E-Paper
Advertisement

కేసీఆరే రావాలి… కేసీఆరే కావాలి..! మరి కేటీఆర్ ఏం కావాలి..? షాడో సీఎంగానే ఉండాల్నా..!? సీఎం అయ్యే యోగం లేదానే బాపూ..!

కేసీఆరే రావాలి… కేసీఆరే కావాలి..! మరి కేటీఆర్ ఏం కావాలి..? షాడో సీఎంగానే ఉండాల్నా..!? సీఎం అయ్యే యోగం లేదానే బాపూ..!
Advertisement

తండ్రి ఓ బంపర్‌ ఆఫర్ ఇచ్చాడు కేటీఆర్‌కు. ప్రతిపక్షం అప్పగించాడు. పార్టీ పగ్గాలిచ్చాడు. ఇక ఇదో ట్రయల్ రన్‌.. అప్రెంటిస్‌షిప్‌.. నేర్చుకో… జనం వద్ద పరపతి పెంచుకో.. అని అవకాశం ఇచ్చాడు. తను నాలుగు గోడలకు పరిమితమయ్యాడు అలవాటైన దోరణిలో.

మూడేండ్లైనా కేసీఆర్‌ ను జనం మరువలేదని కొడుకే అంటున్నాడు. ఆయన సీఎంగా వస్తాడనీ కొడుకే చెబుతున్నాడు. కానీ కొడుకును సీఎం చేయాలనే కేసీఆర్‌ ఆశ, ఆశయం మాత్రం తీరేలా కనిపించడం లేదనే విషయాన్ని కూడా కొడుకే చెబతున్నాడు పరోక్షంగా. కొడుకు కోసం బిడ్డెను దూరం చేసుకున్నారు. కవిత కూడా డిసైడ్ అయిపోయింది.. ఇక్కడుంటే అన్నకు గులాంగిరీ చేసుకుంట.. ఉండాలె.. అన్నకే పార్టీ పగ్గాలు.. రేపు రేపు అవకాశం ఉంటే.. సీఎంగానే రామన్ననే. మరి నేనెందుకు? ఆడపిల్లగా కేసీఆర్‌ కడుపులో పుట్టినందుకు ఇంతేనా నా జీవితం? అని పితృస్వామ్య వ్యవస్థపై తిరగబడి.. ఎదురుతిరిగి ఇలా సొంత పార్టీ పెట్టుకుని సీఎం క్యాండిడేట్‌నని ప్రకటించుకున్నారామె.

Advertisement

కానీ కేటీఆర్‌ మాత్రం ఇంకా తండ్రి చాటు బిడ్డెగానే ఉండిపోయాడు. జనం అతన్నిసీఎం క్యాండిడేట్‌గా గుర్తించడం లేదు. ఈయనా అలా ప్రవర్తించడం లేదు. కేటీఆర్‌ సీఎం అయితే బాగుండనే ఆశలు చిగురించేలా కూడా చేయడంలో చతికిలబడ్డాడు కేటీఆర్‌. రెండో టర్ము అధికారంలోకి రాగానే .. కేటీఆర్‌ను సీఎం చేసేద్దామని డిసైడ్ అయిపోయాడు కేసీఆర్‌. ముహూర్తాలు కూడా పెడుతూ పోయాడు తండ్రి.

సోనియా గాంధీ తన కొడుకు రాహుల్‌ విషయంలో చేసిన పొరపాటును తను ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దనేది కేసీఆర్‌ కృత నిశ్చయం. ఒక్కసారి రాహుల్‌ను ప్రధాని చేసి వదిలేస్తే చాలు.. అతను మాజీ ప్రధాని హోదాలోనైనా తరువాత రాజకీయాల్లో తనదైన శైలిని కొనసాగించేవాడనేది కేసీఆర్ అభిప్రాయం. అందుకే తను ఆ మిస్టేక్‌ చేయకుండా.. తన చేతిలో అధికారం ఉన్నప్పుడే.. పదిమంది జనం తనను నమ్మినప్పుడే.. దీపం ఉండగానే.. కేటీఆర్‌ను సీఎం చేయాలని అనుకున్నాడు.

