BigTV English

Ys Jagan Defeat: జగన్ కొంపముంచింది ఆ షాడో సీఎంలేనా..?

Ys Jagan Defeat: జగన్ కొంపముంచింది ఆ షాడో సీఎంలేనా..?

Jagan Countary Persons Role in YCP Defeat: ఏపీలో వచ్చిన అనూహ్య ఫలితాలతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు వైసీపీ అధినేత జగన్. ఫ్యాన్ పార్టీకి దిమ్మతిరిగే ఓటమి రావడానికి కారణం ఏంటా అని కార్యకర్తలు, నేతలు తలమునకలు అయ్యేలా ఆలోచనలో పడ్డారు. వైసీపీ ఇంత దారుణంగా ఓడిపోవడానికి వారిద్దరే కారణం అంటూ తీవ్రమైన చర్చ నడుస్తుంది. వారు చేసిన పనులు.. తీసుకున్న నిర్ణయాలు వల్లే పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చిందని నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరు ? పార్టీ ఎందుకు ఇంతలా కింద స్థాయికి పడిపోవాల్సి వచ్చిందో..


ఆంధ్రప్రదేశ్ లో మొన్న జరిగిన ఎన్నికలు వైసీపీ కొంప ముంచాయి. జగన్ మ్యానియా పని చేస్తుందని, సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయని.. సామాజిక న్యాయం తమకు న్యాయం చేస్తుందని భావించిన వైసీపీ చివరికి చతికిల పడింది. 2019లో 151 సీట్లు ఇచ్చిన ప్రజలు.. 2024 ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం చేసి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే తీర్పు నిచ్చారు. ఈ తారుణంలోనే ఓటమికి గల కారణాలను ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఆలోచిస్తున్నారు. కానీ అన్నంటికంటే అసలు కారణం జగన్ చుట్టు వుండే కోటరీ అనేది జగమెరిగిన సత్యం.

జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు చేసిన ప్రతి పనిలో జగన్ కి 10 శాతం ప్రమేయం ఉంటే చుట్టూ ఉండే కోటరీది 90 శాతం పాత్ర ఉంటుంది. అటు ప్రజలతో పాటు ఇటు పార్టీ నేతల్లో కూడా జగన్ పై వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం కోటరీలో ఉండే ఆ ఇద్దరే అని నేతలంతా గళం విప్పుతున్నారు. వారి వల్లే ఈ స్థాయిలో పార్టీ దెబ్బతిందని వైసీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కనిపించే సీఎం జగన్ ఒకరైతే.. కనపడని షాడో సీఎం మరొకరు ఉన్నారు. సీఎం తర్వాత తానే సీఎం అనేంత రేంజిలో బిజీబిజీగా గడుపుతూ.. ప్రతి ప్రభుత్వం మీటింగ్ లోనూ.. ప్రైవేట్ మీటింగ్ లోనూ తానే కనపడేవారు. ఈ తరహా వైఖరిపై విమర్శలు వస్తున్నప్పటికీ.. మళ్లీ అదే రిపీట్ చేస్తూ.. చివరికి పార్టీ పతనానికి కూడా ఒక కారణం అయ్యారు. అతనే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.


Also Read: ఏపీ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ నియామకం

ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా.. ఎవరికి మంత్రి పదవులు రావాలన్నా.. ఎవరికైనా పోస్ట్ కేటాయించాలన్నా.. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి అధికారుల వరకు.. బదిలీ చేయాలన్నా సజ్జల అనుమతి లేనిదే.. సీఎం జగన్ చేయడమే టాక్ పెద్ద ఎత్తున నడిచింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిన్నా మొన్నటి వరకు కూడా ఇదే నడిచిందని భాహాటం గానే సొంత నేతలు సైతం విమర్శలు గుప్పించారు. సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే పార్టీ ఇంతలా దిగజారి పోయిందని.. 11 సీట్లకే పరిమితం అయ్యిందని ఫైర్ అవుతున్నారు.

ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశ వర్కర్స్.. ఇలా ఎవరితో చర్చలు జరిగిన.. ప్రతి సందర్భంలోనూ సజ్జల వీరు ఎవరు తమ ఓటు బ్యాంకు కాదని కించ పరిచే విధంగా మాట్లాడేవారు. ఈ మాటలే ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయ్యాయని చాలా మంది భావిస్తున్నారు. ఆయన మాట్లాడిన తీరు వల్లే వారి ఓటు బ్యాంక్ అంతా చేజారిందని వాపోతున్నారు. పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత అంతా సజ్జల పైనే ఉంటుందని సొంత నేతలే నిప్పులు చెరుగుతున్నారు.

Also Read: Kethireddy: జగన్ సీఎంవో తీరుపై కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

సజ్జల తర్వాత ఆ స్థాయిలో పార్టీ ఓటమికి కారణమైన వ్యక్తి ఎవరా అంటే.. సీఎంఓలో ఉండే దనుంజయ రెడ్డి వైపే అందరి వేళ్లు చూపిస్తున్నాయి. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ.. అన్ని నిర్ణయాలు తానే తీసుకుంటూ.. అరాచకాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే దానికి ధ్రువీకరణ పత్రం ఇచ్చింది ధనుజయ రెడ్డి అని చెబుతున్నారు. నిర్ణయాలు సజ్జలు తీసుకుంటే ఆర్డర్లు ధనుంజయ రెడ్డి ఇచ్చేవారని… అధికారులు మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నారని మండిపడుతున్నారు. జగన్ ఓటమికి కారణమైన ప్రతి తప్పులో ధనుంజయ రెడ్డి హస్తం కూడా ఉందని బహిరంగం గానే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ వ్యవహారంపైనే వైసీపీ మాజీ ఎమ్మెల్యే మీడియా సాక్షిగా కుండబడ్డలు కొట్టేలా మాట్లాడడం ఈ ఆరోపణలను నిజం చేస్తున్నాయి. వైసీపీ ఓటమి తర్వాతహ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.. ధనుంజయ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు. సీఎం జగన్ ని కలిసే అవకాశం కూడా తమకి ఇవ్వలేదని.. తానే సీఎం లాగా బిహేవ్ చేసే వారని ఆందోళన వ్యక్తం చేశారు.

మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ్ రెడ్డి కలిసి పార్టీ నాశనానికి కృషి చేశారే తప్ప.. ఎదుగుదలకు ఎక్కడ ఉపయోగపడలేదని తీవ్ర ఆరోపణలైతే వినపడుతున్నాయి.

Tags

Related News

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Big Stories

×