పరిశీలనకు 6 బృందాలు! థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఏం జరుగుతోంది..? పరిశీలనకు రేపు ఆరు చోట్ల పర్యటనలు…

తెలంగాణలో మేఘాలయ మోడల్ వ్యవసాయ విధానం.. మోదట వేసే పంట ఇదే?

ఆస్తులు పెంచుకోలే.. ప్రజల మనసుల్లో అంతస్తులు కట్టుకున్నారు! ఆ ముగ్గురి కామ్రేడ్‌ల నిస్వార్థ ప్రజాసేవ ప్రస్థానం..!

Big Stories

Advertisement
×