Advertisement

ప్రజాశీర్వాద సభ పేరుతో కొడుకును జిల్లాలు తిప్పాడు. బహిరంగ సభలు పెట్టించాడు. ఒంటిచేత్తో కేటీఆర్‌ ఆ సభలను సక్సెస్‌ చేసి చూపాలి. ఇదీ టాస్క్‌. సీనియర్లు పర్యవేక్షిస్తారు. జిల్లాల లీడర్లు, ఎమ్మెల్యేలు ఖర్చులు భరిస్తారు.. ఏర్పాట్లు చేస్తారు. సభలో ప్రసంగం.. జనానికి కనెక్టయ్యేలా మాటతీరు.. తరువాత సీఎంనేనే అనే రీతిలో జనం మదిలో ఓ చిన్న సిగ్నల్‌.. ఇదీ కేటీఆర్‌ కు తండ్రి ఇచ్చిన టాస్క్‌. కానీ కేటీఆర్‌ ఫెయిల్‌ అయ్యాడు.

ముహూర్తాలు పెడుతున్నాడు. క్యాన్సిల్‌ అవుతూ ఉన్నాయి. కానీ కేటీఆర్‌ను సీఎం చేయలేకపోతున్నాడు. మూడోసారి అధికారం రాగానే .. తను అలా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి.. ఆ వెంటనే కేటీఆర్‌ను సీఎం చేసేస్తే అయిపోతుందనుకున్నాడు.కానీ కాలం కలిసి రాలేదు. అధికారం ముఖం చాటేసింది. కేటీఆర్‌కు సీఎం యోగం లేదని తేల్చి చెప్పేసింది.

ఈ ప్రతికూల పరిస్థితులను కూడా కేటీఆర్‌కు అనుకూలంగా మలుచుకోవాలనుకున్నాడు కేసీఆర్‌. అందుకే బిడ్డెను బయటకు పంపేశాడు. కేటీఆర్‌కు పార్టీ పగ్గాలిచ్చాడు. ఇక నువ్వే పార్టీని నడుపు. జనం నీ వైపే చూడాలి. కేసీఆర్‌ తరువాత మా ఆశాదీపం కేటీఆరేనని వారు అనుకునేలా నువ్వు దూసుకెళ్లాల? మళ్లీ టాస్క్‌.. కానీ మూడేళ్లైంది. ఇప్పటికీ కేటీఆర్‌ను సీఎం సీఎం… అని అరిచే జనం కరువయ్యారు. కవితను మాత్రం సీఎం అంటున్నారు సభల్లో అక్కడక్కడ.

హతవిధీ.. ఏమిటీ దౌర్బాగ్యము.. ! ఈసారి అధికారం రాంగనే ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా.. వెంటనే సీఎం చేయకపోతే.. ఇక తను జన్మలో సీఎం కానేకాడని ఖరాఖండిగా చెప్పాలనుకుంటున్నాడు కేటీఆర్‌. కొడుకు చెప్పకముందే తండ్రికీ  విషయం ముందే తెలుసు. అందుకే కాలంబు రాగానే కాటేసి తీరాలె.. అని వేచి చూస్తున్నాడు. మనం కూడా వెయిట్‌ అండ్‌ సీ… మరి! అబీ నహితో ఔర్ కబీ నహీ… ఇదైతే పక్కా..!

Tags

Related News

ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ప్రధానికి ఊహించని షాక్.. గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్!

అనకాపల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో దారుణం.. అడుగు వేయాలంటే జంకుతున్న జనం!

దేశ ఎన్నికల సంఘం లొసుగులు బైటపెట్టిన రితికా చోప్రా సక్సెస్ స్టోరీ ఇదే!

కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ వీడకపోవడంపై మాట మార్చిన కేటీఆర్‌.. మీకు అవకాశం ఇవ్వడం కోసమే ఆయన రావడం లేదని యూటర్న్‌..!

అధికారాలను దూరం చేసిన చిన్న లోపాలు, పొరపాట్లు! మరి ఓటు హక్కుపై దాడి చేస్తున్నపెద్ద తప్పిదానికి మూల్యం చెల్లించక తప్పదు సర్..!

ఇండియా షైనింగ్‌- బంగారు తెలంగాణ…! ఒక్క నినాదం.. కొంపలు ముంచిన వైనం! ఆత్మవిశ్వాసం కాదది అతి విశ్వాసంగా తేల్చిన జనం..

Gen-Z యూత్‌ కోసం.. నెల్లూరు రూరల్ పాలిటిక్స్‌లో కొత్త ట్రెండ్!

Big Stories

Advertisement
×