E-Paper
Advertisement

పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీలో పొలిటికల్ హీట్.. చైర్మన్ అభ్యర్థుల లిస్ట్ ఇదే?

పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీలో పొలిటికల్ హీట్.. చైర్మన్ అభ్యర్థుల లిస్ట్ ఇదే?
Advertisement

Palasa Chairman: శ్రీకాకుళం జిల్లాలో పలాస నియోజకవర్గం పరిధిలోని పలాస – కాశీబుగ్గ  మున్సిపాలిటీలో ఎప్పుడూ పొలిటికల్ హీట్ ఉంటుంది. మున్సిపాలిటీలో గత రెండు పర్యాయాలుగా స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ మధ్య ఆధిపత్య పోరు నడిచింది. గతంలో ఎమ్మెల్యేగా గౌతు శ్యాంసుందర్ శివాజీ ఉన్న సమయంలో మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావుతో విభేదాలు తలెత్తాయి. వైసీపీ హయాంలో మాజీ మంత్రి  సీదిరి అప్పలరాజుకు, మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబుకు మధ్య గొడవలు నడిచాయి. ఈసారి కొత్తగా ఎన్నికయ్యే చైర్మన్‌తోనైనా ఎమ్మెల్యే సమన్వయంతో ముందుకు సాగుతారా లేక పాత రాజకీయ సెంటిమెంటే కొనసాగుతుందా అన్నది చూడాల్సి ఉంది.

2002 నుంచి వరుసగా..

అధికార కూటమి నుంచి పలాస-కాశీబుగ్గ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు పలువురు సీనియర్లు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. దువ్వాడ శ్రీకాంత్ 2002 నుంచి వరుసగా కౌన్సిలర్‌గా గెలుస్తూ ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందారు. గతంలో వైసీపీలో క్రియాశీలకంగా పనిచేసి, 2024 ఎన్నికల ముందు అప్పలరాజుతో విభేదించి టీడీపీలో చేరారు. టీడీపీ అధిష్టానం చైర్మన్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గానైనా బరిలో దిగేందుకు ఆయన సిద్ధమవుతున్నారట. టీడీపీ సీనియర్ నాయకుడైన లొడగల కామేశ్వరరావుకు అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా, ప్రస్తుత వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, టీడీపీ సీనియర్ మల్లా శ్రీనివాస్ కూడా మున్సిపల్ చైర్మన్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. యువనేత మలిపెద్ది.నరేంద్ర కూడా చైర్మన్ టికెట్ ఆశిస్తున్నవారిలో ఉన్నారు.

Advertisement

Also read: పసిబిడ్డ కోసం తల్లి అడిగిన చిన్న సాయం.. రైల్వే సిబ్బంది చేసిన పనికి నెటిజన్లు ఫిదా!

ముగ్గురు కీలక నేతలు..

ప్రతిపక్ష వైసీపీలో కూడా చైర్మన్ పీఠం కోసం ముగ్గురు కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ ఏఎంసీ చైర్మన్ పి.వి.సతీష్ , మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బోర.కృష్ణారావుతోపాటు మాజీ మంత్రి అప్పలరాజుకు అత్యంత సన్నితుడు మొదలవలస మన్మధరావు పేర్లు వినిపిస్తున్నాయి. మరి అధిష్టానం ఎవరికి బొట్టు పెడుతుందో వేచిచూడాలి.

కూటమిలో అసంతృప్తులు..

Advertisement

చైర్మన్‌కు  ప్రత్యక్ష ఎన్నికల విధానం తీసుకురావడంతో ప్రచారం, ఎన్నికల వ్యయం కోట్ల రూపాయల్లోకి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి పార్టీలు అన్ని విధాలుగా సమర్థులను పెట్టేందుకు కసరత్తు చూస్తున్నాయి. ఒకవేళ కూటమిలో అసంతృప్తులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగితే కూటమి ఓట్ల చీలికకు దారితీసే ప్రమాదం ఉండటంతో… అభ్యర్థి ఎంపిక ఎమ్మెల్యే గౌతు శిరీషకు, కూటమి అధిష్టానానికి పరీక్షగా మారనుంది.

Also read: మార్కెట్‌లో దుమ్ములేపుతున్నఇయర్ బడ్స్..ఇలాంటి మోడల్ ఒక్కటైనా ఉండాలి

Tags

Related News

ఉన్నత విద్యాశాఖను దడదడలాడించిన బిగ్ టీవీ.. దెబ్బకు 35 మంది నకిలీ ఉద్యోగుల మైండ్ బ్లాక్!

తెలంగాణలో టార్గెట్ ఫిక్స్ చేసుకున్న బీజేపీ.. ఆ రెండు పనులపై స్పెషల్ ఫోకస్!

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

Big Stories

Advertisement
×