Brahmamudi serial today Episode: శ్రీను ఏదో ఒక టైంలో వాళ్ల అమ్మకు తప్పకుండా ఫోన్ చేస్తాడని అప్పుడు వాడి ఫోన్ ట్రేస్ చేస్తే వాడున్న అడ్రస్ తెలుస్తుంది. అనుకుని రేవతికి ఫోన్ చేసి శ్రీనును పట్టుకోవాలంటే నువ్వొక సాయం చేయాలని అడుగుతాడు. నువ్వుడిగితే సాయం మాత్రమే కాదు ప్రాణమైన ఇస్తానని చెప్తుంది రేవతి. అయితే ఆ శ్రీను ఎప్పుడైనా వాళ్లమ్మకు ఫోన్ చేయోచ్చు కాబట్టి నువ్వు ఈ ఒక్క రాత్రికి శ్రీను వాళ్ల అమ్మ దగ్గర ఉండాలి అని చెప్తాడు. రేవతి సరే అంటుంది. మరుసటి రోజు కోర్టు దగ్గర అప్పు, కళ్యాణ్, కావ్య ముగ్గురు కలిసి రాజ్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఏంటి వదిన ఇంత టైం అవుతున్నా అన్నయ్యా ఇంకా రావడం లేదేంటి అని కళ్యాణ్ అడుగుతాడు.
నేను ఆయన గురించి చూస్తున్నాను కవిగారు అని కావ్య చెప్తుంది. అసలు ఆ శ్రీను గాడి గురించి ఏమైనా ఇన్మఫర్మేషన్ తెలిసి ఉంటుందా అక్కా అని అప్పు అడుగుతుంది. అదేమీ తెలియదు అప్పు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ స్విచ్చాప్ వస్తుంది. ఆయన వస్తే గానీ అసలు ఏం జరిగిందో తెలియదు అని కావ్య చెప్తుండగానే.. రాజ్ వస్తాడు. రాజ్‌ను చూసిన కావ్య రామ్ గారు ఆ శ్రీనుగాడు ఎక్కడున్నాడో తెలిసిందా..? అని అడుగుతుంది. దీంతో రాజ్ నాకేం తెలియదు కళావతిగారు అని చెప్తాడు. ఏంటి రామ్ గారు రాత్రి ఏదో ఒకటి చేస్తానని చెప్పి ఇప్పుడు నీకేం తెలియదు అంటున్నారేంటి..? ఇంకాసేపట్లో హియరింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ లోపు మనం వాణ్ని పట్టుకుని కోర్టులో అప్పు ఆ తప్పు చేయలేదు అని చెప్పించకపోతే జడ్జి గారు వాళ్లు చెప్పిందే నిజం అని నమ్మిస్తారు. అప్పును సస్పెండ్ చేసి శిక్ష కూడా వేస్తారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం రామ్ గారు అని అడుగుతుంది.
మీరేం కంగారు పడకండి కళావతి గారు మీరు భయపడ్డట్టు ఏమీ జరగదు అంటాడు రాజ్. దీంతో కావ్య కంగారుగా అవతల ఒకపక్క కోర్టుకు టైం అవుతుంది. ఇంఒతవరకు ఆ శ్రీను జాడ తెలియదు ఇలాంటి టైంలో భయపడకపోతే ఎలా అండి అంటుంది. దీంతో రాజ్ నేను రాత్రే రేవతి అక్కతో మాట్లాడాను.. కళావతి గారు వాడికి సంబంధిచిన ఏ ఇన్ఫర్మేషన్ దొరికినా నాకు కాల్ చేస్తాను అని చెప్పింది. కానీ ఇంత వరకు చేయలేదు.. నేను ఆమె కాల్ కోసమే ఎదురుచూస్తున్నాను. మీకు ఆవిడ కాల్ చేయకపోతే మీరే ఆవిడకు కాల్ చేసి అసలు ఏం జరిగిందో కనుక్కోవచ్చు కదా రామ్ గారు త్వరగా కాల్ చేయండి అని చెప్తుండగానే.. రేవతి, రాజ్‌కు కాల్ చేస్తుంది. ఇదిగో అక్కే కాల్ చేస్తుంది అంటూ రాజ్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. తమ్ముడు నువ్వు చెప్పింది కరెక్టే రాత్రి శ్రీను వాళ్ల అమ్మకు కాల్ చేశాడు అని చెప్తుంది. దీంతో రాజ్ చాలా థాంక్స్ అక్కా నేను ఇప్పుడే వస్తాను అంటూ కావ్య వాళ్లకు చెప్పి రాజ్ ఒక్కడే శ్రీనును పట్టుకొస్తానని వెళ్తాడు.
