E-Paper
Advertisement

యూట్యూబ్‌లో షాపింగ్ హంగామా.. ఇక వీడియోలు చూస్తూనే కొనేయొచ్చు, క్రియేటర్లకు కొత్త ఆదాయ అవకాశాలు!

యూట్యూబ్‌లో షాపింగ్ హంగామా.. ఇక వీడియోలు చూస్తూనే కొనేయొచ్చు, క్రియేటర్లకు కొత్త ఆదాయ అవకాశాలు!
Advertisement

YouTube Affiliate Program: యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ నచ్చిన వస్తువులను వెతికి కొనడం ఇక మరింత సులభం కానుంది. భారత్‌లో YouTube Shopping affiliate programmeను మరింత విస్తరిస్తూ Amazonతో పాటు AJIO, Meesho, Snapdeal, Tata CLiQ వంటి సంస్థలను కూడా తీసుకొస్తోంది. దీంతో క్రియేటర్లకు మరిన్ని ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి. ప్రేక్షకులకు కూడా వీడియో చూస్తున్నప్పుడే ప్రొడక్ట్స్‌ను తెలుసుకుని కొనుగోలు చేసే అవకాశం పెరుగుతుంది.

కొత్త షాపింగ్ భాగస్వాములు..

ఇప్పటివరకు Flipkart, Myntra, Nykaa, Purplle, Shopsy, Tira వంటి సంస్థలు YouTube Shoppingలో ఉన్నాయి. ఇప్పుడు Amazonతో పాటు మరిన్ని ప్రముఖ రిటైలర్లు చేరుతున్నారు. ఫ్యాషన్, బ్యూటీ, గ్యాడ్జెట్లు, రోజువారీ అవసరాల వస్తువులు ఇలా చాలా రకాల ప్రొడక్ట్స్‌ను క్రియేటర్లు తమ వీడియోల్లో ట్యాగ్ చేయగలరు. దీంతో ఒకే ప్లాట్‌ఫామ్‌లో ప్రేక్షకులకు ఎక్కువ ఆప్షన్స్ కనిపిస్తాయి.

షాపింగ్‌లో భారీ వృద్ధి..

Advertisement

భారత్‌లో యూట్యూబ్ షాపింగ్ కంటెంట్‌కు ఆదరణ పెరుగుతోంది. 2026 జూన్‌లో 45 కోట్లకు పైగా లాగిన్ అయిన యూజర్లు యూట్యూబ్‌లో షాపింగ్‌కు సంబంధించిన విషయాలను వెతికారని కంపెనీ తెలిపింది. షాపింగ్ వీడియోల వాచ్‌టైమ్ కూడా ఏడాదితో పోలిస్తే.. 55 శాతానికి పైగా పెరిగింది. ఇప్పటికే 1.9 కోట్లకు పైగా వీడియోల్లో affiliate products ట్యాగ్ చేశారు.

Also Read: హ్యాకర్ల టార్గెట్‌గా గూగుల్ క్రోమ్ యూజర్లు? CERT-In బిగ్ వార్నింగ్.. వెంటనే ఇలా చేయండి!

క్రియేటర్లకు పెరుగుతున్న ఆదాయం..

Advertisement

ఈ కార్యక్రమంలో చేరుతున్న క్రియేటర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. అర్హత ఉన్న భారతీయ క్రియేటర్లలో సగానికి పైగా YouTube Shopping affiliate programmeలో ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే.. పాల్గొనే క్రియేటర్లు 200 శాతం పెరిగారు. 2025 మొదటి త్రైమాసికం నుంచి 2026 మొదటి త్రైమాసికం వరకు సగటు affiliate payouts 160 శాతానికి పైగా పెరిగాయని యూట్యూబ్ చెబుతోంది.

కొత్త AI ఫీచర్లు..

ప్రేక్షకుల కోసం Ask YouTube అనే ఫీచర్ వస్తోంది. వీడియో చూస్తున్నప్పుడే ప్రొడక్ట్ గురించి ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకోవచ్చు. మొబైల్‌తో పాటు టీవీల్లో వాయిస్ ద్వారా కూడా ప్రశ్నలు అడగొచ్చు. వేర్వేరు దేశాల్లో ప్రేక్షకులు ఉన్న క్రియేటర్లకు స్థానిక భాష, కరెన్సీకి సరిపోయే షాపింగ్ లింకులు చూపించే సదుపాయం కూడా అందుతోంది.

బ్రాండ్లు, క్రియేటర్లకు కొత్త టూల్స్..

బ్రాండ్లు ఇప్పటికే మంచి స్పందన పొందిన క్రియేటర్ వీడియోలను ప్రకటనలుగా ప్రమోట్ చేసేందుకు Affiliate Partnerships Boost ఉపయోగించవచ్చు. త్వరలో Ask Studio అనే AI టూల్ ద్వారా క్రియేటర్లు బ్రాండ్ ఆఫర్లకు సమాధానాలు, పిచ్‌లు సులభంగా తయారు చేసుకోగలరు. అలాగే Creator Partnerships Boost ద్వారా వీడియో పనితీరు వివరాలను బ్రాండ్లతో పంచుకోవడం మరింత సులభం కానుంది. వచ్చే ఏడాది ప్రత్యేక affiliate campaigns కూడా అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా భారతీయ క్రియేటర్లకు కొత్త సంపాదన మార్గాలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయి. ప్రేక్షకులకు కొనుగోలు అనుభవం కూడా వేగంగా మారుతుంది. అని యూట్యూబ్ భావిస్తోంది.

Also Read: ఎండ తగిలితే చాలు ఛార్జ్ అయిపోతుంది! ఏకంగా 51 రోజుల బ్యాటరీతో Amazfit T Rex Dual Solar లాంచ్!

Tags

Related News

రూ. 1,059కే టైప్-సి ఛార్జింగ్ ఫోనా? పెద్దలకు అదిరిపోయే గిఫ్ట్.. ఐటెల్ కొత్త మోడల్ వచ్చెసింది!

హ్యాకర్ల టార్గెట్‌గా గూగుల్ క్రోమ్ యూజర్లు? CERT-In బిగ్ వార్నింగ్.. వెంటనే ఇలా చేయండి!

కేబుల్‌తో ఛార్జ్ చేయాలా? వైర్‌లెస్‌గా చేయాలా? AirPods విషయంలో ఇదిగో ఫుల్ క్లారిటీ!

44% భారీ డిస్కౌంట్‌తో వాషింగ్ మెషీన్.. ఫీచర్లు అదుర్స్!

కళ్లజోడుతోనే ఫోన్ కాల్స్, మ్యూజిక్.. భారత్‌లో మెటా కొత్త గ్లాసెస్ లాంచ్, రేటు ఎంతో తెలుసా?

తక్కువ ధరలో పెద్ద టీవీ కోసం చూస్తున్నారా? మీ కోసమే ఈ మోడల్

ఐఫోన్ డ్యూయో కంటే తక్కువ ధరకే అద్భుతమైన ఫోల్డబుల్ ఫోన్లు.. ఇవే ఆ 4 మోడల్స్!

Big Stories

Advertisement
×