E-Paper
Advertisement

కర్ణాటకలో కాంగ్రెస్ కుర్చీ పంచాయితీ.. సీఎం సీటు కోసం కుమ్ములాటలు!

కర్ణాటకలో కాంగ్రెస్ కుర్చీ పంచాయితీ.. సీఎం సీటు కోసం కుమ్ములాటలు!
Advertisement

Karnataka: కర్ణాటకలో ఇలాంటి కుర్చీ పంచాయితీ రావడం ఇదే తొలిసారి కాదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచిన వెంటనే సీఎం ఎవరనేదానిపై మొదటి పంచాయితీ మొదలైంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ పట్టుబట్టడంతో ఢిల్లీలో హైకమాండ్ ఐదు రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరిపింది. చివరికి సిద్ధరామయ్యను సీఎంగా, డీకేను ఏకైక డిప్యూటీ సీఎంగా ప్రకటించి అప్పటికి సర్దిచెప్పారు. ఆ తర్వాత గతేడాది చివర్లో మరోసారి ఈ పంచాయితీ జరిగింది. సిద్ధరామయ్య ప్రభుత్వం రెండున్నరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో డీకే శివకుమార్ వర్గం మళ్లీ సీఎం కుర్చీ అంశాన్ని తెరపైకి తెచ్చింది. డీకే శివకుమార్ స్వయంగా రహస్య ఒప్పందం గురించి మాట్లాడటంతో వివాదం ముదిరింది. అప్పట్లో అధిష్ఠానం జోక్యం చేసుకుని ఇద్దరు నేతలతో వరుస బ్రేక్‌ఫాస్ట్ సమావేశాలు నిర్వహించి, బహిరంగ ప్రకటనలు చేయవద్దని కట్టడి చేసింది.

సేమ్ స్క్రిప్ట్. అవే భేటీలు

ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కొనసాగుతోంది ఈ పంచాయితీ. ఇప్పుడు కూడా సేమ్ స్క్రిప్ట్. అవే భేటీలు.. బ్రెస్‌ఫాస్ట్‌ మీట్‌లు.. అంతా సవ్యంగానే ఉందనేలా ఫోటోలు రిలీజ్ చేయడం జరిగింది. కానీ వీటన్నింటి వల్ల కాంగ్రెస్‌ పార్టీకి జరగాల్సిన డ్యామేజ్ మాత్రం జరుగుతూనే ఉంది. ఎందుకంటే కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి సంబంధించిన పవర్ షేరింగ్ కాంట్రవర్సీ ప్రతిసారి దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారుతుంది. భారత్‌లోని అతిపెద్ద రాష్ట్రాల్లో.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న అరుదైన రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. ఈ క్రమంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంపై అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు.. కాంగ్రెస్ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇమేజ్‌ని దెబ్బకొడుతుందనే చర్చ..!

Advertisement

ఇప్పటికే కర్ణాటకలో పరిస్థితులు బాలేవు. ఐటీ క్యాపిటల్‌గా భావించే బెంగళూరులో.. కాంగ్రెస్ హయాంలో ఐటీ సంబంధిత కార్యకలాపాలు తగ్గాయనే చర్చ జరుగుతోంది. ఈ ఎఫెక్ట్ క్రమంగా సర్కార్ మీద పడుతుంది. తర్వాత అది నేరుగా ఢిల్లీకి రిఫ్లెక్ట్ అవుతుంది. కర్ణాటక ప్రభుత్వంలో పదవుల కోసం ఈ కుమ్ములాటలు, పార్టీలో అంతర్గత పోరు, ప్రభుత్వంలో సఖ్యతో లేకపోవడం లాంటి అంశాలన్నీ.. రాష్ట్ర భవిష్యత్తుని ప్రభావితం చేస్తాయనే చర్చ ఉంది. అదే జరిగితే కాంగ్రెస్ హయాంలో కర్ణాటకలో అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. ఇక్కడ జరిగే డ్యామేజ్.. ఇండియా లెవెల్లో కాంగ్రెస్ ఇమేజ్‌ని దెబ్బకొడుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. పైగా దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు మూడే. ఈ మధ్య కూటమిలో కీలక పాత్ర పోషించి కేరళను కూడా దక్కించుకుంది. ఈ అన్ని రాష్ట్రాల్లో పెద్దది కర్ణాటకనే. అందువల్ల ఇప్పుడు తలెత్తిన సంక్షోభంలో.. అంతర్గత విభేదాలను పరిష్కరించుకోలేకపోతే.. అది పార్టీకి నష్టం చేయడం ఖాయమంటున్నారు.

