E-Paper
Advertisement

మీ పిల్లలతో వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా.. చరిత్ర కలిగిన ఈ పార్క్ చూసేయండి!

మీ పిల్లలతో వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా.. చరిత్ర కలిగిన ఈ పార్క్ చూసేయండి!
Advertisement

Nehru Zoo: హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్క్.. నగరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పక చూసే ప్రదేశాల్లో ఒకటి. అయితే.. ఈ జంతు ప్రదర్శనశాల 1963 అక్టోబర్ 6న అప్పటి ఏపీ గవర్నర్‌ శ్రీనాగేష్ ప్రారంభించారు. అంటే ఇవాళ్టితో నెహ్రూ జూ పార్క్‌కు 63 ఏళ్లు. వందల రకాల జంతువులు, పక్షులు, సరీసృపాలు.. పచ్చని వాతావరణం.. కుటుంబంతో సరదాగా గడపడానికి జూ పార్క్ ఇప్పటికీ హైదరాబాద్‌లో ఫేవరెట్ స్పాట్. ముఖ్యంగా పిల్లలకు అయితే.. పుస్తకాల్లో చూసే జంతువులను కళ్లముందు చూడటానికి ఇదో మంచి అవకాశం.

మొదట 280 ఎకరాలు..

జూపార్క్‌ ఏర్పాటుకు ముందు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో చిన్న జూలో కొన్ని పక్షులు, జంతువులను చిన్న బోన్లలో ఉంచేవారు. వన్యప్రాణులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పెద్ద, సహజ వాతావరణం ఉండే జూ అవసరమని నిర్ణయించి కొత్త జూ ఏర్పాటు చేశారు. ప్రారంభ దశలో ప్రధానంగా చీతల్ అంటే చుక్కల జింకలు, సాంబర్ వంటి జింకలు, ఇతర శాకాహార జంతువులు, కొన్ని పక్షులతో ఎన్‌క్లోజర్లు ఏర్పాటు చేశారు. మొదట 280 ఎకరాలు కేటాయించారు. తర్వాత మరో 100 ఎకరాలు కలిపి ప్రస్తుతం 380 ఎకరాలకు విస్తరించింది.

దేశంలో తొలి..

Advertisement

నెహ్రూ జూలో 1974లో తొలి Lion Safari Park ప్రారంభించారు. పగలు నిద్రపోయి రాత్రి యాక్టివ్‌గా ఉండే జంతువులను చూసేందుకు Nocturnal Animal House ఏర్పాటు చేశారు. ఇది దేశంలో తొలి వాటిలో ఒకటిగా జూ అధికారిక రికార్డుల్లో ఉంది. 1998లో సీతాకోకచిలుకల కోసం Open Butterfly Park కూడా ఏర్పాటు చేశారు. ఇంకా ఇంట్రెస్టింగ్‌ విషయం ఏంటంటే.. నెహ్రూ జూలో Royal Bengal Tiger, White Tiger, స్లాత్ బేర్, హిప్పోమటాస్, జాగ్వార్, రైనో వంటి జంతువులను విజయవంతంగా breeding చేశారని మీకు తెలుసా?

Also read: బీఆర్ఎస్ సోషల్ మీడియాకు.. బల్మూరి వెంకట్ మాస్ వార్నింగ్!

Tags

Related News

అసలు మొదట్లో ఇన్‌స్టాగ్రామ్ ఎందుకోసం వాడేవారో మీకు తెలుసా..?

పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీలో పొలిటికల్ హీట్.. చైర్మన్ అభ్యర్థుల లిస్ట్ ఇదే?

ఉన్నత విద్యాశాఖను దడదడలాడించిన బిగ్ టీవీ.. దెబ్బకు 35 మంది నకిలీ ఉద్యోగుల మైండ్ బ్లాక్!

తెలంగాణలో టార్గెట్ ఫిక్స్ చేసుకున్న బీజేపీ.. ఆ రెండు పనులపై స్పెషల్ ఫోకస్!

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

Big Stories

Advertisement
×