E-Paper
Advertisement

నాగార్జునసాగర్ వద్ద కృష్ణా జలాల రగడ.. అనుమతి లేదంటూ అడ్డుకున్న తెలంగాణ కానీ..?

నాగార్జునసాగర్ వద్ద కృష్ణా జలాల రగడ.. అనుమతి లేదంటూ అడ్డుకున్న తెలంగాణ కానీ..?
Advertisement

Nagarjuna Sagar: స్వేచ్ఛ బ్యూరో: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి తాగునీటి పేర నీటి విడుదల జరగడం ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదం మరింత ముదిరింది. ఏపీ రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు కృష్ణా రివర్ బోర్డు యాజమాన్య ( కేఆర్ ఎంబీ ) అనుమతులు లేకుండా కుడి కాల్వకు నీటిని విడుదల చేసి తరలిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు బుధవారం నాగార్జునసాగర్ డ్యామ్ పైకి చేరుకున్నారు. సుమారు 8 టీఎంసీలను తాగునీటి అవసరాల నిమిత్తం ఏపీకి తరలించేందుకు తమకు కేఆర్ ఎంబీ పర్మిషన్ ఇచ్చిందని ఏపీ అధికారులు వాదించగానీటి విడుదలకు ఇచ్చిన పర్మిషన్స్ చూపాలని తెలంగాణ ఇరిగేషన్ ఆఫీసర్లు నిలదీశారు. దీంతో ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారుల మధ్య పరస్పర సంభాషణ జరిగి వివాదం మరింత ముదిరింది.

మరోసారి తెరపైకి..

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేసిన అంశం మరోసారి తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ముందస్తుగా తాగునీటి అవసరాల పేరిట ఏపీ రాష్ట్ర ఇరిగేషన్ అధికారులను నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువ నుంచి 2000 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నది అడ్డుకునే ప్రయత్నం చేసిన పరిస్థితుల్లో మధ్య వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. ఏపీ రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు తమ మాట వినిపించుకోకుండా దౌర్జన్యానికి దిగడంతో ఎడమ కాలువ పరిధిలో తాగునీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేసినట్లు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. మొత్తానికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల అంశం వివాదాస్పదమైంది.

రోజులకే మళ్లీ వివాదం

Advertisement

గడచిన రెండు రోజుల క్రితం హైదరాబాద్ జల సౌధలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు లో నీటి లభ్యత, ఏపీ, తెలంగాణ ల మధ్య నీటి వాటాల పంపిణీ పై కేఆర్ ఎంబీ సభ్యులు సతీష్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఈఎన్ సీ సభ్యులతో సమీక్ష జరిగింది తెలిసిందే. ఎలినినో ప్రభావం నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నీటిలో ఇరు రాష్ట్రాలు తమ వాటా గా 50 శాతం చొప్పున తాగునీటికి వినియోగించుకోవాలన్న దిశగా చర్చించారు. కాగా ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 590 అడుగులకు 534 అడుగుల మేర నీటి నిల్వలు ఉండగా టీఎంసీలలో పరిశీలిస్తే 312 టీఎంసీలకు గాను 184 టీఎంసీల నీటి నిలువలు ఉన్నాయి.

Also read: శ్రీలంక, టీమిండియా రెండో టెస్ట్ డ్రా…బెడిసికొట్టిన గిల్ WTC ఫైన‌ల్స్ ప్లాన్స్‌

22 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో..

Advertisement

ప్రస్తుతం నాగార్జునసాగర్ కు సుమారు 22 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. అయితే ఇటీవల కేఆర్ ఎంబీ ఏర్పాటు చేసిన సమావేశంలో సాగర్ ప్రాజెక్ట్‌లో 70 శాతం నీటి వాటాను ఏపీ డిమాండ్ చేసింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టులోని నీటి వాటాల అంశంపై సెప్టెంబర్ 4న చర్చించేందుకు కెఆర్ ఎంబీ బోర్డు వాయిదా వేసింది. ఈ సమావేశానికి ముందే కెఆర్ ఎంబీ అనుమతులు లేకుండానే ఏపీ కుడికాల్వ ద్వారా నీటిని విడుదల చేయటం వివాదానికి కారణంగా తెలుస్తోంది.

నిర్వహణ బాధ్యత తెలంగాణది.. ఆధిపత్యం ఏపీ అధికారులదా…?

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను తెలంగాణ ఇరిగేషన్ అధికారులు కొనసాగిస్తుండగా కనీసం కృష్ణా రివర్ బోర్డు యాజమాన్యం పర్మిషన్స్ లేకుండానే అక్రమంగా ఏపీ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించడంపై తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేఆర్ ఎంబీ ఏ నిర్ణయం తీసుకోకుండానే ఏపీ ఇరిగేషన్ అధికారులు కావాలనే నీటిని విడుదల చేసి వివాదాన్ని పెంచుతున్నట్లు ఆరోపించారు.

పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌లో నీటి నిల్వలు నిల్..

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోగల పెద్దదేవుల పల్లి రిజర్వాయర్ లో నీటి నిలువ సామర్థ్యం 17 అడుగుల మేర కాగా ప్రస్తుతం 9.14 అడుగులకు పడిపోయినట్లు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఏపీ కుడికాలువ ద్వారా నీటిని విడుదల చేసిన నేపథ్యం మరో వైపు పెద్దదేవులపల్లి రిజర్వాయర్లో మిర్యాలగూడ మున్సిపాలిటీకి తాగునీటిని అందించే అత్యవసర విషయమై ప్రస్తుతం 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. క్రమంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి తాగునీటికి, చెరువులను నింపేందుకు ఎడమ కాలువ ద్వారా క్రమంగా 3000 క్యూసెక్కులను తరలించేందుక తెలంగాణ ఇరిగేషన్ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అయితే నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ అధికారులు నీటి విడుదల చేసిన విషయమై కేఆర్ ఎంబీ నిర్ణయం తీసుకుంటుంది వేచి చూడాల్సి ఉంది.

Also read: కాంగ్రెస్‌లో ముదిరిన పొలిటికల్ వార్.. సీఎం రేవంత్‌ను టార్గెట్ చేయడం వెనుక పక్కా ప్లాన్!

Tags

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

టెన్త్ సర్టిఫికెట్ లేకున్నా జూనియర్ లెక్చరర్.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి సంచలనాలు!

కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×