E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Lucknow Fire: లక్నో అగ్నిప్రమాదంలో ఘోరం.. కరెంట్ పోగానే బిల్డింగ్‌లో జరిగింది ఇదే..!

Lucknow Fire: లక్నో అగ్నిప్రమాదంలో ఘోరం.. కరెంట్ పోగానే బిల్డింగ్‌లో జరిగింది ఇదే..!
Advertisement

Lucknow Fire: లక్నో అగ్నిప్రమాదానికి కారణాలేంటి? గతంలోనే ఆ బిల్డింగ్ కూల్చివేత ఆదేశాలిచ్చిన ఎందుకు కూల్చలేదు? బయో మెట్రిక్‌ వల్లే డోర్‌ క్లోజ్‌ అయింది. ప్రమాద తీవ్రత పెరగడానికి కారణం ఇదేనా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు. ప్రాధమిక విచారణలో అసలేం తేలింది? ఆ డీటైల్స్ ఎలాంటివి? లక్నోలో జరిగిన ఈ ఘోర అగ్నిప్రమాదానికి పలు కారణాలున్నట్టు తేల్చారు దర్యాప్తు అధికారులు. ప్రాధమిక విచారణ ప్రకారం బిల్డింగ్ లో ఎలక్ట్రిక్ ప్యానెల్, లేదా వైరింగ్‌లో షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు అంటుకున్నట్టు ఒక అంచనా..!

గతంలోనే ఆదేశాలు జారీ..

ఇక భవన నిర్మాణంలో కనీసం ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకపోవడమూ గుర్తించారు. సరైన వెంటిలేషన్ లేక పోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు విచారణాధికారులు. గాలి వెళ్లే మార్గాలు సరిగా లేక పోవడంతో, పొగ వేగంగా లోపలే పేరుకుపోయి ఊపిరాడకుండా చేసి ఉండొచ్చని కూడా అంటున్నారు. ఈ బిల్డింగ్ కూల్చివేయమని లక్నో డెవలప్మెంట్ అథారిటీ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయినా చర్యలెందుకు తీసుకోలేదు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. సంబంధిత బిల్డర్లు- అధికారుల మధ్య లాలూచీ ఉండటం వల్లే ఈ ఆదేశాలు కేవలం కాగితాలకే పరిమితమై ఉండొచ్చని భావిస్తున్నారు.

Advertisement

Also read: రాష్ట్రపతి భవన్‌లో పండుగగా పద్మ అవార్డుల వేడుక.. పురస్కారాలు అందుకున్న విజేతలు వీరే!

కూల్చివేత నోటీసులు..

ఇదిలా ఉంటే, కొన్ని సందర్భాల్లో.. బిల్డర్లు కోర్టుల నుంచి స్టే తెచ్చుకున్నారు. దీని వల్ల కూడా బిల్డింగ్ కూల్చివేత ప్రక్రియ ఆలస్యమైనట్టుగా చెబుతున్నారు. ఇదంతా ఇలా ఉంటే.. సీల్ వేసిన, కూల్చివేత నోటీసులు ఇచ్చిన భవనాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నా అధికారులు గ్రౌండ్ లెవల్లో చెకింగులు చేయడం లేదు. ఇది కూడా అత్యంత సమస్యాత్మకమేనని తేల్చారు విచారణాధికారులు. ఇవన్నీ ఇలా ఉంటే, బయోమెట్రిక్ లాకింగ్ సిస్టమ్ కూడా, ప్రమాద తీవ్రత పెరగడానికి గల కారణాల్లో ఒకటని అంచనా వేస్తున్నారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే పవర్ సప్లై నిలిచిపోయింది. బయోమెట్రిక్ లేదా సెన్సార్ బేస్డ్ డోర్స్ పవర్ పోగానే జామ్ అయిపోయాయి. దీంతో అవి టోటల్ గా లాక్ అయిపోయాయి.

నన్ను కాపాడు నాన్నా!

Advertisement

లోపలున్న వారు ప్రాణాలు కాపాడుకోడానికి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ఈ తలుపులు తెరుచుకోలేదు. ఇక ఫింగర్ ప్రింట్స్, ఐడీ కార్డులు కూడా పని చేయక పోవడంతో లోపలే చిక్కుకుని పోయారు. ఇందులో మరింత భయంకరమైన సమస్య ఏంటంటే, ప్రమాదాలు జరిగినపుడు ఎమర్జెన్సీ డోర్లు, ఎస్కేప్ ఏరియాస్ ఉంటాయి. ఇలాంటి ఫెయిల్ సేఫ్ మెకానిజం లేక పోవడం వల్ల.. మరణాల సంఖ్య మరింత పెరిగింది. సుఖమణిసింగ్ అనే కుర్రాడు తన తండ్రికి ఫోన్ చేసి నన్ను కాపాడు నాన్నా! అంటూ తన తండ్రికి చేసిన చివరికాల్ ఇప్పుడు సంచలనంగా మారింది. అదే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండి ఉంటే, ఈ పాటికి తమ కొడుకు బతికి ఉండేవాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారతడి కుటుంబ సభ్యులు. మోడ్రన్ బిల్డింగ్స్ లో బయోమెట్రిక్ ఏర్పాటు చేసినపుడు ఫైర్ అలారమ్ తో లింక్ అయ్యి ఉండేలా ఏర్పాట్లు చేయాలి. ఇది చట్టప్రకారం ఒక విధిగా అమర్చాలి. ఇలాంటివేవీ లేక పోవడం వల్లే, లక్నో ఫైర్ యాక్సిడెంట్ తీవ్రత పెరిగినట్టుగా భావిస్తున్నారు.

Storey By: Appa rso Big Tv

Also read: ఇకపై వాట్సప్ చాట్ ఓపెన్ చేయకుండానే.. ఆన్‌లైన్ స్టేటస్ తెలుసుకోవచ్చు, ఎలాగంటే?

Related News

Vijay Udhayanidhi: సీఎం విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్.. తమిళనాడు సభలో సినిమా రేంజ్ డ్రామా..!

ACB Raids: ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి ఇళ్లపై ఏసీబీ రైడ్స్.. ఆస్తులు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

Pune Crime: పూణే బిజినెస్ మ్యాన్ హత్యకేసులో సంచలనం.. వెలుగులోకి మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు!

Land Controversy: మధ్యప్రదేశ్‌ సీఎంకు బిగుసుకున్న ఉచ్చు.. రాజీనామా చేయాలంటూ ప్రజలు డిమాండ్!

TMC Revolt: 28 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఘోర పరాభవం.. మమతకు ఊహించని దెబ్బ..!

Iran Sanctions: వాహనదారులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. కానీ..!

SpaceX Crash: ఎలాన్ మస్క్‌కు ఇన్వెస్టర్లు గట్టి షాక్.. స్పేస్‌ఎక్స్ షేర్లు పడిపోవడానికి అసలు కారణం ఇదే!

Big Stories

×