E-Paper
Advertisement

ఉల్లి రూ.70, వెల్లుల్లి రూ.240.. సామాన్యుడు ఎలా బతకాలి? రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ప్రశ్నల వర్షం

ఉల్లి రూ.70, వెల్లుల్లి రూ.240.. సామాన్యుడు ఎలా బతకాలి? రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ప్రశ్నల వర్షం
Advertisement

Harish Rao: నిత్యావసరాల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తుంటే.. ధరలకు అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దారుణమని హరీశ్ రావు మండిపడ్డారు. ధరలను నియంత్రణ చేయడంలో విఫలమైందని ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, పర్యవేక్షణ వైఫల్యానికి సామాన్య ప్రజలే మూల్యం చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సన్నబియ్యం ధరలు కేవలం నాలుగు నెలల్లోనే 25 శాతం పెరగడం ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తి సాధించామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం.. మరి ఉత్పత్తి పెరిగినప్పుడు ధరలు తగ్గాల్సింది పోయి.. బియ్యం ధరలు ఎందుకు ఆకాశాన్ని అంటుతున్నాయని నిలదీశారు. మీరు ఇస్తున్న సన్నబియ్యం పథకం సఫలం అయితే, ఎందుకు బియ్యం ధరలు అదుపు తప్పుతున్నాయని ప్రశ్నించారు.

Advertisement

ప్రభుత్వం ఇచ్చే నాణ్యత లేని సన్నబియ్యాన్ని ప్రజలు వినియోగించడం లేదని హరీశ్ రావు ఆరోపించారు. ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతన్నకు ఎంఎస్పీ పేరిట దక్కుతున్నది నామమాత్రపు ధర అని అన్నారు. దళారులుకు మాత్రం క్వింటాకు రూ.8000 పైనే లభిస్తోందని ఆరోపించారు. ‘రైతుకు గిట్టుబాటు ధర లేదు. వినియోగదారుడికి అందుబాటు ధర లేదు. లాభపడుతున్నది మాత్రం మధ్య దళారులు?’ అని అన్నారు.

Also Read: మహాత్మా గాంధీని అవమానించేలా రీల్.. పాపులర్ ఇన్‌ఫ్లుయెన్సర్ అరెస్ట్

Advertisement

ఒక్క బియ్యమే కాకుండా ఉల్లి రూ.70, వెల్లుల్లి రూ.240, పల్లినూనె రూ.210, పెసరపప్పు రూ.125, కందిపప్పు రూ.165 ధరలు అడ్డగోలుగా పెరిగితే సామాన్య కుటుంబం ఎలా బతకాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. వంటింటి బడ్జెట్ తారుమారవుతున్నా.. పౌరసరఫరాల శాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రజల జేబులు ఖాళీ అవుతుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించడం కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత, అధిక మార్జిన్లపై తక్షణం తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read: AI ఏసీలు నిజంగా కరెంట్ బిల్లు తగ్గిస్తాయా? లేక కంపెనీల మైండ్ గేమా?

Tags

Related News

సింగరేణి కార్మికులకు భారీ గుడ్ న్యూస్.. బోనస్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం!

హైదరాబాద్‌లో దారుణం.. వృద్ధుడే లక్ష్యంగా హనీట్రాప్.. రూ.38 లక్షలు కాజేసిన కేటుగాడు!

బీఆర్ఎస్ సోషల్ మీడియాకు.. బల్మూరి వెంకట్ మాస్ వార్నింగ్!

తెలంగాణ సచివాలయానికి మంచినీటి స‌ర‌ఫ‌‌రా బంద్!

కేంద్రంతో తెలంగాణ రోడ్ల ముచ్చట.. నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక భేటీ!

ఒక్కో అధికారికి 10 మండలాలా? తెలంగాణ ఉద్యాన శాఖలో ఏం జరుగుతోంది!

తెలంగాణ ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం.. 35 మంది జూనియర్ లెక్చరర్ల తొలగింపు!

Big Stories

Advertisement
×