E-Paper
Advertisement

ఆస్తులు పెంచుకోలే.. ప్రజల మనసుల్లో అంతస్తులు కట్టుకున్నారు! ఆ ముగ్గురి కామ్రేడ్‌ల నిస్వార్థ ప్రజాసేవ ప్రస్థానం..!

ఆస్తులు పెంచుకోలే.. ప్రజల మనసుల్లో అంతస్తులు కట్టుకున్నారు! ఆ ముగ్గురి కామ్రేడ్‌ల నిస్వార్థ ప్రజాసేవ ప్రస్థానం..!
Advertisement

ఇప్పుడంతా ఫామ్‌హౌజ్‌ల గోల.. అక్రమాస్తులు కూడగట్టుకున్నారనే గగ్గోలు. తెలంగాణ రాజకీయాలు ఫాహ్‌హౌజ్‌ల ప్రహారీల చుట్టూ తిరుగుతున్నాయి. ప్రతిపక్షం ఎంత మేర ఆస్తులు కూడబెట్టాయో లెక్కగట్టే పనిలో అధికారులతో సమానంగా అధికార పార్టీ నేతలు బస్సులేసుకుని మరీ బయలుదేరారు.

వీరు పోతే వాళ్లు.. వాళ్లు పోతే వీళ్లు.. అక్రమార్జన ఇక్కడ కామన్‌ పాయింటే. కానీ ఇక్కడ పదేళ్ల పాటు పాలించిన నేతల భూ సంపాదనను మూడేళ్ల తరువాత బయటపెట్టే పనిని పెట్టుకుని, ఇదే ప్రథమ కర్తవ్యంగా సీరియస్‌గా బస్సుయాత్రలతో చకర్లు కొడుతోంది అధికార పార్టీ. అంటే ఇక్కడ అక్రమంగా భూములు లాక్కున్నారనే కోణం కంటే.. ఇన్ని ఎకరాల భూములెలా వచ్చాయి? అనే అంశాన్నే జనాలకు బాగా దగ్గరగా తీసుకుపోవాలని కాంగ్రెస్ సర్కార్‌ భావిస్తోంది.

Advertisement

కాంగ్రెస్‌ కూడా ఓ పదేళ్లు పాలిస్తే.. ఆ ఎమ్మెల్యేలు కూడా కూడబెట్టరనేది కాదు ఇక్కడ ఇష్యూ. ఫామ్‌హౌజ్‌లైతే కట్టుకునే సాహసం చేయరు. ఎందుకంటే.. ఫామ్‌హౌజ్‌పేరెత్తితేనే అదో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డా, అక్రమంగా భూములు లాక్కుని చట్ట విరుద్దంగా నిర్మించుకున్న భవనం..అనే నిర్వచనాన్ని ఇచ్చింది రేవంత్‌ సర్కార్‌.

ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు.. కోట్లు కూడబెట్టుకునే ఈ కాలంలో.. ఐదు సార్లు, నాలుగు సార్లు, మూడు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన ఈ ముగ్గురు కమ్యూనిస్టు ఎమ్మెల్యేల ప్రస్థానం ఇప్పుడు సందోర్బోచితంగా తోస్తుంది. ఈ ముగ్గురి గురించి చర్చ కూడా నడుస్తున్నది.

Advertisement

సూర్యపేట నుంచి సీపీఎం పార్టీ తరుపున (1952 నుంచి 1972 వరకు) నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినా ఉప్పల మల్సూర్‌ కుటుంబానికి ఓ ఇల్లు కూడా లేదు. ఇటీవల ఆయన కుటుంబం ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకుంటే.. ఓ రెండు ఇళ్లను మంజూరు చేసింది సర్కార్‌. తనకు ఉన్న 3 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వ పాఠశాల కోసం దానం చేశారు.

