E-Paper
Advertisement

క్రికెట్ చరిత్రలోనే హెచ్‌సీఏ చెత్త రికార్డు.. సోషల్ మీడియాలో పిచ్చ ట్రోల్స్!

క్రికెట్ చరిత్రలోనే హెచ్‌సీఏ చెత్త రికార్డు.. సోషల్ మీడియాలో పిచ్చ ట్రోల్స్!
Advertisement

HCA Selection: స్వేచ్చ బ్యూరో: క్రికెట్​ లో హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​ (హెచ్​సీఏ) నయా రికార్డ్​ సృష్టించింది. ఎంపిక చేసిన 15మంది సభ్యుల రాష్ట్ర జట్టులో ఏకంగా అయిదుగురు వికెట్​ కీపర్లను తీసుకుంది. ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను పక్కకు పెట్టి అస్మదీయులైనందునే అయిదుగురు వికెట్​ కీపర్లకు టీంలో స్థానం కల్పించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీసీఐ నుంచి ఏటా వస్తున్న వందల కోట్ల దుర్వినియోగం చేశారన్న దాంతోపాటు హెచ్​సీఏపై పలు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా టీం సెలెక్షన్​ మరోసారి హెచ్​సీఏపై విమర్శలకు కారణమైంది.

క్రికెటర్​ అంబటి రాయుడు..

నిజానికి టీం సెలెక్షన్​ కోసం భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ క్రికెటర్​ అంబటి రాయుడును క్రికెట్​ అడ్మినిస్ట్రేటర్​ గా నియమించారు. ఈ క్రమంలో ఆటగాళ్ల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని అంతా భావించారు. అయితే, ఆశ్చర్యకరంగా 15మంది సభ్యులతో ఎంపిక చేసిన జట్టులో ఏకంగా అయిదుగురు వికెట్ కీపర్లు షేక్ రెహాన్ రోషన్, బి.వర్షిత్ రెడ్డి, ఆదిత్య వర్ధన్, ఆదిత్య జవ్వాజీ, ప్రిన్స్ఉండటం క్రికెట్​ వర్గాల్లో చర్చనీయంగా మారింది. ఈ ఐదుగురిలో ముగ్గురు రెగ్యులర్ వికెట్‌కీపర్లుగా ఉండి.. అదే సమయంలో అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనలతో స్థానాలను సంపాదించారా? అంటే అదీ లేదని క్రికెట్​ వర్గాలు అంటున్నాయి.

Advertisement

Also read: మీసేవ సెంటర్‌కు వెళ్లే పనిలేదు.. ఇక ఇంటికే వస్తారు! ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా?

ఎందుకు ఎంపిక చేయలేదు..

పీ.అద్విత్ రెడ్డి రెండు రోజుల లీగ్, సూపర్-12, సూపర్-6 పోటీల్లో కలిపి 1,024 పరుగులు సాధించాడని తెలిపాయి. ఇందులో మూడు సెంచరీలు, నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయని పేర్కొన్నాయి. జస్వంత్ కన్నెబోయిన 696 పరుగులు సాధించగా, అందులో మూడు సెంచరీలు, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయని తెలిపాయి. బీ.వర్షిత్ రెడ్డి 528 పరుగులు సాధించగా దాంట్లో రెండు సెంచరీలు, ఒక అర్ధసెంచరీ నమోదు చేశాడని తెలిపాయి. ఆదిత్య వర్ధన్ ఒక సెంచరీ, ఒక అర్ద సెంచరీతో 473 పరుగులు చేశాడని తెలియచేశాయి. టీంకు వీళ్లను ఎందుకు ఎంపిక చేయలేదో? హెచ్​సీఏ చెప్పాలని డిమాండ్​ చేశాయి.

మెరిట్​‌ను పక్కన పెట్టారు..

Advertisement

జట్టు ఎంపికపై తెలంగాణ క్రికెట్​ అసోసియేషన్​ (టీసీఏ) తీవ్ర విమర్శలు చేసింది. లీగ్‌ లు నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశం ఆటగాళ్లకు తమ ప్రతిభను ప్రదర్శించి, అర్హతను నిరూపించుకునే అవకాశం కల్పించటమే అని పేర్కొంది. చక్కటి ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు చోటు దక్కకపోతే వారితోపాటు క్రికెట్​ కు అన్యాయం చేసినట్టే అని టీసీఏ ప్రధాన కార్యదర్శి ధారం గురువారెడ్డి వ్యాఖ్యానించారు. టీం ఎంపికను చూస్తే ప్రతిభను పక్కనపెట్టి తమకు కావాల్సిన కొంతమందికి చోటు కల్పించినట్టుగా స్పష్టమవుతోందన్నారు. ఎంపికకు ప్రతిభే పునాది కావాలన్నారు.

Also read: ఈ కారు తనంతట తానే రివర్స్ వెళ్తుంది.. టక్సన్ టెక్నాలజీ చూస్తే మతిపోవాల్సిందే!

Tags

Related News

పవర్‌ స్టేషన్స్‌ పరిశీలనకు 6 బృందాలు! థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఏం జరుగుతోంది..? పరిశీలనకు రేపు ఆరు చోట్ల పర్యటనలు…

తెలంగాణలో మేఘాలయ మోడల్ వ్యవసాయ విధానం.. మోదట వేసే పంట ఇదే?

ఆస్తులు పెంచుకోలే.. ప్రజల మనసుల్లో అంతస్తులు కట్టుకున్నారు! ఆ ముగ్గురి కామ్రేడ్‌ల నిస్వార్థ ప్రజాసేవ ప్రస్థానం..!

పిఠాపురం జనసేన కమిటీపై పవన్ ఫైర్.. అన్నీ చక్కదిద్దుతానని హెచ్చరిక!

దసరా పండుగ కంటే ముందే.. కాంగ్రెస్ నాయకులకు గుడ్‌న్యూస్..?

చిలకపచ్చ రంగు.. ఎర్రటి బార్డర్.. ఈసారి బతుకమ్మ చీరల లుక్ ఇదే!

కేసీఆర్ ఫామ్ హౌస్ భూములపై సీఎం రేవంత్ రహస్య సర్వే.. ఇక నెక్ట్స్ ప్లాన్ అదేనా..?

Big Stories

Advertisement
×