Telangana Politics: బీసీ రిజర్వేషన్ల అంశం బీఆర్ఎస్ వర్సెస్ ఎమ్మెల్సే కల్వకుంట్ల కవితగా మారిందనే చర్చ గులాబీ పార్టీలోనే నడుస్తోందట. రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వ నిర్ణయాన్ని కవిత స్వాగతించారు. బీఆర్ఎస్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించింది. దాంతో పార్టీలో కేటీఆర్ వర్సెస్ కవిత అనే చర్చ మరోసారి తెరపైకి రావడం గులాబీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ ప్రకటనపై సానుకూలంగా స్పందించిన కవిత
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో బీఆర్ఎస్ ఆ పార్టీ ఎమ్ఎల్‌సీ కల్వకుంట్ల కవిత మధ్య వైరుద్యమైన స్పందనలు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయట. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కలిపించేందుకు ఆర్డినర్స్ జారీ చేస్తామని నిర్వహించడంపై కవిత సానుకూలంగా స్పందించగా.. బీఆర్ఎస్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించటం హార్ట్ టాపిక్‌గా మారింది.
బీఆర్ఎస్‌లో కొనసాగుతున్న ఆధిపత్యపోరు
బీఆర్ఎస్‌లో ఆధిపత్యపోరు కొనసాగుతుందని ఇటీవల జరుగుతున్న పరిణామాలు పట్టి చూస్తే స్పష్టమవుతుంది. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన కవిత కొన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న కవిత తర్వాత స్పీడ్ పెంచారు. జాగృతిని యాక్టివ్ చేసి పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా తొలుత బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రధానంగా లేవనెత్తారు కవిత. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌తో రైలు రోకోకు పిలుపునిచ్చారు.
పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించిన ప్రభుత్వం
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో సభ నిర్వహించి బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. జనభామ ప్రతిపాధికనా రిజర్వేషన్లు పెంచుతామని చెప్పింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పింది. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42శాతం కోటా అమలు దిశగా ముందడుగు వేసింది. స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేస్తున్నామని 2018 నాటి పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించింది. అయితే ఇది ముమ్మాటికీ జాగృతి విజయం అంటూ ఆ సంస్థ అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్ఎల్‌సీ కవిత సంభురాలు చేసుకున్నారు. రైల్ రోకో నిర్వహిస్తామని తాము ప్రకటించడంతో దిగివచ్చిన ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు అంగీకరించిందని చెప్పుకొచ్చారు.
ప్రభుత్వ తీరును తప్పుపడుతున్న బీఆర్ఎస్ బీసీ నేతలు
అయితే కవిత స్పందించిన వెంటనే బీఆర్ఎస్ బీసీ నేతలు ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఆర్డినర్స్ పేరుతో మంత్రివర్గం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శిస్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కేటీఆర్‌తో మాట్లాడి తమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఓ వైపు కవిత ఆధ్వర్యంలోని జాగృతి సంభరాలు చేసుకుంటుంటే.. ఇంకో వైపు బీఆర్‌ఎస్ నేతలు అభ్యంతరం చేబుతుండటంతో మళ్లి అన్నాచెల్లి వార్ మొదలైంది అని చర్చ పార్టీలో జరుగుతుందట. ఇద్దరు చెరో దారి అన్నట్టుగా వ్యవహిరిస్తున్నారు అని తెగ మాట్లాడుకున్నారట బీఆర్ఎస్ నేతలు..
Also Read: బాబు భరోసా ఏపీలో మరో గిన్నిస్ రికార్డు
కవిత వ్యాఖ్యల తర్వాత బీఆర్ఎస్ నేతలు స్పందించిన తీరు చూస్తే పార్టీలో కన్‌ప్యూజన్ నెలకొంది అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తోంది. పార్టీలో జరుగుతున్న ఆధిపత్య పోరు క్యాడర్‌ను కన్‌ప్యూజ్ చేసి నేట్టేస్తున్నారంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే పరిస్థితి పార్టీ నేతల్లో నెలకొందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ అన్నాక ఇలాంటివి సహజం అని నేతలు చెబుతున్నా.. గందరగోళ పరిస్థితి మాత్రం చక్కపెట్టడం లేదని టాక్ వినిపిస్తుంది. స్థానిక ఎన్నికలు తరుమకొస్తున్న ఈ సమయంలో ఇది మరింత సమస్యగా మారతుందన్న చర్చ పార్టీల తీవ్రమవుతుంది.