Rabi Crops: మాన్సూన్ వెళ్లిపోయింది.. కానీ దేశంలో నీటి సమస్య మాత్రం అలాగే ఉంది. ఈసారి సాధారణం కంటే 13 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో పలు ప్రాంతాల్లో రిజర్వాయర్లు, భూగర్భ జలాలు, నేలలో తేమపై ప్రభావం పడింది. ఇప్పుడు అసలు టెన్షన్ రబీ పంటలపైనే. ఖరీఫ్ పంటలకు మాన్సూన్ ప్రధాన ఆధారం. కానీ రబీ పంటలు మాత్రం నేలలో మిగిలిన తేమ, ప్రాజెక్టుల నీరు, బోర్లు, భూగర్భ జలాలపై ఆధారపడతాయి. అంటే.. మాన్సూన్ సరిగ్గా రీచార్జ్ చేయకపోతే రబీకి నీటి కష్టాలు తప్పవు.
ఈ ప్రభావం మహారాష్ట్రలో ఇప్పటికే కనిపిస్తోంది. లోటు వర్షపాతం, సుదీర్ఘ పొడి వాతావరణంతో పంటలు దెబ్బతిన్నాయి. నీటి లభ్యత కూడా తగ్గింది. దీంతో రాష్ట్రంలోని 358 తాలూకాల్లో 265 తాలూకాలను ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. అయితే మాన్సూన్ లోటు అంటే రబీ పూర్తిగా దెబ్బతింటుందని కాదు. ఎక్కడ వర్షం కురిసింది. ఎంత కురిసింది. ఎంత నీరు భూమిలోకి చేరింది. రబీ సమయంలో అదే కీలకం కానుంది. నేలలో తేమ ఉంటే కొంత ఊరటలేకపోతే రైతులకు నీటి కోసం బోర్లు, ప్రాజెక్టులపైనే ఆధారం.
ఇక ముందున్న అక్టోబర్ కూడా పెద్దగా ఆశలు కల్పించడం లేదు. దేశవ్యాప్తంగా అక్టోబర్‌లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. సాధారణ సగటులో 85 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అయితే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తమిళనాడు, కేరళ, కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణ కర్ణాటకలో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం పొడి వాతావరణమే ఎక్కువగా ఉండొచ్చని అంచనా.
Also read: సుమలతకు ఫెడరేషన్‌లో నో ఎంట్రీ.. ఛాంబర్ దగ్గర రచ్చ రచ్చ!