E-Paper
Advertisement

పసిబిడ్డ కోసం తల్లి అడిగిన చిన్న సాయం.. రైల్వే సిబ్బంది చేసిన పనికి నెటిజన్లు ఫిదా!

పసిబిడ్డ కోసం తల్లి అడిగిన చిన్న సాయం.. రైల్వే సిబ్బంది చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
Advertisement

Railway Staff Kindness: పసిబిడ్డతో చాలా దూరం ప్రయాణం చేయడం అంత సులభం కాదు. బిడ్డకు సరైన సమయంలో ఫుడ్ ఇవ్వడం, పాలు పట్టడం, ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడం తల్లిదండ్రులకు పెద్ద సవాల్ గా ఉంటుంది. అయితే, కొన్నిసార్లు ప్రయాణంలో ఎదురయ్యే చిన్న సాయం కూడా ఎంతో ఊరటనిస్తుంది. తాజాగా రైలులో తన రెండేళ్ల కొడుకుతో ప్రయాణించిన ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. రైల్వే ప్యాంట్రీ సిబ్బంది చూపించిన దయ, సాకారం ఆమెను ఎంతగానో ఆకట్టుకుంది.

బీహార్ నుంచి బెంగళూరుకు ప్రయాణం!

బీహార్ నుంచి బెంగళూరుకు రైలులో వెళ్తున్న ఓ కంటెంట్ క్రియేటర్ తన ప్రయాణ అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. రెండు రాత్రుల పాటు సాగే ఈ ప్రయాణంలో తన రెండేళ్ల కుమారుడి కోసం ఆమె ఓట్స్ ప్యాకెట్, చిన్న బౌల్ ను వెంట తీసుకెళ్లింది. బయటి ఆహారంపైనే పూర్తిగా ఆధారపడకుండా.. రాత్రి సమయంలో తన బిడ్డకు ఓట్స్ తినిపించాలని భావించింది. అయితే, రైలులో వాటిని ఎలా రెడీ చేయాలని ఆలోచనలో పడ్డారు.

ఐదు నిమిషాల్లోనే సాయం!

Advertisement

ఈ సమయంలో ఆమె రైలులోని ప్యాంట్రీ సిబ్బందిని కలిసి, తన దగ్గర ఉన్న ఓట్స్‌ ను బిడ్డ కోసం రెడీ చేసి ఇవ్వగలరా అని అడిగారు. ఆమె రిక్వెస్ట్ కు ప్యాంట్రీ సిబ్బంది సానుకూలంగా స్పందించారు. ఆమె నుంచి ఓట్స్ ప్యాకెట్ తీసుకుని కేవలం ఐదు నిమిషాల్లో వాటిని రెడీ చేసి తిరిగి ఇచ్చారు. ఇంత చిన్న పని కోసం కూడా సిబ్బంది చూపించిన శ్రద్ధ, సహకారం  ఆమెను ఆకట్టుకుంది. బిడ్డతో ప్రయాణిస్తున్న తనలాంటి తల్లికి వారి సాయం ఎంతో ఉపయోగపడిందని చెప్పింది.

తన పోస్ట్‌ లో ఆమె రైల్వే సిబ్బందిని ప్రత్యేకంగా ప్రశంసించారు. కేవలం ఓట్స్ సిద్ధం చేసి ఇవ్వడమే తనను ఆకట్టుకోలేదని.. వారు చూపించిన సాయం, ఆప్యాయత తనను మరింత కదిలించాయని తెలిపారు. పసిబిడ్డతో ప్రయాణిస్తున్న తల్లికి సాయం చేయడంలో సిబ్బంది ఏమాత్రం వెనుకాడలేదని చెప్పారు. రైలులో ఇలాంటి చిన్న సాయం సుదీర్ఘ ప్రయాణాన్ని ఎంతో సులభంగా, గుర్తుండిపోయేలా చేస్తాయని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ కు కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు.

నెటిజన్ల నుంచి ప్రశంసలు

Advertisement

ఈ ఎక్స్ పీరియెన్స్ ను ఆమె సోషల్ మీడియాలో పంచుకోవడంతో పలువురు నెటిజన్లు స్పందించారు. రైల్వే సిబ్బంది చేసిన సాయాన్ని ప్రశంసిస్తూ తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను కూడా కొందరు పంచుకున్నారు. ఒక ప్రయాణికుడు తన 21 గంటల ప్రయాణంలో ప్యాంట్రీ సిబ్బంది పాత్రలు శుభ్రం చేయడంతో పాటు తన చిన్నారికి గోరువెచ్చని పాలు ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. మరో ప్రయాణికుడు తన ఏడాది వయసున్న బిడ్డతో ప్రయాణిస్తున్నప్పుడు ప్యాంట్రీ సిబ్బంది వేడినీళ్లు, పాలు అందించడమే కాకుండా ఫీడింగ్ బాటిల్‌ను కూడా శుభ్రపరిచి, స్టెరిలైజ్ చేశారని తెలిపారు.  ప్రయాణంలో ఇచ్చే చిన్న సాయం కొన్నిసార్లు ప్రయాణికుల మనసులో చాలా కాలం నిలిచిపోయే జ్ఞాపకంగా మారుతుందనడానికి ఈ ఘటన ఓ బెస్ట్ ఎగ్జాంఫుల్ గా నిలిచింది.

Read Also: వందే భారత్ స్లీపర్ vs రాజధాని.. ఫుడ్ ఏ రైల్లో బాగుంటుంది?

Tags

Related News

అయ్యప్ప భక్తులకు APSRTC బంపర్ న్యూస్.. ఏపీతో పాటు 4 రాష్ట్రాల నుంచి స్పెషల్ బస్సులు!

చెట్టుకు సంకెళ్లు వేసి అరెస్ట్ చేశారు.. 128 ఏళ్లుగా విడుదల కాలేదు!

ప్రపంచంలోని టాప్ లగ్జరీ ట్రైన్స్.. ఒక్కో జర్నీ ఖర్చు తెలిస్తే షాక్!

రైలు కింద పడబోయిన ప్రయాణికుడు.. కానిస్టేబుల్ చాకచక్యంతో లైఫ్ సేఫ్!

దసరా, దీపావళికి స్పెషల్ ట్రైన్.. చర్లపల్లి నుంచి బెంగళూరుకు కొత్త సర్వీస్!

రైల్లో వాష్‌ రూమ్ ఉపయోగిస్తున్నారా? ఈ 6 హైజీన్ టిప్స్ తప్పకుండా పాటించాల్సిందే!

ఇక నేరుగా గోవాకు వెళ్లిపోవచ్చు, కొత్త వందేభారత్ వచ్చేస్తోంది!

Big Stories

Advertisement
×