BigTV English

Political Parties Funds: లెక్కకందని విరాళాలు.. కుబేరుల లిస్ట్‌లో ఆ పార్టీ! వరల్డ్ బ్యాంకు అప్పు తీర్చేంత డబ్బు?

Political Parties Funds: లెక్కకందని విరాళాలు.. కుబేరుల లిస్ట్‌లో ఆ పార్టీ! వరల్డ్ బ్యాంకు అప్పు తీర్చేంత డబ్బు?

Political Parties Funds: ప్రతి దానికీ ఓ లెక్క ఉంటది. దానికి.. ఏదో ఒక దగ్గర ఎండ్ ఉంటది. కానీ.. ఈ దేశంలో కొన్ని రాజకీయ పార్టీలకు వస్తున్న డొనేషన్లకు మాత్రం లెక్క లేదు. అందుకే.. ఇండియాలో ఇప్పుడు డొనేషన్.. సెన్సేషన్‌గా మారింది. జస్ట్.. ఒక్క ఏడాదిలోనే బీజేపీకి వచ్చిన పార్టీ ఫండ్ 200 శాతానికి పైగా పెరిగిందంటే.. పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక్క బీజేపీకే పరిమితం కాదు. మనం తెలుసుకోవాల్సిన లెక్కలు.. చాలానే ఉన్నాయి.


పార్టీ ఫండ్స్ విషయంలో బీజేపీదే అగ్రస్థానం

ఇవి జస్ట్ నెంబర్స్ కావు.! అక్షరాలా.. ఈ దేశంలో పాపులర్ పొలిటికల్ పార్టీలకు వచ్చిన విరాళాలు. ఇదంతా.. జస్ట్ ఒక్క ఏడాదిలోనే! వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ.. రాజకీయంగా పీక్ స్టేజ్‌లో ఉంది. ఆ పార్టీ పెర్ఫార్మెన్స్ కూడా అదే స్థాయిలో ఉంది. ఏ ఎన్నిక వచ్చినా.. సత్తా చాటుతోంది. కానీ.. ఇది జస్ట్ ఎలక్షన్లకే పరిమితం కాలేదు. ఆ పార్టీకి వస్తున్న విరాళాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయ్. ఈ దేశంలోని మిగతా పొలిటికల్ పార్టీలతో పోలిస్తే.. బీజేపీకి విరాళాలు ఇస్తున్న వారి లిస్టు చాలా పెద్దది. అదే ఆ పార్టీకి విపరీతంగా విరాళాలు వచ్చేందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే.. బీజేపీకి 2 వేల 244 కోట్ల విరాళాలు అందాయ్. ఈ నెంబర్ చాలు.. బీజేపీ విషయంలో ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయో చెప్పడానికి!


ఈ ఏడాదిలో బీజేపీకి రూ.2,244 కోట్ల విరాళాలు

ఈ మధ్యకాలంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. బీజేపీ మంచి ఫలితాలనే సాధిస్తోంది. వరుస విజయాలతో సత్తా చాటుతున్న కమలం పార్టీకి.. మరోవైపు కాసుల వర్షం కురుస్తోంది. రోజురోజుకుృ.. బీజేపీకి విరాళాలిచ్చే వారి సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. పార్టీ ఫండ్స్ విషయంలో.. భారతీయ జనతా పార్టీ కంటే ముందూ మరే పార్టీ లేదు. గత ఏడాదిలో వ్యక్తులు, ట్రస్టులు, కార్పొరేట్ సంస్థల నుంచి ఎక్కువ మొత్తంలో బీజేపీకి డొనేషన్స్ అందాయి. 20 వేల రూపాయల కంటే తక్కువ ఏ ఒక్కరూ ఇవ్వలేదు. అలా.. మొత్తంగా 2 వేల 244 కోట్లు అందాయి. ఇది.. అంతకుముందు ఏడాది.. అంటే 2022-23లో వచ్చిన విరాళాల కంటే మూడు రెట్లు ఎక్కువ. దాంతో.. పార్టీ ఫండ్స్ విషయంలో బీజేపీనే అగ్రస్థానంలో కొనసాగుతోంది.

2023-24లో కాంగ్రెస్‌కు వచ్చిన ఫండ్ రూ.289 కోట్లు

మరోవైపు.. గత ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్‌కు కూడా భారీగానే విరాళాలు అందాయి. 2023-24లో 289 కోట్ల పార్టీ ఫండ్ అందింది. అంతకుముందు సంవత్సరం కాంగ్రెస్‌కు 80 కోట్లు పార్టీ ఫండ్ వచ్చింది. దాంతో పోలిస్తే.. కాంగ్రెస్‌కు కూడా భారీగా పార్టీ ఫండ్ అందిందనే చెప్పాలి. అయితే.. బీజేపీ, కాంగ్రెస్ ప్రకటించిన మొత్తం విరాళాల్లో.. ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చిన డొనేషన్ల వివరాలు లేవు. ఎందుకంటే.. ఆ వివరాల్ని రాజకీయ పార్టీలు కేవలం ఆడిట్ రిపోర్టుల్లో మాత్రమే ప్రకటించాల్సి ఉంటుంది. ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది. కాబట్టి.. రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలు.. నేరుగానైనా రావాలి. లేనిపక్షంలో ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా నైనా రావాలి.

