E-Paper
Advertisement

ప్యారడైజ్‌ మూవీ విమర్శకులను సుతి మెత్తగా అర్సుకున్న నాని..! మీ కోసమే ఇదంతా చేశాం.. మీ విమర్శలను ఎంజాయ్‌ చేశా..!

ప్యారడైజ్‌ మూవీ విమర్శకులను సుతి మెత్తగా అర్సుకున్న నాని..! మీ కోసమే ఇదంతా చేశాం.. మీ విమర్శలను ఎంజాయ్‌ చేశా..!
Advertisement

నాని నాచురల్ స్టారే కాదు.. ఇప్పుడున్న హీరోలతో పోల్చితే మంచి పరిణతి ఉన్న హీరో అనే చెప్పాలి. డౌన్‌ టు ఎర్త్ హీరో కాబట్టే.. తెలంగాణ మట్టి వాసనకు, ఇక్కడి నుంచి ఎదిగి వచ్చిన డైరెక్టర్‌ను అక్కున చేర్చుకుని అవకాశం ఇచ్చాడని అనుకోవచ్చు.

హీరో నోటి వెంట తెలంగాణ భాషను పలికించే చైతన్యం తెచ్చింది.. వచ్చింది మలిదశ ఉద్యమం నుంచే. తెలంగాణ రాష్ట్ర సాకారం తరువాత దీన్ని తెలుగు సినిమా ఎగబడి ఓన్‌ చేసుకునే పరిస్థితిని క్రియేట్‌ చేశాయి మారిన పరిణామాలు.

Advertisement

కేసీఆర్‌ మాట్లాడిన తీరుగా తన సొంత భాషను ఓన్‌ చేసుకున్న విధానంగా ఏ లీడర్‌ లేడనే చెప్పాలి. కేసీఆర్‌ మాట తీరును, ఆయన పంచులను, చివరకు తిట్లను కూడా పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఎంజాయ్‌ చేస్తారు. నాని కూడా ఓ సారి .. మొత్తం కేసీఆర్ మాట్లాడిన పంచులు, చలోక్తులు, చికాకులోంచి పుట్టిన నిలదీసే ప్రశ్నలను ఆయన తీరుగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. దీనిపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు.. ఎందుకంటే నాని చేసిన ఆ ప్రయత్నం కేసీఆర్‌ను కించపరిచేదిగా లేదు. దాన్ని మెచ్చుకోలుగా.. తన పంథాను అనుసరించే దోరణే కనిపించిందే తప్ప.. ఎగతాళి భావన అక్కడ వ్యక్తం కాలేదు.

ప్యారాడైజ్‌ కథనం, లోపాలు.. అవన్నీ పక్కనపెడితే.. (ఎందుకంటే ఇప్పటికే దీనిపై చర్చోపచర్చలు జరిగి ఉన్నాయి కాబట్టి) సినిమా మేకింగ్‌ బాగుందన్నారు. నాని తన మెసేజ్‌లో చివరగా చెప్పింది కూడా అదే. మీకోసమే రక్తం,చెమట చిందించామన్నారు. ఈ సినిమాలో రక్తపాతం విపరీతంగా ఉందనే నెగిటివ్‌ కామెంట్లు చాలా మంది చేశారు. దీనికి ఆయన ఇచ్చిన ఆన్సర్‌ ఈ రూపంలో ఉంది.

Advertisement

అంటే ఆ రక్తాన్ని అందులో దారలు దారలుగా దారపోసే క్రమంలో … మీరు ఆ రక్తాన్నే చూశారు.. దాని వెనుక చిందించిన మా చెమటను చూడలేదనే విధంగానే అతని కామెంట్ అర్థంగా అనిపించింది.  రక్తం, చెమట చిందించాం.. అని చెప్పడం వెనుక తమ శ్రమను గుర్తించాలనే ఆయన భావన కనిపించింది. ప్రేక్షకులను మెప్పించేందుకే ఇవన్నీ చేశామని చెప్పుకున్న నాని.. తాము చేసిన సినిమా అంతా బాగుందని కవరింగు ఇచ్చుకోలేదు. మీరు విమర్శించిన పాయింట్లు.. రివ్యూయర్ల నెగిటివ్‌ పాయింట్లు పరిగణలోకి తీసుకుంటామని హుందాగా అంగీకరించారు.

