Parliament Session: పార్లమెంట్ సమావేశాలను సైన్ డై వాయిదా వేసిన తర్వాత ప్రొరోగ్ చేయడం సాధారణ ప్రక్రియ. కానీ ఈసారి మాన్సూన్ సెషన్‌ను ఇంకా ముగించలేదు. 1952 నుంచి ఇప్పటివరకు ఇలాంటి పరిణామం జరగలేదట. అయితే ఇక్కడే విపక్షాల అనుమానం మాత్రం మరోలా ఉంది. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన రెండు మూడొంతుల మెజార్టీ ప్రభుత్వానికి లేదని అందుకే సెషన్‌ను కొనసాగిస్తున్నారని ఆరోపిస్తున్నాయి.
రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి 543 మంది సభ్యుల లోక్‌సభలో దాదాపు 360కి పైగా మద్దతు అవసరం. ఏప్రిల్‌లో ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందలేకపోయింది. సెషన్‌ను ప్రొరోగ్ చేయకుండా ఉంచితే.. అవసరమైతే ఇదే సమావేశాలను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంటుంది. కొత్తగా సమావేశాలు పిలవాల్సిన ప్రక్రియ, సమయం కూడా తప్పుతుంది.
ప్రొరోగ్ చేసిన తర్వాత రాష్ట్రపతి ఆదేశాలతో కొత్తగా సమావేశాలు ప్రారంభించాల్సి ఉంటుంది. ప్రశ్నలు అడిగేందుకు ఎంపీలకు కనీసం 15 రోజుల సమయం అవసరం ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకుని ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే సెషన్‌ను కొనసాగించడం వల్ల ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం మాత్రం ఉండదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 123 ప్రకారం.. సభలు ప్రొరోగ్ అయినప్పుడే ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు. సెషన్‌ను ఇంతకాలం ముగించకుండా ఉంచడం రాజ్యాంగ విరుద్ధం కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రొరోగ్ చేసే సమయంపై రాజ్యాంగంలో స్పష్టమైన పరిమితి లేదంటున్నారు.
Also read: ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ భేటీ!