బీఆర్ఎస్‌కు రూ.496 కోట్లు, వైసీపీకి రూ.122 కోట్ల ఫండ్

అయితే.. కొన్ని ప్రాంతీయ పార్టీలు మాత్రం 2023-24 కాంట్రిబ్యూషన్ రిపోర్టులో.. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా స్వీకరించిన విరాళాల్ని కూడా స్వచ్ఛందంగా వెల్లడించాయి. అందులో.. బాండ్ల ద్వారా దాదాపు 496 కోట్లు పొందిన బీఆర్ఎస్ కూడా ఉంది. అదేవిధంగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 122 కోట్లు, డీఎంకే 60 కోట్లు పొందాయి. ఇక.. జేఎంఎం పార్టీ బాండ్ల ద్వారా పదకొండున్నర కోట్లు అందుకున్నట్లు ప్రకటించింది. ఇతర మార్గాల్లో.. ఆ పార్టీకి కేవలం 64 లక్షల రూపాయల విరాళాలు మాత్రమే అందాయి.

2023-24లో తెలుగుదేశానికి రూ.100 కోట్ల పార్టీ ఫండ్

2022-23 సంవత్సరంతో పోలిస్తే.. గత ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి అందిన పార్టీ ఫండ్ 212 శాతం పెరిగింది. ఎందుకంటే.. ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి.. ఆ స్థాయిలో విరాళాలు వచ్చి ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు సంవత్సరం.. బీజేపీ 742 కోట్లు, కాంగ్రెస్ దాదాపు 147 కోట్లు తమకు విరాళాలు ద్వారా అందినట్లు ప్రకటించాయి. అప్పటితో పోలిస్తే.. రెండు పార్టీలకు పార్టీ ఫండ్స్ భారీ స్థాయిలో పెరిగినట్లు అర్థమవుతోంది. ఇటీవలి కాలంలో ఎలక్టోరల్ ట్రస్ట్ రూట్ ద్వారా బీజేపీకి 850 కోట్లు వచ్చాయి. అందులో 723 కోట్లకు పైగా ప్రుడెంట్ నుంచి, 127 కోట్లు ట్రయాంఫ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి, 17 లక్షల రూపాయలు ఎన్‌జిగార్టింగ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి వచ్చాయి. కాంగ్రెస్‌కు కూడా ఎలక్టోరల్ ట్రస్ట్ రూట్‌లో.. ప్రుడెంట్ నుంచి 156 కోట్లకు పైగా విరాళం అందుకుంది.

ఎలక్టోరల్ ట్రస్ట్‌ల ద్వారా పార్టీలకు భారీగా విరాళాలు

ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న రిపోర్ట్ ప్రకారం.. ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి బీజేపీకి 723 కోట్లకు పైగా పార్టీ ఫండ్స్ వచ్చాయ్. అదే ట్రస్ట్ నుంచి కాంగ్రెస్‌కు.. 156 కోట్లకు పైగా విరాళాలు అందాయి. ఈ లెక్కన.. 2023-24 సంవత్సరంలో బీజేపీకి వచ్చిన విరాళాల్లో.. మూడింట ఒక వంతు కాంగ్రెస్ అందుకున్న విరాళాల్లో.. సగానికి పైగా ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచే వచ్చాయి. దీని వెనుక బడా కంపెనీలున్నాయనే చర్చ నడుస్తోంది.

రాజకీయ పార్టీలకు ఇన్ని విరాళాలు ఎవరిస్తున్నారు?

పదులు, వందల కోట్లలో పార్టీలకు అందుతున్న విరాళాలకు సంబంధించి.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మేజర్ పాయింట్ ఒకటుంది. ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ మాత్రమే దాతగా ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ కూడా ట్రస్టుల ద్వారా 156 కోట్లకు పైగా విరాళాలు అందుకుంది. ఇదే ట్రస్ట్ ద్వారా బీఆర్ఎస్‌కు 85 కోట్లు, వైసీపీకి 62 కోట్లకు పైగా విరాళాలు అందాయి. అయితే ఈ రెండు పార్టీలు.. కొద్ది నెలల గ్యాప్‌లోనే అధికారానికి దూరమయ్యాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అధికార తెలుగుదేశం పార్టీకి కూడా ఈ ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా 33 కోట్ల ఫండ్ అందింది.

రాజకీయ పార్టీలకు ఇంత ఫండ్ ఎక్కడి నుంచి వస్తోంది?

