CV Anand: సాధారణంగా ఎవరైనా సరే వయసు పెరిగే కొద్దీ మరింత ఆరోగ్యంగా, యాక్టివ్ గా ఉండాలని కోరుకుంటారు. నిజానికి వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో జరిగే మార్పుల కారణంగా మునుపటి హుషారు లేకపోవడం, లేనిపోని అనారోగ్య సమస్యలు, చిన్న పనులకు కూడా ఇతరుల మీద ఆధారపడడం లాంటివి చేస్తూ ఉంటాం. ఇకపై అలాంటి వాటికి చెక్ పెడుతూ డీజీపీ సీవీ ఆనంద్ చెప్పిన హెల్త్ సీక్రెట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..
క్రీడల సమయంలో తగిలే గాయాలు, క్యాన్సర్ చికిత్సలో ఎదురయ్యే నొప్పి, ప్రమాదాల అనంతరం కలిగే శారీరక ఇబ్బందులకు సరైన చికిత్స, నొప్పి నిర్వహణ ఎంతో ముఖ్యమని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంతో పాటు గాయాలకు ప్రత్యేక చికిత్స అందిస్తే.. వయసు పెరిగినా చురుకుగా ఉండొచ్చని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ లోని నంది హిల్స్ లోని ‘త్రైవ్ పెయిన్ క్లినిక్ వెల్నెస్ అండ్ మోర్’ ను సీవీ ఆనంద్, ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా.. డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. “క్రీడలు, కీమోథెరపీ , ప్రమాదాల అనంతరం వచ్చే నొప్పులకు తగిన సమయంలో చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. గాయాలను నిర్లక్ష్యం చేయకుండా ప్రత్యేక వైద్య సేవలు పొందితే శరీరం ఎక్కువ కాలం సహకరిస్తుంది. 60 ఏళ్ల వయసులో కూడా చురుకుగా ఉండేందుకు ఆరోగ్యం పై చిన్ననాటి నుంచే శ్రద్ధ పెట్టాలి “అంటూ ఆయన సూచించారు.. అలాగే క్లినిక్ నిర్వహకులకు అభినందనలు కూడా తెలిపారు.
‘త్రైవ్ పెయిన్ క్లినిక్ ను పెయిన్ మేనేజ్మెంట్ నిపుణుడు డాక్టర్ ధీరజ్ కుమార్, డాక్టర్ అపరాజిత రేమల్ల, డాక్టర్ స్ఫూర్తి మల్లంపాటి, డాక్టర్ అనహితారెడ్డి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..” నొప్పి నిర్వహణతో పాటు ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్ , కన్జర్వేటివ్ థెరపీలు, అధునాతన పెయిన్ మేనేజ్మెంట్ విధానాలకు సంబంధించిన సేవలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకొచ్చాము” అంటూ స్పష్టం చేశారు..
ALSO READ: పెళ్లి కావాలి, పిల్లలు వద్దు.. గర్భసంచి అవసరం లేదు: స్నిగ్ధ!
వయసు పెరిగినా శరీరం చురుకుగా, ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజు వారి జీవన విధానంలో వెల్నెస్, సమతుల ఆహారం, సరైన డైట్, ఫిజియోథెరపీ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి అని వైద్యులు సూచించారు. నొప్పిని భరించడం కంటే దానికి సరైన కారణాన్ని గుర్తించి, సరైన సమయంలో చికిత్స పొందడం అవసరమని ఆయన స్పష్టం చేశారు.మీరు కూడా 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మరింత ఆక్టివ్ గా, ఆరోగ్యంగా ఉండాలి అంటే.. ఈ చిన్న చిన్న టిప్స్ పాటించాల్సిందే. ఏది ఏమైనా ఆరోగ్యంగా ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని ఇప్పటికే ఎంతోమంది నిరూపిస్తున్నారు కూడా..