E-Paper
Advertisement

ఖైరతాబాద్ ఉప ఎన్నికల బరిలో కవిత పార్టీ.. అభ్యర్థి ఎవరంటే?

ఖైరతాబాద్ ఉప ఎన్నికల బరిలో కవిత పార్టీ.. అభ్యర్థి ఎవరంటే?
Advertisement

Khairatabad Bypoll: ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రక్షణ సేన కూడా బరిలోకి దిగుతుందని.. పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. ఉప ఎన్నికలో తమ అభ్యర్థిని నిలబెడతామని ఆమె స్పష్టం చేశారు. ఈ ఏడాదే కొత్త పార్టీని ప్రారంభించిన ఆమె.. ఇప్పుడు సొంత జెండా, అజెండాతో.. రాజకీయాల్లో తన మార్క్ వేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో.. ఖైరతాబాద్ బైపోల్‌ని రాజకీయంగా వాడుకోవాలని డిసైడ్ అయ్యారు.

ఫామ్‌హౌస్‌ పేరిట డ్రామాలు..

మరోవైపు.. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపైనా కవిత విరుచుకుపడ్డారు. ఇది కేవలం మాటల ప్రభుత్వమని, చేతలు శూన్యమని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే.. కేటీఆర్‌ ఫామ్‌హౌస్‌ పేరిట డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అంతా లోపాయికారీ ఒప్పందాలేనని, ఫామ్‌హౌస్‌లపై చర్యలు ఉండవని చెప్పారు. ఈ విమర్శలు పక్కనబెడితే.. కవిత పార్టీ టీఆర్ఎస్.. ఖైరతాబాద్ బరిలోకి దిగుతుండటమే.. బిగ్ పొలిటికల్ డెవలప్‌మెంట్. పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో.. సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడింది. దాంతో.. ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గంలో.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కవితపై ఫోకస్..

Advertisement

ఇప్పుడు బరిలోకి కవిత పార్టీ కూడా చేరడంతో.. ఖైరతాబాద్ పాలిటిక్స్ మరింత హీటెక్కాయ్. అయితే.. టీఆర్ఎస్ నుంచి బైపోల్ బరిలో ఎవరు దిగుతారన్నది త్వరలోనే తేలిపోతుంది. ఎవరు పోటీ చేసినా.. కవిత పార్టీకి హైదరాబాద్ లాంటి ఏరియాలో ఎంత ఆదరణ దక్కుతుందనేది ఆసక్తి రేపుతోంది. సిటీ పీపుల్‌లో టీఆర్ఎస్‌కు ఎంత సపోర్ట్ ఉందనేది కూడా క్లియర్ అయిపోతుంది. ఈ ఉపఎన్నికలో గెలుపోటములని పక్కనబెడితే.. పోటీ చేస్తే తెలంగాణ రక్షణ సేనకు పొలిటికల్‌గా పాపులారిటీ దక్కుతుంది. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్‌పై ఒకేసారి విమర్శలు గుప్పిస్తున్న కవిత.. ఖైరతాబాద్ బరిలో ఎవరిని నిలబెడతారనేదే ఇప్పుడు చర్చ.

Also read: పిల్లలకు గెలవడం మాత్రమే కాదు, ఓటమిని ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పాలి

Tags

Related News

భూమి మనదే.. కానీ అమ్ముకోలేం! 22Aపై జగదీశ్ రెడ్డి కీలక కామెంట్స్

మచిలీపట్నంలో హోరెత్తిన వీఆర్ఏ జేఏసీ ధర్నా.. వారి డిమాండ్లు ఇవే!

నాకు వారి నుండి ప్రాణహాని ఉంది.. యరపతినేని శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్!

కేంద్ర ప్రభుత్వానికి బిగ్ షాక్.. సర్ వివాదంపై స్పష్టత కోరిన ఎన్డీయే మిత్రపక్షాలు!

నాగాలాండ్‌లో తీవ్ర విషాదం.. కల్తీ మద్యం తాగి 19 మంది మృతి!

రాజ్యాంగ వ్యవస్థ పై బాంబు పేల్చిన జర్నలిస్టులు.. వెలుగులోకి సంచలనాలు!

ట్రంప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. ఆ కీలక సిస్టమ్‌కు గ్రీన్ సిగ్నల్!

Big Stories

Advertisement
×