OTT Movie : సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలలో ఈ సినిమా వేరు. ఇప్పటిదాకా మనం ఈ జానర్లో వచ్చిన ఎన్నో సినిమాలను చూసి ఉంటాము. కానీ ఇది మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్పాలి. ఈ క్రేజీ సినిమా పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే…
కథలోకి వెళ్తే…
సినిమా కోకిల బ్రూడ్ పారాసిటిజం సీన్ తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కోకిల పిల్ల ఇతర పక్షుల గుడ్లను గూడు నుండి తోసేసి, ఆ గూడు తల్లిదండ్రుల దృష్టిని తనవైపుకు తిప్పుకుంటుంది. ఈ సీన్ ఎందుకు చూపించారు అనేది మూవీని చూస్తే అర్థం అవుతుంది. కథ గెమ్మా (ఇమోజెన్ పూట్స్) అనే కిండర్‌గార్టెన్ టీచర్, టామ్ (జెస్సీ ఐసెన్‌బర్గ్) అనే గార్డనర్ కపుల్ చుట్టూ తిరుగుతుంది. ఈ జంట కలిసి తమ కోసం ఒక కొత్త ఇంటిని కొనాలని చూస్తారు. అందులో భాగంగా ఒక వింత రియల్ ఎస్టేట్ ఏజెంట్ మార్టిన్ (జోనాథన్ ఆరిస్)ని కలుస్తారు. మార్టిన్ వీరిని “యాండర్” అనే సబర్బన్ డెవలప్‌మెంట్‌కు తీసుకెళ్తాడు. అక్కడ ఇళ్ళు అన్ని ఒకేలా ఉంటాయి. ఆకుపచ్చ రంగు గోడలతో వింతగా ఉంటాయి.
హౌస్ నంబర్ 9ని చూపించిన తర్వాత, మార్టిన్ ఆకస్మికంగా మిస్ అవుతాడు. తరువాత గెమ్మా కూడా… ఇక వీళ్ళిద్దరూ కలిసి ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎన్ని రోడ్లు తిరిగినా, వాళ్ళు తిరిగీ తిరిగీ హౌస్ నంబర్ 9కే తిరిగి వస్తారు. ఇక ఎట్టకేలకు తమ కార్లో పెట్రోల్ అయిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోతారు. ఆ ఇంట్లోనే ట్రాప్ అవుతారు. ఇక ఆ తరువాత ఒక కార్డ్‌బోర్డ్ బాక్స్‌లో ఒక శిశువు (ఒక అజ్ఞాత జాతికి చెందినవాడు) వస్తాడు. దానితో ఒక నోట్ ఉంటుంది.
“పిల్లవాడిని పెంచండి, మీరు విడుదల అవుతారు” అనేది ఆ నోట్ లో ఉండే సారాంశం. ఈ పరిస్థితి వారిని ఒక వివారియం (పరిశీలన కోసం జంతువులను ఉంచే కృత్రిమ వాతావరణం)లో చిక్కుకున్న లాబ్ రాట్స్‌లా చేస్తుంది. ఈ జంట యాండర్‌లో చిక్కుకుని, కృత్రిమ ఆహారం (రుచిలేని, వాక్యూమ్-సీల్డ్)తో జీవిస్తారు. అక్కడ ఆకాశం, మేఘాలు, పరిసరాలు అన్నీ అసహజంగా ఒకేలా ఉంటాయి. వాళ్ళకు దొరికిన అబ్బాయి “ది బాయ్” అసాధారణంగా పెరుగుతాడు. కొన్ని నెలల్లో శిశువు నుండి 7 ఏళ్ల బాలుడిగా, ఆపై యువకుడిగా మారతాడు. ఆ అబ్బాయిని గెమ్మా తల్లిలా చూసుకుంటుంది. కానీ హీరో మాత్రం వాడిని ద్వేషిస్తాడు. ఆ ఇంటి నుంచి తప్పించుకోవడానికి ఇంటి ముందు గడ్డిని తవ్వడం మొదలుపెడతాడు. దీనివల్ల అతని ఆరోగ్యాన్ని క్షీణిస్తుంది.
టామ్ అలా తవ్వడం వల్ల ఓ శవం బయటపడుతుంది. అంటే ఇది యాండర్‌లో గతంలో చిక్కుకున్న వ్యక్తిదయ్యి ఉంటుంది. అతను తవ్వడం వల్ల అనారోగ్యానికి గురై, చివరికి చనిపోతాడు. గెమ్మా ‘ది బాయ్’ గురించి నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఒక సన్నివేశంలో అతను ఒక విచిత్రమైన కప్ప-లాంటి జీవిగా మారతాడు. సైడ్‌వాక్ కిందకి అదృశ్యమవుతాడు. ఆ తరువాత ఏమైంది? హీరోయిన్ అక్కడి నుంచి బయట పడిందా? అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.
ఏ ఓటీటీలో ఉందంటే?
ఈ సినిమా పేరు ‘Vivarium’. 2019లో రిలీజ్ అయిన ఈ మూవీకి లోర్కాన్ ఫిన్నెగన్ దర్శకత్వం వహించారు. ఈ సైన్స్ ఫిక్షన్, సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ సినిమాలో జెస్సీ ఐసెన్‌బర్గ్, ఇమోజెన్ పూట్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ మూవీ ZEE5, Amazon Prime Video, Manorama MAX, Airtel Xstream Play లో స్ట్రీమింగ్ అవుతోంది.