E-Paper
Advertisement

ఇండియా షైనింగ్‌- బంగారు తెలంగాణ…! ఒక్క నినాదం.. కొంపలు ముంచిన వైనం! ఆత్మవిశ్వాసం కాదది అతి విశ్వాసంగా తేల్చిన జనం..

ఇండియా షైనింగ్‌- బంగారు తెలంగాణ…! ఒక్క నినాదం.. కొంపలు ముంచిన వైనం! ఆత్మవిశ్వాసం కాదది అతి విశ్వాసంగా తేల్చిన జనం..
Advertisement

ఇద్దరూ కీలక నేతలే. రాజకీయాల్లో తమ ఉనికిని చాటుకోవడమే కాదు.. తమదైన ప్రత్యేకమైన మాటతీరు, వ్యవహారశైలితో జనాన్ని విపరీతంగా ఆకట్టుకున్న నేతలే. ఒకరు వాజ్‌పేయీ, మరొకరు కేసీఆర్‌.

కేసీఆర్‌తో పోల్చితే వాజ్‌పేయీ జాతీయ నాయకత్వంలో తనదైన ముద్ర వేసుకున్నారు. వివిధ రకాల భిన్నమనస్తత్వాల రాజకీయ పార్టీలను కూడా ఏకతాటిపైకి తెచ్చి కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా బీజేపీని అధికారంలోకి నిలిపిన అపార రాజకీయ అనుభవం కలిగినవాడు.

Advertisement

జాతీయ రాజకీయాలతో కేసీఆర్‌కు పెద్ద టచ్‌ లేకున్నా.. తెలంగాణ ఉద్యమంలో.. రాష్ట్ర ఆవిర్బావం విషయంలో ఆయనది కీలకపాత్ర. ప్రసంగాల్లో ఈ ఇద్దరికీ దగ్గరి పోలికలున్నాయి. వ్యంగ్యం, హాస్యం కలగలిపిన మాటలు జనానికి బాగా కనెక్టయ్యేవి. కేసీఆర్‌ వ్యంగ్యానికి తోడు సామెతలు, కవితలు, తెలంగాణ యాస పంచ్‌ డైలాగులు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటాయి.

ఇప్పుడివన్నీ ఎందుకంటే.. అంతటి వాజ్‌పేయీ.. తెలంగాణ జాతిపితగా కీర్తించబడాలని బీఆర్‌ఎస్‌ బలంగా కోరుకునే కేసీఆర్‌..లు చేసిన ఓ నినాదాలు ఇద్దరికీ చేదు అనుభవాన్ని మిగిల్చాయి. పరాభవాన్ని చవిచూపాయి.  అత్మవిశ్వాసంతో వారు ముందుకెళ్లామని అనుకున్నా.. జనం దీన్ని అతివిశ్వాసంగా కొట్టిపారేశారు. ఓడగొట్టేశారు.

Advertisement

అంతటి చరిత్ర ఉన్నా.. జనం ఒక్కసారి వారి నినాదాన్ని, వైఖరిని జీర్ణించుకోలేకపోతే అధికారానికి దూరం చేస్తారనేది ఈ ఇద్దరి రాజకీయ ఉదంతాలను చెప్పుకోవచ్చు. వాజ్‌పేయీ .. 2004లో ముందస్తు ఎన్నికలకు పోవడమే కాదు… ఆ ఎన్నికల్లో ఇండియా షైనింగ్‌ నినాదాన్ని బలంగా తీసుకెళ్లారు.

అప్పటికే బీజేపీ మంచి ఊపు మీదున్నది. రెండు పర్యాయాలు ప్రధానిగా వాజ్‌పేయీ కొద్దికాలంలోనే అధికాారానికి దూరమైనా.. మూడోసారి ఐదేళ్ల పూర్తి టర్మ్‌గా ప్రధానిగా చేసి.. చివర్లో ముందస్తుకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో ఇండియా షైనింగ్‌ .. భారత్ వెలిగిపోతోంది..! అని జనం వద్దకు పోయారు వాజ్‌పేయీ.

