E-Paper
Advertisement

భార్య బిజినెస్‌లో బిజీ… ముగ్గురు పిల్లలతో తండ్రి తిప్పలు… ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామాను డోంట్ మిస్

భార్య బిజినెస్‌లో బిజీ… ముగ్గురు పిల్లలతో తండ్రి తిప్పలు… ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామాను డోంట్ మిస్
Advertisement

Family Entertainer Movie: ఇంట్లో పిల్లల బాధ్యత ఎవరికి ఎక్కువగా ఉంటుంది… భార్యకా, భర్తకా ? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం ఈజీనే. చాలామంది భార్య అనే అంటారు. కానీ భార్య తన బిజినెస్‌ లో బిజీ అయిపోయి, ముగ్గురు పిల్లల బాధ్యత మొత్తం తండ్రి మీద పడితే… ఇంటి పనులు, పిల్లల అవసరాలు, వాళ్ల అల్లరి… ఇవన్నీ ఒకేసారి ఎదురైతే పరిస్థితి ఎలా ఉంటుంది ? తండ్రిగా తన కొత్త బాధ్యతను ఎలా మేనేజ్ చేశాడన్నదే ‘ది బ్రెడ్‌ విన్నర్’ (The Breadwinner) కథ. ఇందులో కామెడీతో పాటు కుటుంబ జీవితం, తల్లిదండ్రుల బాధ్యతలు, భార్యాభర్తల మధ్య మారే సమీకరణాలను కూడా చక్కగా చూపిస్తారు. మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

నేట్ విల్కాక్స్ ఓ సాధారణ కుటుంబ జీవితాన్ని గడుపుతుంటాడు. అతని భార్య కేటీ మాత్రం ఇంట్లో పిల్లలను చూసుకునే తల్లిగానే ఉండిపోవాలని అనుకోదు. తనకంటూ ఓ వ్యాపార ఆలోచనతో ముందుకు వెళ్లాలని చూస్తుంది. ఆమె తయారు చేసిన ఓ ఇంటి ఉత్పత్తి ఊహించని విధంగా పెద్ద అవకాశాన్ని తెచ్చిపెడుతుంది. షార్క్ ట్యాంక్ లో ఆమెకు వచ్చిన డీల్‌ తో ఒక్కసారిగా ఆమె లైఫ్ ఛేంజ్ అవుతుంది. కేటీ బిజినెస్ ఒక్కసారిగా దూసుకెళ్లడంతో ఆమెకు ఎక్కువ సమయం బయటే గడపాల్సి వస్తుంది.

Advertisement

దాంతో ముగ్గురు పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత నేట్‌ పై పడుతుంది. ఇంతకాలం ఇంట్లో భార్య చూసుకునే ఎన్నో పనులు తన భుజాలపై పడినట్టు అతడికి అర్థమవుతుంది. పిల్లల స్కూల్, వాళ్ల అవసరాలు, ఇంటి పనులు… అన్నింటినీ ఒకేసారి చూసుకోవడం నేట్‌ కు కష్టంగా ఉంటుంది. ముగ్గురు పిల్లలు ముగ్గురూ ఒక్కో రకంగా ఉండటంతో తండ్రికి ప్రతి రోజు కొత్త సమస్యే. ఒకరి విషయంలో సర్ది చెప్పే ప్రయత్నం చేస్తే ఇంకొకరు కొత్త రచ్చ మొదలు పెడతారు. ఇంట్లో ఏదో ఒక వస్తువు పాడవడం, పిల్లల మధ్య గొడవలు, రొటీన్ బాధ్యతలు… ఇలా నేట్ జీవితం ఒక్కసారిగా పూర్తిగా మారిపోతుంది.

ఇంతకుముందు కుటుంబంలో తండ్రిగా తన పాత్ర ఏంటో అర్థం చేసుకున్న నేట్‌… ఇప్పుడు తండ్రిగా మాత్రమే కాకుండా ఇంటినే నడిపించే వ్యక్తిగా మారాల్సి వస్తుంది. మరోవైపు కేటీ తన వ్యాపారాన్ని నిలబెట్టుకోవడానికి పరుగులు తీస్తుంది. ఇద్దరి జీవితాల్లో వచ్చిన ఈ మార్పు వారి దాంపత్య సంబంధంపైనా ప్రభావం చూపుతుంది. మరి నేట్ చివరికి ఏం చేశాడు ? కేటీ బిజినెస్ కోసం కుటుంబాన్ని పక్కన పెట్టేసిందా ? చివరికి ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసిందా లేదా ? మరి నేట్ ఫైనల్ గా తెలుసుకున్నది ఏంటి ? అనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అంటే ?

Advertisement

నేట్ బార్గట్జ్, మాండీ మూర్, కోలిన్ జోస్ట్ తదితరులు నటించిన ‘ది బ్రెడ్‌విన్నర్’ను 2026లో కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. భారత్‌ లో Netflixలో అందుబాటులో ఉంది. ఇంగ్లిష్, హిందీ ఆడియో, తెలుగు సబ్‌టైటిల్స్ ఉన్నాయి. సెప్టెంబర్ 26న ఈ మూవీ ఓటీటీలోకి అడుగు పెట్టింది.

Read Also: బాబోయ్ ఆ గుహలోకి వెళ్తే మాయమవుతారు… గర్భిణీ ఆత్మహత్య… మైండ్ బ్లోయింగ్ సూపర్‌నేచురల్ థ్రిల్లర్

Tags

Related News

కూతురు కిడ్నాప్… పోలీసులు చేతులెత్తేయడంతో తండ్రి ఊచకోత…. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్

ఒక్క రాత్రి బేబీసిట్టింగ్ అనుకుంటే ఊహించని తలనొప్పి… ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన మూవీ

చనిపోయిన వ్యక్తి బాడీకి కాపలాగా వెళ్తే తెల్లారేసరికి శవం మాయం… క్రేజీ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్

గెలుపు కోసం జరిగే పోటీ కాస్తా ప్రాణాల మీదకు వస్తే ? బ్లడీ స్పోర్ట్స్ హారర్

మాఫియా సామ్రాజ్యాన్ని మట్టుబెడదాం అనుకుంటే మెంటల్ మాస్ షాక్… క్లాసిక్ క్రైమ్ డ్రామా

కోమా నుంచి లేచిన మహిళ జీవితంలో గత ఆరు నెలలు మిస్సింగ్… భర్త కనిపించకపోవడంతో ట్విస్ట్… షాకింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హార్వర్డ్ మేధావి వరుస బాంబు దాడులు… టెడ్ కాజిన్స్కీ వేట వెనుకున్న అసలు కథ… షాకింగ్ క్రైమ్ డ్రామా

Big Stories

Advertisement
×