Also read: స్టార్ హీరోలకే దిక్కులేదు… కిరణ్ అబ్బవరం వంద కోట్లు కొడతాడా?

పాలన ఇవ్వలేని పార్టీగా..

Advertisement

ఈ నాయకత్వ మార్పుతో మొదలైన పోరు వల్ల.. మంత్రులు, ఎమ్మెల్యేల్లో గందరగోళం నెలకొంది. ఇది.. ప్రభుత్వ పాలన, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రభావం చూపుతుంది. పరిపాలన స్థిరంగా లేదనే భావన ప్రజల్లోకి వెళితే.. అది భవిష్యత్తుల్లో కాంగ్రెస్‌కు నష్టం కలిగిస్తుంది. ప్రతిపక్ష బీజేపీకి ఈ అంతర్గత కుమ్ములాటలు ఓ బలమైన ఆయుధంగా మారాయి. స్థిరమైన పాలన ఇవ్వలేని పార్టీగా.. కాంగ్రెస్‌ని విమర్శిస్తున్నారు. మెజారిటీతో అధికారంలోకి వచ్చినా.. సిద్ధరామయ్య, డీకేఎస్ మధ్య మొదలైన ఈ పవర్ షేరింగ్ పోరుకు.. అధిష్టానం గనక వెంటనే చెక్ పెట్టకపోతే.. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌పై పెట్టుకున్న విశ్వాసం సన్నగిల్లిపోతుంది. కాంగ్రెస్ ఉంటే.. ఎప్పుడూ ఇంతేనన్న నిర్వేదం వారిలో తలెత్తే అవకాశం ఉంది.

ఇష్యూ మరింత చర్చ..

కర్ణాటకలో రాజుకున్న రాజకీయ వేడి తాలూకూ సెగ.. ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్‌ని తాకింది. ఇది అధిష్టానానికి కూడా పెద్ద తలనొప్పిగా మారింది. క్లియర్ స్టాండ్ లేకపోవడం వల్లే.. డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు నేరుగా ఢిల్లీకి వెళ్లి ఒత్తిడి చేసే పరిస్థితులొచ్చాయ్. ఇది పార్టీలో హైకమాండ్ పట్టు కోల్పోయిందనే సంకేతాన్ని పంపింది. అంతేకాదు కర్ణాటకకు చెందిన కొందరు నాయకులు.. జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న మల్లికార్జున ఖర్గే.. కర్ణాటకకు చెందిన నేతే కావడంతో.. ఇష్యూ మరింత చర్చనీయాంశమవుతోంది. అట్లాంటి రాష్ట్రంలో ఇట్లాంటి సంక్షోభం నెలకొంటే.. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ నాయకత్వంపై అనేక ప్రశ్నలు తలెత్తే చాన్స్ ఉంది. ఇలాంటి అంతర్గత విభేదాల కారణంగానే.. గతంలో వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. కర్ణాటక సంక్షోభంపై హైకమాండ్ వెంటనే ఏదో ఒకటి తేల్చకపోతే.. హస్తం పార్టీ అస్తవ్యస్తమవడం ఖాయమనే వాదన వినిపిస్తోంది.

పవర్ షేరింగ్ విషయంలో..

కర్ణాటక రాజకీయ సంక్షోభం.. కేవలం కర్ణాటక కాంగ్రెస్‌కి సంబంధించిన సమస్య కాదు. ఇండియా లెవెల్లో.. పార్టీ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశం. పవర్ షేరింగ్ విషయంలో.. అధిష్టానం తక్షణమే స్పష్టమైన, కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. పవర్ షేరింగ్ ఫార్ములా ఉందా? లేదా? అనే విషయంపై ఉన్న గందరగోళాన్ని తొలగించాలి. నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు.. ఒక బలమైన సందేశాన్ని ఇవ్వగలిగితేనే కాంగ్రెస్ తన ఇమేజ్‌ని కాపాడుకోగలదు. లేకపోతే.. అంతర్గత కలహాలతో చెదిరిపోయే పార్టీగా మరోసారి ముద్ర వేసుకొని.. ప్రత్యర్థులకు మరింత బలం చేకూరేందుకు కారణమవుతుంది.

Also Read: రణ్వీర్ సింగ్‌పై బాలీవుడ్ నిషేధం…రూ. 45 కోట్ల వివాదంలో ఊహించని షాక్!

Related News

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

డీలిమిటేషన్‌పై మోడీ సర్కార్ సరికొత్త వ్యూహం.. సౌత్ స్టేట్స్‌కు చెక్ పడినట్లేనా?

Big Stories

Advertisement
×