ఇక.. ట్రయాంఫ్ ఎలక్టోరల్ ట్రస్ట్, జై భారత్ ట్రస్ట్ నుంచి.. తమిళనాడు పార్టీ డీఎంకేకు 8 కోట్ల విరాళాలు అందాయి. ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్ మరొకటుంది. లాటరీ కింగ్ ఆఫ్ ఇండియాగా పేరున్న శాంటియాగో మార్టిన్ కంపెనీ కూడా బీజేపీకి విరాళం ఇచ్చింది. ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ నుంచి 3 కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఫ్యూచర్ గేమింగ్ సంస్థ.. అతిపెద్ద దాతగా ఉంది. ఈ కంపెనీ ద్వారా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా లాభపడింది.

అయితే.. శాంటియాగో మార్టిన్ కంపెనీపై మనీలాండరింగ్ ఆరోపణలున్నాయి. ఆ కంపెనీపై ఈడీ, ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్స్ నిఘా ఉంది. మిగతా జాతీయ పార్టీలు కూడా 2023-24 ఆర్థిక సంవత్సరంలో తమకు వచ్చిన విరాళాలను ప్రకటించాయి. ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీకి 11 కోట్ల రూపాయల ఫండ్ అందింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏడాది ఆప్‌కు వచ్చిన విరాళాలు భారీగా తగ్గిపోయాయి. అప్పుడు 37 కోట్ల పార్టీ ఫండ్ వస్తే.. ఈసారి కేవలం 11 కోట్లు మాత్రమే ఆ పార్టీకి విరాళాల రూపంలో అందాయి.

2023-24లో తెలుగుదేశానికి రూ.100 కోట్ల పార్టీ ఫండ్

2022-23లో 6 కోట్లుగా ఉన్న సీపీఎం విరాళాలు.. ఈ ఏడాది ఏడున్నర కోట్లకు పైనే పెరిగాయి. 2023-24లో తెలుగుదేశం పార్టీ 100 కోట్లకు పైగా పార్టీ ఫండ్ అందినట్లు ప్రకటించింది. ఇక.. సమాజ్ వాదీ పార్టీకి గతేడాది 33 కోట్ల విరాళాలు వస్తే.. ఈ ఏడాది కేవలం 47 లక్షలు మాత్రమే పార్టీ ఫండ్ రూపంలో అందింది. ఇక.. బహుజన సమాజ్ పార్టీ ఈసారి 20 వేల కంటే ఎక్కువ విరాళాలు అందలేదని ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత.. దేశంలోని రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాలను ఎన్నికల సంఘం ప్రకటిస్తోంది. ఇందులో భాగంగానే.. ఈసీ పొలిటికల్ పార్టీలకు అందిన విరాళాల్ని వెల్లడించింది.

భారీ విరాళాల వెనుక బడా కార్పొరేట్ కంపెనీలున్నాయా?

రాజకీయ పార్టీలకు అందుతున్న వందల కోట్ల విరాళాల వెనుక.. బడా కార్పొరేట్ కంపెనీలున్నాయ్. నిర్మాణరంగాన్ని ఏలుతున్న సంస్థలూ ఉన్నాయ్. ఒక పార్టీ అధికారంలోకి వస్తుందనే అంచనాలుంటే.. ఆ పార్టీకి వందల కోట్ల రూపాయల ఫండ్ ఇవ్వడం లాంటివి చేస్తున్నాయనే చర్చ జరుగుతోంది. మొత్తం ఒకే పార్టీకి ఇవ్వకుండా.. కొంత మొత్తంలో అపొజిషన్ పార్టీలకు కూడా ఇస్తున్నాయ్. ఫలితాలు తారుమారై.. వీళ్లు అధికారంలోకి వచ్చినా.. తర్వాత తమకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే.. ప్రతిపక్ష పార్టీలకు కూడా కొంత మొత్తంలో ఫండ్ రూపంలో ముట్టజెబుతున్నారనే ప్రచారం ఉంది.

ఇక.. తాము భారీ మొత్తంలో ఫండ్ సమర్పించుకున్న పార్టీ అధికారంలోకి వచ్చాక.. కాంట్రాక్టుల రూపంలోనే, మరో విధంగానో.. ఆ పార్టీల ప్రభుత్వాలు ఉన్న చోట.. లబ్ధి పొందాలనే ఆలోచనతోనే.. ఈ కంపెనీలన్నీ ఇంత భారీ మొత్తంలో పార్టీ ఫండ్ సమర్పించుకుంటున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయ్. ముఖ్యంగా.. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా లిమిటెడ్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్ , భారతీ ఎయిర్‌టెల్ లాంటి కంపెనీలన్నీ 2022-23లో ప్రుడెంట్‌ ఎలక్టోరల్ ట్రస్ట్‌కు విరాళాలు అందించాయి. ఇక.. 2023-24కి సంబంధించిన దాతల జాబితాని.. ప్రుడెంట్ ఇంకా రిలీజ్ చేయలేదు. ఆ రిపోర్ట్ బయటకొస్తే.. ఏ కంపెనీ.. ఏ పార్టీకి ఎంత ఫండ్ ఇచ్చిందనేది తేలుతుంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×