E-Paper
Advertisement

కేంద్ర కరువు సాయం ప్యాకేజీపై పెదవి విరుపేనా? నాడు కేసీఆర్‌కు చేదు అనుభవం..! ఇప్పుడు 20వేల కరువు ప్యాకేజీలో ఎంతిస్తారో?

కేంద్ర కరువు సాయం ప్యాకేజీపై పెదవి విరుపేనా? నాడు కేసీఆర్‌కు చేదు అనుభవం..! ఇప్పుడు 20వేల కరువు ప్యాకేజీలో ఎంతిస్తారో?
Advertisement

తెలంగాణలో సూపర్ ఎల్‌నినో కరువు కోరలు చాస్తున్నది. దేశమంతటా ఈ కరువు ఛాయలు అలుముకున్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్టయ్యింది. కరువును సమర్థవంతంగా ఎదుర్కునేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్దం చేసుకున్నది. ప్రధానంగా ఇలాంటి కరువులు వచ్చినప్పుడు కేంద్ర నిధులపై భారీ ఆశలు పెట్టుకుంటారు.

కరువు మండలాలను డిక్లేర్‌ చేసి ఇక్కడి కరువు పరిస్థితులను వివరిస్తూ కేంద్ర ప్యాకేజీ కోసం రాష్ట్రాలు ఎదురుచూస్తూ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ కూడా ఈ ప్యాకేజీపై భారీ ఆశలే పెట్టుకున్నది. 20వేల కోట్ల ప్యాకేజీకి ప్రతిపాదనలు సిద్దం చేసింది. అయితే డబుల్ ఇంజిన్‌ సర్కార్లకు ఈ ప్యాకేజీల విషయంలో పెద్ద ఢోకా లేదు. కానీ తెలంగాణ లాంటి రాష్ట్రాలకే ఇబ్బందులు తప్పేలా లేవు. ఏపీలో చంద్రబాబుకు ప్యాకేజీ ఇబ్బందులుండవనే చెప్పాలి.

Advertisement

గతంలో కేసీఆర్ పాలనలో కూడా 2015లో తెలంగాణలో కరువు ఛాయలు అలుముకున్నాయి. దాన్ని కూడా అప్పుడు ఎల్‌నినోగానే పిలిచారు. కానీ ఇప్పటి సూపర్ ఎల్‌నినోతో పోల్చితే కొంచెం తక్కువ తీవ్రత కరువుగానే దాన్ని చూడాలి. అప్పుడు కేసీఆర్ మొత్తం 231 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. కొన్ని జిల్లాలు అంటే.. మహబూబ్‌నగర్‌, మెదక్‌, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. కానీ ఇప్పుడలా కాదు.. రాష్ట్రం మొత్తం కరువు కోరలు చాచుకుని ఉంది.

వ్యవసాయానికి కూడా పెద్ద దెబ్బే తగిలింది. తాగు, సాగునీటి వనరులకు తీవ్ర కటకట ఏర్పడిన నేపథ్యంలో.. దీన్ని ఎదుర్కునేందుకు రేవంత్‌ సర్కార్‌ ఎదురీదుతోంది. మొత్తం 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. ఇందులో 111 మండలాల్లో తీవ్ర కరువుగా, 254 మండలాల్లో ఓ మోస్తారు కరువు ఉన్నట్టుగా డిసైడ్ చేశారు. 20వేల కోట్ల కేంద్ర ప్యాకేజీ పై కూడా భారీ ఆశలే పెట్టుకున్నది రేవంత్ సర్కార్.

Advertisement

ఈ నేపథ్యంలో కేసీఆర్‌ పాలనలో వచ్చిన కరువు.. అప్పటి పరిస్థితులు, కేంద్ర సాయం పై కూడా చర్చ జరుగుతోంది. కేసీఆర్ అప్పటి కరువు తీవ్రతను బట్టి రూ. 3065 కోట్ల కరువు ప్యాకేజీ కావాలని మోడీ సర్కార్‌ను కోరారు. కానీ మోడీ ఈ నిధుల ప్యాకేజీపై కొర్రీలు పెట్టింది. జాతీయ విపత్తు నిధి- ఎన్డీఆర్‌ఎఫ్‌ నిబంధనలను సాకుగా చూపి కేసీఆర్‌ కోరిన ప్యాకేజీలో ముప్పావు కూడా విడుదల చేయలేదు. రూ. 791 కోట్లను మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నది.

దీనిపై కేసీఆర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇవి ఏమాత్రం సరిపోవని , ఇంకా నిధులు కావాలని పదే పదే లేఖలు రాసినా.. కేంద్రం కనీసం స్పందించలేదు. దీంతో కేసీఆర్‌ రాష్ట్ర బడ్జెట్ నుంచే దాదాపు రూ.600 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధుల కింద రూ. 150 కోట్లు, తాగునీటికి రూ. 55 కోట్లు, పశుగ్రాసం, విత్తనాల సబ్సిడీకి రూ. 50కోట్లు, రుణాల రీ షెడ్యూల్‌, ఉపాధి హామీ పనుల పెంపు, రుణమాఫీ సంపూర్ణం కోసం ప్రత్యేక నిధులు కేటాయించడం వల్ల కరువు నుంచి కొంత ఉపశమనం దొరికిందనే చెప్పాలి.

ఇప్పుడు రేవంత్‌ సర్కార్‌ కూడా మోడీ సర్కార్‌ నుంచి ఇదే రకమైన చేదు అనుభవం ఎదుర్కోక తప్పేలా లేదు. అసలే ఇప్పుడు కేంద్రం, రాష్ట్ర సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే విపత్తు వేళ మరీ రాజకీయాలకు పోకుండా.. ఎంతో కొంత ఉపశమనం లభించే ప్యాకేజీనే మోడీ విడుదల చేస్తారనే ఆశాభావం కూడా వ్యక్తమవుతోంది.

Tags

Related News

సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పత్రాలు అడుగుతున్నారని ప్రచారం! ఏకంగా ప్రెస్‌మీట్‌లోనే ఆ పత్రాన్ని చూపిన కేటీఆర్‌..! సర్కార్‌ ఖండించినా ఆగని దుష్ప్రచారం!

రాహుల్‌ను ప్రధానిని చేయలేదు..:! కేటీఆర్‌ను సీఎం చేస్తా..! కేసీఆర్‌కు కలిసిరాని కాలం! ఎంతెంత దూరం.. ఇంకెంత దూరం..?

గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదులో కనిపించని జోష్.. ఎందుకో తెలుసా..?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తప్పుడు సంకేతాలా? ఆ మంత్రుల పరపతికి పరోక్షంగా దెబ్బకొట్టే యత్నమా? బీఆరెస్‌ వ్యూహంలో భాగంగానే సురేఖ సారీ పాచికా?

రాజీవ్‌ను సోనియా వద్దన్నారు! సోనియాను రాహుల్‌ వద్దన్నారు! ‘బిలాంగింగ్‌ .. ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ బుక్‌ నేపథ్యంలో కొత్త చర్చ!

దేశ రాజకీయాల్లో మళ్లీ బిఆర్‌ఎస్‌ ఎంట్రీ.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

ఇలాంటి స్పూర్తే మీ నుంచి కోరుకునేది అధ్యక్షా! జాతీయ స్థాయిలో చర్చకు వచ్చిన పీసీసీ చీఫ్‌ మెరుపు ధర్నా!

Big Stories

Advertisement
×