దీన్ని జనం ఒక్కసారిగా తిరస్కరించారు. మీరు వచ్చి మాకేం చేశారనే ప్రశ్న గ్రామీణ ప్రాంత ప్రజల నుంచి విపరీతంగా వచ్చింది. జనం నిలదీసినంత పనిచేశారు. దీని ప్రభావం ఎన్నికల ఫలితాలపై గణనీయంగా పడింది. ఇది యూపీఏ  అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది. ఇదే తరహాలోనే కేసీఆర్‌ కూడా రెండు పర్యాయాలు సీఎంగా చేసిన తరువాత బంగారు తెలంగాణ నినాదాన్ని బలంగా తీసుకుపోవాలని అనుకున్నారు.

తెలంగాణను పూర్తిగా బాగు చేశానని, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణను టాప్‌గా నిలిపానని చెప్పుకునే ప్రయత్నం చేశారు. దీనికి తోడు ఇక దేశ్‌కీ నేతగా రాణిస్తానంటూ .. పార్టీని బీఆరెస్‌గా మార్చి ఇతర రాష్ట్రాల్లో పార్టీని బలపేతం చేయడం.. వలసలను ఆహ్వానించడం చేయడంతో జనం భగ్గుమన్నారు.

మేమేం బాగు పడ్డాం.. రెండుసార్లు నిన్ను సీఎంగా చేస్తే.. బంగారు తెలంగాణను చేశాననే మెసేజ్‌ను దేశానికి ఇచ్చి జాతీయ రాజకీయాల కోసం మమ్మల్ని వాడుకుంటావా? అనే ఆగ్రహం ప్రజల్లో కట్టలు తెంచుకున్నది. అందుకే .. ఇక్కడ మేమేం బాగుపడలేదు.. బంగారు తెలంగాణ నినాదం బ్లండర్‌ నినాదం అని దేశానికి తేల్చి చెప్పేందుకు కేసీఆర్‌ను దించేశారు జనం.

బాబు హయాంలో స్వర్ణాంధ్ర నినాదం ఇంతగా ప్రభావం చూపలేదు. కానీ తెచ్చుకున్న తెలంగాణను అప్పుడే బంగారు తెలంగాణ అనే నినాదంతో కేసీఆర్ పాలనకు కేరాఫ్ గా మార్చుకోవాలని అనుకోవడాన్నే జనం జీర్ణించుకోలేదు. తిరగబడ్డారు. తిరస్కరించారు.   వాజ్ పేయీ…  ఇండియా షైనింగ్ నినాదాన్ని కూడా బీజేపీ ఆ తరువాత కాలంలో తీసుకునేందుకు భయపడింది.   అచ్చేదిన్ పేరుతో   మోడీ జనానికి చేరవయ్యే ప్రయత్నం  చేశారు. ఈ నినాదం కూడా ఇండియా షైనింగ్ నినాదం లాంటిదేనని  సోనియా గాంధీ విమర్శించారు.

Tags

Related News

Gen-Z యూత్‌ కోసం.. నెల్లూరు రూరల్ పాలిటిక్స్‌లో కొత్త ట్రెండ్!

కృష్ణా జిల్లాలో ఆర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. దంచికొడుతున్న వర్షాలు!

పోక్సో కేసులో కోర్టు కీలక తీర్పు.. ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రాన అరెస్ట్ చెల్లదు

అక్టోబర్ 2న నో యూపీఐ డే.. దేశవ్యాప్తంగా వ్యాపారుల వినూత్న నిరసన!

నిజామాబాద్ మున్సిపల్ ఆఫీస్‌లో లంచాల దందా కలకలం

నాలుగు దశాబ్దాల బాలాపూర్ లడ్డూ సంచలన చరిత్ర ఇదే?

ఐక్యరాజ్యసమితి వేదికగా నెతన్యాహూ సంచలనం..!

Big Stories

Advertisement
×