E-Paper
Advertisement

కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ వీడకపోవడంపై మాట మార్చిన కేటీఆర్‌.. మీకు అవకాశం ఇవ్వడం కోసమే ఆయన రావడం లేదని యూటర్న్‌..!

కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ వీడకపోవడంపై మాట మార్చిన కేటీఆర్‌.. మీకు అవకాశం ఇవ్వడం కోసమే ఆయన రావడం లేదని యూటర్న్‌..!
Advertisement

కేటీఆర్‌ స్వరం మారింది. ఫామ్‌హౌజ్‌ నుంచి కేసీఆర్‌ బయటకు రావడం లేదెందుకని అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాడికి అంతే దూకుడుగా ఎదురుదాడి చేస్తూ వస్తున్నాడు కేటీఆర్‌. మీకోసం ఆయన రావాలా? మేం సరిపోతాం.. మమ్మల్ని తట్టుకోండి ముందు.. అని హరీశ్‌ రావును, తనను ఉద్దేశించి రేవంత్‌పై ఎదురు మాటల దాడికి దిగుతూ వస్తున్నాడు కేటీఆర్‌.

ఆయన మాట్లాడిన ప్రతిసారి .. ఇప్పట్లో కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ విడిచి రాడనే సంకేతమే ఇస్తూ వస్తున్నాడు. సమయం వచ్చినప్పుడు ఆయనే వస్తాడని కూడా కౌంటర్‌ ఇస్తున్నాడు. అయితే, ఇవాళ కేటీఆర్‌ .. తెలంగాణ భవన్‌లో మాట్లాడిన మాటలు కొంచెం తీరు మార్చుకున్నట్టుగా ఉన్నాయి. మూడేండ్లయినా కేసీఆర్‌ బయటకు రావడం లేదనే అంశం.. జనాల్లో తీవ్రంగా చర్చకు వస్తుందనే విషయాన్ని బహుశా కేటీఆర్‌ పరిగణలోకి తీసుకుని ఉంటాడు. అందుకే ప్రత్యేకించి ఈ అంశంలో పార్టీకి డ్యామేజీ కావొద్దనే విధంగానే ఆయన కామెంట్స్‌ చేసినట్టుగా కనిపిస్తోంది.

Advertisement

కేసీఆర్ బయటకు రాకపోవడానికి కారణం.. ప్రభుత్వానికి ఆటంకంగా మారొద్దనేనంటున్నాడు కేటీఆర్‌. ప్రజలు తీర్పిచ్చారు.. అందుకే వారికి అవకాశం ఇద్దాం.. ఏం చేస్తారో చూద్దాం.. కాళ్లలో కట్టె పెట్టినట్టుగా చేయొద్దనేది తన ఉద్దేశ్యంగా చెప్పుకొచ్చాడు. అందుకే ఆయన బయటకు రావడం లేదని చెబుతూనే.. ఆయనకు ఎప్పుడు రావాలో తెలుసు.. మీకు ఇంకా టైం ఇస్తున్నాడని కేటీఆర్‌ చెప్పడం… ఇప్పట్లో ఇక కేసీఆర్ ఫామ్‌హౌజ్‌ వదలి బయటకు వచ్చే పరిస్థితి లేదనే సంకేతమే ఇచ్చినట్టుగా కనిపించింది.

ప్రజలకు ఆన్సర్‌ ఇవ్వాలి కాబట్టి.. నిన్నటి వినాయక నిమజ్జనం సందర్భంగా యువతలో కేసీఆర్‌ రావాలనే కోరిక ఎంత బలంగా ఉందో ఉదాహరణగా తీసుకున్నాడు. ఆయన బయటకు రాకున్నా.. ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారని కూడా చెప్పుకొచ్చాడు కేటీఆర్. కేటీఆర్‌ మాటలను బట్టి కేసీఆర్‌ ఇటు ప్రజల వద్దకు, అటు అసెంబ్లీకి ఇక ఇప్పట్లో రాడనే విధంగానే చెబుతూ.. అలా ఆయన చేయడం వెనుక ప్రభుత్వం మంచికోరే ఉద్దేశ్యమే ఉందని అనడం కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది.

Advertisement

కేసీఆర్‌ జోలికి రాకండి.. ఆయన బయటకు రాడు.. మేము ప్రభుత్వ వైఖరికి స్పందిస్తాం.. ఆయన మాత్రం సర్కార్‌కు అడ్డుపడేలా ఏదీ చేయడు.. మీరు చేసేది చేసి చూపండి..!అని ప్రభుత్వానికి కూడా సమాధానం ఇచ్చినట్టుగా మాట్లాడాడు కేటీఆర్‌. మళ్లీ అదే మీటింగులో ఇకపై కేసీఆర్‌ను దూరం చేసుకునే పనిని చేయొద్దని ప్రజలకు హితవు పలికాడు తన సహజ శైలిలో.

ప్రజలు చేసిన ఈ తప్పుకు ఐదేండ్లు శిక్ష అనుభవిస్తున్నారని అన్నాడు. ఇంకోసారి ఆదమరవకండి.. బాధపడకండనే ఉచితోపదేశం కూడా చేశాడు కేటీఆర్‌.

Tags

Related News

అధికారాలను దూరం చేసిన చిన్న లోపాలు, పొరపాట్లు! మరి ఓటు హక్కుపై దాడి చేస్తున్నపెద్ద తప్పిదానికి మూల్యం చెల్లించక తప్పదు సర్..!

ఇండియా షైనింగ్‌- బంగారు తెలంగాణ…! ఒక్క నినాదం.. కొంపలు ముంచిన వైనం! ఆత్మవిశ్వాసం కాదది అతి విశ్వాసంగా తేల్చిన జనం..

Gen-Z యూత్‌ కోసం.. నెల్లూరు రూరల్ పాలిటిక్స్‌లో కొత్త ట్రెండ్!

కృష్ణా జిల్లాలో ఆర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. దంచికొడుతున్న వర్షాలు!

పోక్సో కేసులో కోర్టు కీలక తీర్పు.. ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రాన అరెస్ట్ చెల్లదు

అక్టోబర్ 2న నో యూపీఐ డే.. దేశవ్యాప్తంగా వ్యాపారుల వినూత్న నిరసన!

నిజామాబాద్ మున్సిపల్ ఆఫీస్‌లో లంచాల దందా కలకలం

Big Stories

Advertisement
×