E-Paper
Advertisement

పవర్‌ స్టేషన్స్‌ పరిశీలనకు 6 బృందాలు! థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఏం జరుగుతోంది..? పరిశీలనకు రేపు ఆరు చోట్ల పర్యటనలు…

పవర్‌ స్టేషన్స్‌ పరిశీలనకు 6 బృందాలు! థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఏం జరుగుతోంది..? పరిశీలనకు రేపు ఆరు చోట్ల పర్యటనలు…
Advertisement

కాంగ్రెస్‌ పార్టీ లీడర్ల ఫామ్‌హౌజ్‌ల పరిశీలనకు బస్సుయాత్ర ముగిసిందో లేదో.. బీఆర్‌ఎస్‌ కూడా పరిశీలనల పర్యటనలకు సిద్దమైంది. రేపట్నుంచి ఆరు థర్మల్‌ పవర్‌ పాయింట్లను పరిశీలించేందుకు బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరు బృందాలుగా వెళ్లనున్నారు.

ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈ పర్యటన వివరాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సాగునీరందక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌నినో పేరు చెప్పి కరువు సాకులు వెతుక్కుంటున్నదని, ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువని కేటీఆర్‌ ఆరోపించారు.

Advertisement

కేసీఆర్‌ పాలనలో నాణ్యమైన 24 గంటల కరెంటును సప్లై చేయడమే కాకుండా.. పవర్‌ స్టేషన్ వ్యవస్థలన్నీ గాడిలో పెట్టి కాంగ్రెస్‌ చేతికిస్తే.. వాటి పరిస్థితి నేడు ఘోరంగా మారిందని విమర్శించారు. కేసీఆర్‌ పాలన మాదిరిగానే నాణ్యమైన 24 గంటల కరెంటును అందించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

బొగ్గు ద్వారా కరెంటు ఉత్పత్తి ఎందుకు సరిపడా జరగడం లేదు..? ప్రభుత్వ వైఫల్యాలు.. బొగ్గు కుంభకోణాలపై పరిశీలించేందుకే తాము ఆ పర్యటనలకు వెళ్తున్నట్టు కేటీఆర్‌ ప్రకటించారు. యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ ను పరిశీలించేందుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి బృందం వెళ్లనుందని, కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ను వద్దిరాజు రవిచందర్‌ నేతృత్వంలో మరో బృందం వెళ్లనుందని తెలిపారు.

Advertisement

భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ను మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ బృందం, భూపాలపల్లిలో కాకతీయ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ను ఎర్రబెల్లి దయాకర్ రావు బృందం, సింగరేణి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ను జోగురామన్న, బాల్క సుమన్‌, సింగరేణి ప్రధాన కార్యాలయానికి కొప్పుల ఈశ్వర్‌ బృందం పరిశీలనకు వెళ్లనున్నట్టు తెలిసింది.

ఈ పర్యటన అనంతరం పార్టీలో మరోసారి చర్చించి..ఈ అంశంలో సర్కార్‌ వైఫల్యాలేమిటీ..? ప్రధాన ప్రతిపక్షంగా రైతుల కష్టాలు తీరేలా, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలో నిర్ణయించి.. ప్రకటిస్తామని తెలిపారు. నిన్నటి వరకు కేసీఆర్‌ ఎర్రవల్లి ఫాంహౌజ్‌తో పాటు బీఆరెస్‌ నేతల ఫామ్‌హౌజ్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేసిన కాంగ్రెస్‌ లీడర్ల ఉదంతానికి ఇది ప్రతీకార పర్యటనగా చూడాలా? అనే కోణంలో కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

బీఆరెస్‌ను నైతికంగా దెబ్బకొట్టేందుకు రేవంత్‌ సర్కార్‌ సమయం దొరికినప్పుడల్లా ఇలా మాటల దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో.. దీనికి ప్రతిగా ఏదో ఒక ఆందోళన పేరుతో బీఆర్‌ఎస్‌ కూడా సర్కార్‌ను ఇరుకున పెట్టే పనిని నెత్తికెత్తుకుంటున్నది.

మొన్న అసెంబ్లీ ముందు ఎమ్మెల్సీ తాతా మధు .. స్పీకర్‌పై దుర్బాషలాడిన నేపథ్యాన్ని కాంగ్రెస్‌ రచ్చ చేసి వదిలింది. దీని డ్యామేజీ నుంచి తప్పించుకోవడానికి కొండారెడ్డి పల్లిలో రైతులు కరెంటు కష్టాలపై రోడ్డెక్కారనే వార్తను ప్రజెంట్‌ చేస్తూ హరీశ్‌రావు రంగంలోకి దిగాడు. సీఎం సొంత నియోజకవర్గంలోనే పార్టీలకతీతంగా రైతులు స్వచ్చందంగా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని, కరెంటు సరిపడా అందడం లేదని, సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయనే అంశాన్ని బాగా హైలెట్ చేసే ప్రయత్నం చేశాడు హరీశ్‌.

ఇప్పుడు ఫామ్‌హౌజ్‌ల బస్సుయాత్రకు.. బీఆర్‌ఎస్‌ నాయకుల పవర్ స్టేషన్ల పర్యటన ఓ ప్రతిదాడిగా చూడాల్సి ఉంటుందా? అనే కోణంలో చర్చ జరుగుతోంది. క్షేత్రస్థాయిలో కరెంటు కష్టాలు, పంటల సాగునీటి సమస్య రోజు రోజుకు పెరుగుతుందనే మాట మాత్రం వాస్తవం.

Tags

Related News

తెలంగాణలో మేఘాలయ మోడల్ వ్యవసాయ విధానం.. మోదట వేసే పంట ఇదే?

ఆస్తులు పెంచుకోలే.. ప్రజల మనసుల్లో అంతస్తులు కట్టుకున్నారు! ఆ ముగ్గురి కామ్రేడ్‌ల నిస్వార్థ ప్రజాసేవ ప్రస్థానం..!

పిఠాపురం జనసేన కమిటీపై పవన్ ఫైర్.. అన్నీ చక్కదిద్దుతానని హెచ్చరిక!

దసరా పండుగ కంటే ముందే.. కాంగ్రెస్ నాయకులకు గుడ్‌న్యూస్..?

చిలకపచ్చ రంగు.. ఎర్రటి బార్డర్.. ఈసారి బతుకమ్మ చీరల లుక్ ఇదే!

కేసీఆర్ ఫామ్ హౌస్ భూములపై సీఎం రేవంత్ రహస్య సర్వే.. ఇక నెక్ట్స్ ప్లాన్ అదేనా..?

నమ్మి గెలిపిస్తే.. ముఖం చాటేశాడు! సిరిసిల్లలో ఇప్పటి వరకు 15 సార్లు మాత్రమే పర్యటించిన కేటీఆర్‌..!

Big Stories

Advertisement
×