కేటీఆర్ అడ్డంగా దొరికిపోయాడు. ఎమ్మెల్యేలకు పెత్తనం ఇవ్వడం మూలంగానే ఓడిపోయామని.. కేసీఆర్ నిర్ణయాన్ని తప్పుబట్టేలా కేటీఆర్ మాట్లాడిన తీరుపై టీఆర్‌ఎస్ చీఫ్ కవిత స్ట్రెయిట్ ఎటాక్ చేశారు. నిన్నటి తెలంగాణ భవన్ మీటింగులో కేటీఆర్ కామెంట్లను ఉటంకిస్తూ దీనికి ట్విట్టర్ వేదికగా ఆమె కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
- ‘నేను మీ పార్టీలో ఒక్క అవినీతి గుంటనక్కను విమర్శిస్తేనే.. కొన్ని గంటల్లో పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశారు…అదే గుంటనక్కతో అంటకాగుతూ మీ పార్టీ అధినేత తీరుతోనే నష్టపోయామని మీరు బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం పార్టీ వ్యతిరేకం కాదా?’ అని కేటీఆర్‌ను నిలదీశారు.
- అధినేత నిర్ణయాన్ని నువ్వు తప్పుబట్టినట్టు కాదా? అయితే నిన్ను ఎందుకు పార్టీ నుంచి తరిమేయలేదు..? అని కేటీఆర్‌ను ప్రశ్నించారు కవిత.
- మీరు మీ పార్టీ అధినేత కేసీఆర్‌ను విమర్శించడం.. ఆయన తీసుకున్న విధాన పరమైన నిర్ణయాలను బాహాటంగా తప్పు పట్టడం పార్టీ వ్యతిరేక చర్య కాదా!?’ అని నిలదీశారు.
- ‘మీ ఫామ్ హౌస్ లు, అక్రమంగా ఇచ్చిన పర్మిషన్లు.. ఆంధ్రా దోస్తులకు ఇచ్చిన నజరానాలు.. క్విడ్ ప్రో కో దందాలతో మీ పార్టీని పాతాళంలోకి నెట్టింది మీరు కాదా?’ అని కేటీఆర్, హరీశ్‌ల పాత లోపాలు, పాపాలను ఎండగట్టే ప్రయత్నం చేశారు కవిత.
- ‘నిన్నటి బీఆర్ఎస్ మీటింగులో ఓ రైతు ఫోన్ మాట్లాడుతుంటే “నీ పెండ్లామా!? అంత అర్జెంటా!? అని అహంకారంతో అతని భార్యనే అవమానించారు..” “ఒక మహిళా సాయం కోరి వస్తే నా కోసం కన్నావా” అని అమ్మనే అవమానించారు’ అంటూ కేటీఆర్‌కు తల్లి, చెల్లె, భార్య .. ఎవరి పట్లా గౌరవ మర్యాదలు లేవనే విధంగా ఘాటుగా స్పందించారు.
- ‘గుంటనక్క MIND GAME లో BLIND గా పడిపోయి పెద్ద మనిషినే తప్పు బడుతున్నావ్.. బీఆర్ఎస్ కు గోతిని తవ్వుతున్నావ్’.. అని పార్టీని ఇద్దరు కలిసి భూస్థాపితం చేసేస్తున్నారని ఆమె క్లారిటీగా చెప్పేశారు. వేరెవరో మీ పార్టీని బొంద పెట్టాల్సిన అవసరం లేదు.. మీరిద్దరు చాలు..! అనే విధంగా కవిత కామెంట్స్ ఉన్నాయి.
- ‘కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టు.. పార్టీలో మీ వైఫల్యాన్ని.. మీ చేతగాని తనాన్ని బీఆర్ఎస్ అధినేతపై మోపుతున్నావు అంటే… ప్రత్యక్ష రాజకీయాల్లో మీ స్థానం ఏమిటో అర్థమవుతుందా?’ అని తిన్నింటి వాసాలు లెక్కబెట్టే రీతిని, కేటీఆర్ అసమర్థతను ఆమె నేరుగా ఎండగట్టే ప్రయత్నం చేశారు. రాజకీయంగా ఇది తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
- ‘నిమజ్జనోత్సవంలో ఎంతమంది సోషల్ మీడియా influencers ను బతిమాలుకున్నారో ఆ గణేష్ మహారాజుకు, మీ అంతరాత్మకు తెలుసు…’ అంటూ నిమజ్జనోత్సవంలో దేఖ్‌లేంగే పాటలకు పైసలిచ్చి మరీ దిగజారుడు రాజకీయాలు చేశారనే విషయాన్ని మరోమారు ఇలా కుండబద్దలు కొట్టారు కవిత.
- ‘నేను నీలాగా విష నాగుల మాటలు విని మాట్లాడను.. నిర్ధిష్టమైన ఆధారాలతోనే మాట్లాడుతాను.. నాతో పెట్టుకోకు!’ అంటూ చెప్పుడు మాటలు నీకు అలవాటు.. చెప్పుడు మాటలకు తీర్థంపోతే మళ్లొచ్చే సరికి ఇల్లు ఆగం చేసుకోవడం నీ వైఖరి.. నేనలా కాదు..! అని మూతోడ్ జవాబిచ్చారు కవిత.
- నాతో పెట్టుకోకు… అని అన్నకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. పరోక్షంగానైనా నా జోలికొస్తే బిడ్డా.. ఖబర్దార్ ..అని హెచ్చరించిన విధానం ఇప్పుడ హాట్ టాపిక్‌గా మారింది.
Tags

Share