BigTV English

Laser Weapon System: లేజర్ వెపన్ రెడీ.. చైనా, పాక్‌కు చుక్కలే!

Laser Weapon System: లేజర్ వెపన్ రెడీ.. చైనా, పాక్‌కు చుక్కలే!

Laser Weapon System: ఇండియాతో.. ఇప్పుడంత ఈజీ కాదు. ఏళ్లు గడుస్తున్నకొద్దీ.. భారత్ అధునాతన ఆయుధాలని సమకూర్చుకుంటోంది. మరింత శత్రుదుర్భేద్యంగా తయారవుతోంది. ఇప్పటికే ఎన్నో అడ్వాన్స్‌డ్ వెపన్స్‌ని తన అమ్ములపొదిలో చేర్చుకున్న భారత్.. కొత్తగా మరో అధునాతన అస్త్రాన్ని ప్రయోగించింది. దేశంలో తొలిసారి.. లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్‌ని విజయవంతంగా టెస్ట్ చేసింది డీఆర్డీవో. అసలు.. ఇదెలా పనిచేస్తుంది? దీని వల్ల కలిగే ప్రయోజనమేంటి?


శత్రు దేశాల డ్రోన్లు, క్షిపణులని కూల్చే టెక్నాలజీ

భారత సైన్యం అత్యాధునిక ఆయుధ వ్యవస్థని సమకూర్చుకుంటోంది. దేశంలో తొలిసారి లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ ఎంకే-2ఏని.. డీఆర్డీవో సక్సెస్‌ఫుల్‌గా పరీక్షించింది. ఇది.. శత్రు దేశాల డ్రోన్లు, క్షిపణుల లాంటి టార్గెట్లను కచ్చితత్వంతో ఛేదిస్తుంది. 30 కిలోవాట్ల లేజర్ కిరణాలతో.. క్షణాల్లో ధ్వంసం చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంది. త్వరలోనే.. లేజర్‌తో పనిచేసే ఈ కొత్త టెక్నాలజీ కలిగిన ఆయుధం.. భారత సైన్యం అమ్ములపొదిలో చేరనుంది. ఈ లేజర్ ఎనర్జీ ఆధారిత ఎంకే2 ఆయుధాన్ని.. డీఆర్డీవో ఏపీలోని కర్నూలులో టెస్ట్ చేసింది.


అధునాతన ప్యూచరిస్టిక్ స్టార్ వార్స్ వెపన్

ఈ వెపన్‌ని.. అధునాతన ఫ్యూచరిస్టిక్ స్టార్ వార్స్‌గా చెబుతున్నారు. కర్నూలులో ఉన్న నేషనల్ ఓపెన్ ఎయిర్‌లో.. ఎంకే2ఏ వెపన్ లేజర్ కిరణాలతో.. డ్రోన్ల సమూహాలను, ఫిక్స్‌డ్ వింగ్ యూఏవీలను ధ్వంసం చేసింది. అదేవిధంగా నిఘా సెన్సార్ వ్యవస్థని కూడా పనిచేయకుండా చేసింది. టెక్నాలజీలో ఇది భారత్‌ సాధించిన మరో విజయంగా చెప్పొచ్చు. ఈ లేజర్ కిరణాలను అత్యంత శక్తిమంతమైనవి. ఎలాంటి డ్రోన్లనైనా ధ్వంసం చేయగలవని డీఆర్డీవో తెలిపింది. మొత్తానికి.. వెహికల్‌ మౌంటెండ్‌ లేజర్‌ ఎనర్జీ డైరెక్టెడ్‌ వెపన్‌ ల్యాండ్‌ వెర్షన్‌ ప్రయోగం విజయవంతం అయింది. ఈ అడ్వాన్స్‌డ్ సిస్టమ్.. భారత సైనిక దళాలకు గేమ్ ఛేంజర్‌గా మారనుంది.

డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ వ్యవస్థలున్న దేశాల సరసన భారత్

డీఆర్డీవో చేసిన లేజర్ వెపన్ ప్రయోగం సక్సెస్ అవడంతో.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తిమంతమైన డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ వ్యవస్థలు ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ కూడా చేరినట్లయింది. ప్రయోగానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో.. ఈ తరహా అధునాత టెక్నాలజీ కలిగిన అరుదైన దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది.

అమెరికా, రష్యా, చైనా దగ్గర లేజర్ ఆయుధాలు

ఇప్పటివరకు ఇలాంటి వ్యవస్థను ప్రదర్శించిన దేశాల్లో.. అమెరికా, రష్యా, చైనా ఉన్నాయి. ఇజ్రాయెల్ కూడా ఇదే తరహా ప్రయత్నాలు చేస్తోంది. ఆ లెక్కన.. భారత్ టాప్-5 దేశాల సరసన చేరినట్లయింది. ఈ కొత్త టెక్నాలజీ.. మన ఎయిర్ డిఫెన్స్ దళాన్ని మరింత పటిష్టం చేస్తుంది. ఈ లేజర్ వెపన్.. మనకు స్టార్ వార్స్ కెపాసిటీని అందిస్తుందని డీఆర్డీవో వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రయోగం.. స్టార్ వార్స్ టెక్నాలజీలో ఒకటి మాత్రమేనని తెలిపారు.