అంతే కాదు.. విమర్శకులను చెడామడా తిట్టి..ఇతర హీరోల లాగ తన వెలితితనాన్ని చాటుకోలేదు. అన్నింటినీ ఎంజాయ్‌ చేశానని చెప్పుకోవడంలో.. తన సినిమాను మీరే ఈ విధంగా సక్సెస్‌ చేశారనే తుంటరితనం అందులో కనిపించింది.

లాజిక్‌కు అందని ఎన్నో సన్నివేశాలుంటాయి.. అవన్నీ బయటకు తీసి ప్రశ్నిస్తూ కూర్చుంటే అది సినిమానే కాదు.. మనం సినిమా చూసిన ఎంజాయ్‌మెంటూ ఉండదు.. కుక్క ఎలా ఎగిరి క్యాచ్‌ పట్టింది.. కుక్క హీరోను అలా ఎలా కాపాడింది..? లాంటి లాజిక్కుల జోలికి పోవడంకంటే సినిమాలు చూడకపోవడమే బెటర్‌.

అంతగా లాజిక్కులు చూసేవారు.. ఈగ సినిమాను ఎలా ఎంజాయ్‌ చేశారు? నాని ఈగగా మారి ప్రతీకారం తీర్చుకుంటుంటే …అదేదో మనమే తీర్చుకున్నామనే సంతృప్తి ఎందుకు కలిగింది…? ఆ కథలో మనం లీనమయ్యాం కాబట్టి. అక్కడే డైరెక్టర్ ప్రతిభ కనిపిస్తుంది. అంతే.

నాని తన మెసేజ్‌లో చివరగా విన్నవించిన .. చెమట చిందించాం… అనే పదం అన్యపదేశంగా వచ్చింది కాదు.. ఆ టీమ్‌ మొత్తం పడిన శ్రమను గుర్తించండనే అభ్యర్థనే. అది గుర్తిస్తే చాలు. అంతే..!

Tags

Related News

సర్ పై కాక్రోచుల దండు దాడి..! జంతర్‌ మంతర్‌ వేదికగా ‘అంతకు మించి’ ఆందోళన..! సీఈసీ జ్ఞానేశ్వర్‌ రాజీనామా కోసం అక్టోబర్‌ నుంచి భారీ ఉద్యమానికి శ్రీకారం..

తెలంగాణ బీజేపీలో మళ్లీ సునీల్ బన్సల్.. ఈసారైనా వ్యూహం ఫలించేనా..?

తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫుల్ ఫోకస్.. త్వరలో కొత్త నియామకాలు!

మీ ఇంటిపై భారీ విద్యుత్ లైన్లు ఉన్నాయా.. అయితే మీకో గుడ్ న్యూస్!

టీపీసీసీ చీఫ్‌ సొంత జిల్లాలో గౌడ్‌ల సాంఘీక బహిష్కరణ.. వీడీసీల ఆగడాలకు చెక్‌ పడేదెలా…? దశాబ్దాలుగా ఆ రెండు నియోజకవర్గాల్లో ఇదే అరాచకం..

బైపోల్ తో ఇక అన్నీ సమకూరుతున్నట్టేగా! ఇందిరమ్మ ఇండ్లకు కొదవలేదు… అభివృద్ధి పనులకు అడ్డులేదు..!

గెలుపు గ్రాఫ్‌ తగ్గని నేత.. ప్రజాబలంలో మార్పు లేదు. బలమైన నేతగా దానం.. బరిలో ప్రత్యర్థివర్గానికి గట్టిపోటీ..!

Big Stories

Advertisement
×