రాజ్ వెళ్లిపోయాక అప్పును పోలీసులు తీసుకెళ్తారు కావ్య ఒక్కతే ఉంటుంది. ఇంతలో యామిని వస్తుంది. ఏంటి కావ్య చెల్లికి ధైర్యం చెప్పి పంపించి నువ్వేంటి ఇలా డల్లు అయిపోయావు. లోపల భయపడుతూ పైకి ధైర్యగా ఉన్నట్టు నటిస్తున్నావా..? అప్పును ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదా..? నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా..? అని అడుగుతుంది. దీంతో కావ్య కోపంగా ఏంటి యామిని వెటకారమా..? లేకపోతే నా చెల్లిని నేను కాపాడుకోలేననే అహంకారమా..? అంటుంది. దీంతో యామిని వెటకారాలు.. అహంకారాల గురించి మనకెందుకు కావ్య.. నేను మాట్లాడుతుంది. మన అవసరాల గురించి.. నీకేమో రాజ్ కావాలి. నీకేమో నీ చెల్లెలు కావాలి. ఎక్స్‌చేంజ్ చేసుకుంటే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్‌కు ఇంత టెన్షన్ అవసరమా..? నువ్వు రాజ్ బావను వదిలేసి తనను నా దగ్గరకు పంపిస్తాను అని మాటిస్తే.. నీ చెల్లిని నిర్ధోషి అని ఫ్రూవ్ చేసి బయటకు తీసుకొస్తాను.. ఆలోచించుకో నీకు ఎక్కువ టైం లేదు కావ్య తొందరగా చెప్పు.. బావ కావాలి.. నీ చెల్లెలు జీవితమా..? అంటూ యామిని అడగ్గానే..
రెండు కావాలి యామిని అంటుంది కావ్య. అది జరగని పని అంటుంది యామిని .. జరుగుతుంది. జరిగి తీరుతుంది ఏంటి నువ్వు నాకు సాయం చేయకపోతే నేను నా చెల్లిని కాపాడుకోలేను అనుకున్నావా..? ఇలా బెదిరిస్తే అలా ఆయన్ని నీ దగ్గరకు పంపిస్తాను అనుకున్నావా..? నీ సాయం లేకుండానే నేను చెల్లిని కాపాడుకుంటాను అని చెప్తుంది కావ్య చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత యామిని రౌడీకి ఫోన్ చేసి శ్రీనును జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. సరే అంటాడు రౌడీ. మరోవైపు శ్రీను వాళ్ల అమ్మ రత్నమ్మ దగ్గరకు వెళ్లి శ్రీనుకు ఫోన్ చేసి హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నామని మీ అమ్మకు యాక్సిడెంట్ జరిగింది అని చెప్తాడు. దీంతో శ్రీను కంగారుగా నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అంతా చూసిన రౌడీ శ్రీను వెళ్లకుండా మెడ మీద కత్తి పెట్టి అక్కడే కూర్చోబెడతాడు. మరోవైపు కోర్టులో అప్పు కేసు వాదనలు, ప్రతి వాదనలు జరుగుతుంటాయి. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?