దేశీయంగా తయారైన ఎంకే-2ఏ డీఈడబ్ల్యూ లేజర్ అస్త్రం

దేశీయంగా తయారుచేసిన ఈ ఎంకే-2ఏ డీఈడబ్ల్యూ లేజర్ అస్త్రం.. సుదూర లక్ష్యాలను సైతం మెరుపువేగంతో సమర్థవంతంగా ఛేదించగలదు. అదేవిధంగా.. డ్రోన్ల సమూహాలు, శత్రు దేశాల నిఘా సెన్సార్లకు కూడా అడ్డుకట్ట వేయగలదు. ఇది.. మెరుపు వేగం, కచ్చితత్వంతో కేవలం.. కొన్ని సెకన్ల వ్యవధిలోనే.. టార్గెట్లను ఛేదిస్తుందని చెబుతున్నారు.

సెంటర్ ఫర్ హైఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్

ఈ లేజర్ వెపన్ రూపకల్పనలో.. డీఆర్డీవోకు చెందిన సెంటర్‌ ఫర్‌ హైఎనర్జీ సిస్టమ్స్‌ అండ్‌ సైన్సెస్, ఎల్‌ఆర్‌డీఈ, ఐఆర్‌డీఈ, డీఎల్‌ఆర్‌ఎల్‌ సహా వివిధ విద్యాసంస్థలు, పరిశ్రమలు భాగస్వామ్యం పంచుకున్నాయి. ఈ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెపన్ సిస్టమ్‌తో.. మందుగుండు సామాగ్రి వినియోగం సాధ్యమైనంత వరకు తగ్గుతుంది. ఈ లేజర్ అస్త్రం ఎంకే-2ఏ డీఈడబ్ల్యూ.. రాడార్, ఎలక్ట్రో ఆప్టిక్ వ్యవస్థ ద్వారా టార్గెట్లను గుర్తిస్తుంది.

కాంతివేగంతో దూసుకెళ్లి టార్గెట్లను ధ్వంసం చేసే వ్యవస్థ

ఆ వెంటనే.. కాంతివేగంతో దూసుకెళ్లి 30 కిలోవాట్స్ సామర్థ్యంతో కూడిన లేజర్ కిరణాలను ప్రయోగించి.. లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. శత్రు డ్రోన్ల స్ట్రక్చర్‌ని నాశనం చేయడంతో పాటు వార్‌హెడ్‌ను విధ్వంసం చేస్తుంది. మానవ రహిత వైమానిక వ్యవస్థలు విస్తరిస్తున్న ఈ కాలంలో.. వివిధ దేశాలు డ్రోన్ ఆధారిత యుద్ధాలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో లేజర్ అస్త్రం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read: ఏబీ వెంకటేశ్వరరావు అజెండా ఏంటి?

అత్యాధునిక ఆయుధాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు!

ఈ అడ్వాన్స్‌డ్ లేజర్ టెక్నాలజీ వెపన్.. యుద్ధ సమయాల్లో వినియోగించే అత్యాధునిక ఆయుధాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గిస్తుంది. అదేవిధంగా.. మందుగుండు సామాగ్రి వినియోగం తగ్గుతుంది. విప్లవాత్మక మార్పులతో కూడిన వ్యవస్థను అందుబాటులోకి తెస్తుంది. ముఖ్యంగా.. యుద్ధం కారణంగా తలెత్తే ఇతర నష్టాలను నివారించే అవకాశం ఉంది. తక్కువ ఖర్చుతోనే.. మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌ని భర్తీ చేస్తుంది. ప్రధానంగా.. మిసైళ్లు, డ్రోన్ల ద్వారా పొంచి ఉన్న ముప్పును.. అత్యంత కచ్చితత్వంతో అడ్డుకునే కెపాసిటీ.. ఈ డీఈడబ్ల్యూ వ్యవస్థకు ఉంది.

డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అభివృద్ధిలో ఇది తొలి అడుగు

ప్రస్తుతం ఇజ్రాయిల్ కూడా ఇదే తరహా టెక్నాలజీతో వెపన్స్ తయారు చేసే పనిలో ఉంది. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అభివృద్ధిలో ఇది మొదటి అడుగు మాత్రమే. మన డీఆర్డీవో కూడా ఇంకా చాలా టార్గెట్లను నిర్దేశించుకుంది. హై ఎనర్జీ సిస్టమ్‌తో.. అత్యధిక పవర్ కలిగిన మైక్రోవేవ్స్, ఎలక్ట్రానిక్ మ్యాగ్నటిక్ ఆయుధాలను తయారుచేసేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే మనకు ఉన్న అనేక రకాలైన టెక్నాలజీతో.. స్టార్ వార్స్ లాంటి శక్తిమంతమైన సామర్థ్యాలను కలిగిన ఆయుధాలను తీసుకొచ్చే అవకాశం ఉంది.

Related News

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

Big Stories

×