E-Paper
Advertisement

KK Sacrifice: KK మాస్టర్ ప్లాన్.. రాజ్యసభ వదులుకుంది అందుకేనా..?

KK Sacrifice: KK మాస్టర్ ప్లాన్.. రాజ్యసభ వదులుకుంది అందుకేనా..?
Advertisement

KK Sacrifice: పాలిటిక్స్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆ రాజ్యసభ మాజీ సభ్యుడు ఇక రాజకీయ ప్రస్థానం చాలనుకుంటున్నారంట. వయోభారంతోనో, రాజకీయాలంటే బోరు కొట్టో ? ఆ నిర్ణయం తీసుకోలేదంట. తన గారాల కూతురు కోసం ఆ పెద్దాయన రాజ్యసభ పదవి రేస్ నుండి తప్పుకున్నారంట. కూతురికి పదవి వస్తే చాలు…తనకు అదే హ్యాపీ అంటున్నారంట! ఇంతకీ ఎవరా తండ్రి…!ఎవరా కూతురు…? కూతురు కోసం ఏ పదవి రేస్ నుండి తప్పుకున్నారు?… కూతురుకు వచ్చే పదవి ఏంటి…?

కేకే త్యాగం చేశారా?

ఇటీవలే జీహెచ్ఎంసీ పాలకమండలి పదవీ కాలం ముగిసిపోవడంతో మేయర్ గద్దాల విజయలక్ష్మి మాజీగా మారారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న ఆమె ఎలాంటి పోస్టులో కానీ పవర్‌లో కానీ లేరు. దాంతో ఆ మహిళ నేత తండ్రి రాజ్యసభ సభ్యుడు కేకే ఆమె కోసం రాజ్యసభ రేస్ నుండి తప్పుకున్నారట. తనకు ప్రస్తుతం ఎలాంటి పదవిపై ఆసక్తి లేదని… రాజకీయాల్లో తనకు మంచి అవకాశలు వచ్చాయని.. ఇక ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని… రాజ్యసభ రేసులో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఒక ప్రకటన కూడా చేశారు.

కాంగ్రెస్‌లో కొత్త సమీకరణాలు

Advertisement

అయితే సీనియర్ పొలిటీషియన్ అయిన కె.కేశవరావు అలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక అనేక కారణాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాల్ కార్పొరేషన్ పదవి కాలం ముగియడంతో ఆయన గారాలపట్టి గద్వాల విజయలక్ష్మి మాజీ మేయర్ అయ్యారు. ఇక మొన్నటి వరకు మహిళ కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉన్న నేరెళ్ల శారద పదవి కాలం కూడా ముగిసింది. దీంతో మహిళ కమిషన్ చైర్‌పర్సన్ పదవి ఖాళీగా ఉంది. ఆ పదవి కోసం కాంగ్రెస్‌లో గట్టిపోటీనే కనిపిస్తోంది. అయితే ఆ రేసులో నేరెళ్ల శారద ఉన్నట్లు కనిపించడం లేదనే వాదన పార్టీ వర్గాలో వినిపిస్తోంది. ఈ సారి నేరెళ్ల శారద మహిళా కమిషన్ పోస్ట్ కాకుండా రాజకీయంగా పదవి ఆశిస్తున్నారంట.

మహిళా నేతల టార్గెట్ ఒక్కటే

దాంతోతో మహిళ కమిషన్ పోస్టుకి కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ నెలకొంది. నిన్న మొన్నటి వరకు గద్వాల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన సరిత తిరుపతయ్య పేరు వినిపించింది. కానీ సరిత తిరుపతయ్య సైతం రాజకీయ పదవి పైనే ఇంట్రెస్ట్‌గా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సునీత రావు పార్టీ పదవి కాకుండా, ప్రభుత్వం పరంగా పోస్ట్ ఆశిస్తున్నారంట. మహిళ కమిషన్ పోస్ట్ పైన సునీతరావు ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు పార్టీ వర్గాలో చర్చ నడుస్తోంది. అలాగే కేసీఆర్ అన్న బిడ్డ రమ్య రావు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లోనే ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన్నపాటి నుండి ప్రభుత్వంలో కార్పొరేషన్ పదవి ఆశిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు మహిళ కమిషన్ పోస్ట్ ఖాళీ అవడం తో రమ్య రావు కూడా ఆ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కేకే ప్రయత్నాలు ఫలిస్తాయా?

Advertisement

ఐతే గద్వాల విజయలక్ష్మి కోసం తండ్రి కేకే చేస్తున్న ప్రయత్నలే సక్సెస్ అయ్యేలా ఉన్నాయంటున్నారు. పార్టీ సైతం మాజీ మేయర్‌కే మహిళ కమిషన్ పోస్ట్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేకే రాజ్యసభ పదవికి, బీఆర్ఎస్ కి రాజీనామా చేసి తనకు రాజకీయ జీవితం ప్రసాదించిన హస్తం గూటికి తిరిగివచ్చారు. అలాగే బీఆర్ఎస్ నుంచి గ్రేటర్ మేయర్‌గా కొనసాగిన విజయలక్ష్మి తండ్రి బాటలో ప్రభుత్వం వైపుకే వచ్చేశారు. ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇచ్చేశారు. ఇలా తండ్రి -కుమార్తె ఇద్దరు బీఆర్ఎస్‌ను కాదని పదవి వదులుకొని ఒక్కరు.. పదవిలో ఉండి ఒక్కరు కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆక్రమంలో ఇప్పుడు గద్వాల విజయలక్ష్మి మహిళ కమిషన్ పదవిపై చాలా ఆశలు పెట్టుకున్నారంట.

కూతురు భవిష్యత్తు కోసం కేకే త్యాగమా?

మొత్తానికి రాజకీయాల్లో సీనియర్ నాయకుడు… తన రాజకీయం అనుభవం తో కూతురు భవిష్యత్తు గురించి ఆలోచన చేసి, ముందస్తుగానే రాజ్యసభ రేసు నుండి తప్పుకొని, మహిళా కమిషన్ పదవి రేసులో కూతురిని ముందు వరసలో ఉంచారన్న టాక్ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. చూడాలి మరి కేకే త్యాగం ఫలిస్తుందో? లేదో? .. ఎందుకంటే కాంగ్రెస్‌లో ఎపుడు ఏదైనా జరుగుంది కదా.

Story by: Apparao, Big Tv

Related News

QR కోడ్‌లో మూడు బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా ?

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

ఒక్కో పార్టీకి రెండేసి సార్లు అధికారం.. ఇది ధీమానా, జోస్యమా? చరిత్ర ఇదేననే మైండ్ గేమా!?

సీసీటీవీ ఫుటేజ్ భయమేనా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం వెనుక అసలు నిజాలు!

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

రేవంత్ రెడ్డి సీక్రెట్ స్కెచ్.. దారికి రాకుంటే టికెట్ కట్! హస్తం పార్టీలో మొదలైన బిగ్ యాక్షన్ ప్లాన్

Big Stories

Advertisement
×