గుమ్మడి నర్సయ్య గురించి తెలియని వారుండరు. ఈయన రాజకీయ జీవితంపై ఓ సినిమానే రూపొందుతున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు ఎస్టీ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారీయన. సీపీఐ ఎంఎల్‌ (న్యూడెమోక్రసీ) పార్టీ తరుపున ఆయన పోటీ చేశారు. ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా పిల్లలకు కోట్ల ఆస్తులు ఇవ్వలేదు. ఆయన కుమార్తె గుమ్మడి అనురాధ కష్టపడి చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్‌డీ పూర్తి చేసి, ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరవడానికి కూడా ఖమ్మం నుండి సామాన్యులతో కలిసి ఆర్టీసీ బస్సులోనే వచ్చేవారు. అసెంబ్లీ గేటు దగ్గర సెక్యూరిటీ సిబ్బంది ఈయనను గుర్తుపట్టక ఆపిన సందర్భాలు కూడా చాలనే ఉన్నాయి. 2018 ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఆయన మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు.

సున్నం రాజయ్యదీ ఇదే ప్రస్థానం. ఆయన భద్రాచలం నియోజకవర్గం నుంచి మూడు సార్లు ( 1999, 2004, 2014) ఎమ్మెల్యేగా గెలిచారు. కాలినడకన, లేదా బస్సుల్లో ప్రయాణం చేయడం, నిజాయితీగా ప్రజాసేవలో మమేకమయ్యారే తప్ప, ఏనాడూ స్వార్థ ప్రయోజనాలు ఆశించలేదు. కోట్లు కూడబెట్టడం మాటటుంచి, ఉండేందుకు కూడా వీరికి సౌకర్యంగా ఉన్న ఇల్లు లేదు ఇప్పటికీ.

మల్సూర్, సున్నం రాజయ్య ఇప్పుడు లేకున్నా.. గుమ్మడి నర్సయ్య ఇప్పటికీ నిరంతర ప్రజా పోరాటాల్లో లీనమై ఉన్నారు. ఈ ముగ్గురు చేసిన నిజాయితీతో కూడిన ప్రజాసేవను జనం మరిచిపోలేదు. ఒక్కసారి గెలిచే కళంకితులుగా ముద్రపడుతున్న ఎమ్మెల్యేలను చూసిన జనానికి.. ఈ నిష్కళంకుల జీవితాలు ఆదర్శప్రాయంగా నిలిచాయి. ఎప్పటికీ సజీవంగా చర్చలో ఉంటాయి. ఆ ప్రజల మనస్సుల్లో వీరు నిర్మించుకున్న అంతస్తులు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అవి ఎప్పటికీ అలాగే సుస్థిరంగా ఉంటాయంటున్నారు  జనం.

Tags

Related News

పిఠాపురం జనసేన కమిటీపై పవన్ ఫైర్.. అన్నీ చక్కదిద్దుతానని హెచ్చరిక!

దసరా పండుగ కంటే ముందే.. కాంగ్రెస్ నాయకులకు గుడ్‌న్యూస్..?

చిలకపచ్చ రంగు.. ఎర్రటి బార్డర్.. ఈసారి బతుకమ్మ చీరల లుక్ ఇదే!

కేసీఆర్ ఫామ్ హౌస్ భూములపై సీఎం రేవంత్ రహస్య సర్వే.. ఇక నెక్ట్స్ ప్లాన్ అదేనా..?

నమ్మి గెలిపిస్తే.. ముఖం చాటేశాడు! సిరిసిల్లలో ఇప్పటి వరకు 15 సార్లు మాత్రమే పర్యటించిన కేటీఆర్‌..!

ఖైరతాబాద్‌లో హీటెక్కిన పాలిటిక్స్.. బీజేపీ టికెట్ కోసం ముమ్మర కసరత్తు!

వరి వద్దు.. ఈ సర్కార్‌ నోటి వెంటా ఇప్పుడిక అదే మాట..! కరువు ప్రభావం.. సాగునీటికి కటకట..!

Big Stories

Advertisement
×