MrBeast Ramayana: ‘రామాయణం’ ..బాలీవుడ్‌లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఇపుడు ఆకాశాన్ని తాకుతున్నాయి.ఇందులో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాని దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్నసంగతి తెల్సిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో జరిగిన ఒక ఆసక్తికరమైన ఘటన ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ముంబైలో జరిగిన ‘రామాయణం’ ప్రమోషనల్ ఈవెంట్‌కు వరల్డ్ వైడ్ గా భారీ క్రేజ్ ఉన్న యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ చీఫ్ గెస్ట్ అటెండ్ అవడం విశేషం. జేమ్స్ స్టీఫెన్ డొనాల్డ్‌సన్‌గా అసలు పేరు ఉన్న మిస్టర్ బీస్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న సంగతి తెల్సిందే.ఇక తాజగా భారత్‌లో పర్యటిస్తున్న ఆయన ‘రామాయణం’ టీమ్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో ఈవెంట్ ఒక్కసారిగా మరింత స్పెషల్‌గా మారిపోయింది.
ఈ సందర్భంగా రణ్‌బీర్ కపూర్, మిస్టర్ బీస్ట్ మధ్య జరిగిన ఓ చిన్న ఇంటరాక్షన్ ఆడియన్స్ ని తెగ ఆకట్టుకుంది. భారతీయ సంప్రదాయ పద్ధతిలో రెండు చేతులు జోడించి నమస్కారం ఎలా పెట్టాలో మిస్టర్ బీస్ట్‌కు రణ్‌బీర్ స్వయంగా నేర్పించడం ఇక్కడ విశేషం. అలా రణ్ బీర్ చెప్పిన విధంగా మిస్టర్ బీస్ట్ కూడా చేతులు జోడించి నమస్కారం చేయడంతో అక్కడున్న ఆడిటోరియం దద్దరిల్లిపోయింది.
ఇంతలోనే ప్రేక్షకుల నుంచి ‘జై శ్రీరామ్’అనాలంటూ డిమాండ్ వినిపించింది.
దీంతో రణ్‌బీర్ కపూర్ మిస్టర్ బీస్ట్ చెవిలో ఏదో చెప్పగా, ఆయన వెంటనే ప్రేక్షకుల వైపు తిరిగి ‘జై శ్రీరామ్’ అంటూ అనడంతో ఆడిటోరియం మారుమ్రోగిపోయింది.ఇదే వీడియో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అంతేకాదు.. మీడియా తో మాట్లాడే సమయంలో మిస్టర్ బీస్ట్ హిందీలో ధన్యవాదాలు చెప్పడం కూడా అక్కడున్న వారిని ఆకట్టుకుంది. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా తన భారీ ఛాలెంజ్ వీడియోలు, సోషల్ ఎక్స్‌పెరిమెంట్స్, భారీ గివ్‌అవేలతో గుర్తింపు తెచ్చుకున్న మిస్టర్ బీస్ట్.. ఇలా భారతీయ సినిమా ఈవెంట్‌లో కనిపించడం సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి.
ఈ కార్యక్రమంలో రణ్‌బీర్ కపూర్‌తో పాటు సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి, లక్ష్మణుడి పాత్రలో కనిపించనున్న రవి దూబే, దర్శకుడు నితేశ్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా తదితరులు పాల్గొన్నారు. ఇదే వేదికపై తమ సంస్థ నిర్మించబోయే ‘ది యాంగ్రీ బర్డ్స్ మూవీ 3’ కోసం మిస్టర్ బీస్ట్‌తో కలిసి పనిచేయనున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా చెప్పడం ఇక్కడ మరో విశేషం.
ఇక ‘రామాయణం’ విషయానికి వస్తే..‘రామాయణం: పార్ట్ 1’ను ఈ ఏడాది దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని రెండో పార్ట్ ని వచ్చే ఏడు దీపావళికి రిలీజ్ చేస్తామని చెప్పిన సంగతి తెల్సిందే. మొత్తానికి సినిమా రిలీజ్ కి ఇంకా టైం ఉన్నప్పటికీ రణ్‌బీర్ లుక్, సాయి పల్లవి పాత్రలు,భారీగా మేకింగ్ , మిస్టర్ బీస్ట్‌తో జరిగిన ఈవెంట్ వంటి జరుపడం వంటివి ఇపుడు ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది !
also read :హిట్లర్ అనుకున్నా కానీ LKG పిల్లాడు..మోహన్ బాబు పై శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్