Jangi Reddy Remuneration:ప్యారడైజ్ సినిమా డివైడ్ టాక్ మూట గట్టుకున్నప్పట్టికీ సినిమాలోని ఆయా షేర్ ,ఏష నాగుల కట్ట మీద సాంగ్స్ మాత్రం ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేశాయి. ఇక ఆయా షేర్ పాటకి నానీ వేసిన స్టెప్పులు గాని, ‘ఏష నాగుల కట్టమీద ఏసిన ఉయ్యాల’పాటకి నాని ,కీర్తి సురేష్ ల కెమిస్ట్రీ కాని సినిమాకి ఎంత పెద్ద ఎసెట్ అయ్యాయో వాటిని పాడిన జంగి రెడ్డి గొంతు కూడా అంతే ప్లస్ అయిందని చెప్పాలి.మరి ఈ రెండు పాటలు పాడినందుకు జంగి రెడ్డికి అందిన పారితోషికం ఎంతో ఓక్ సారి చూసేద్దాం.
సాంగ్స్ కోసం దాదాపుగా
తెలంగాణాలో తనదైన గొంతుతో ఎన్నో సాంగ్స్ ని పాపులర్ చేసిన జంగి రెడ్డి ప్యారడైజ్ లోని ఆయా షేర్ ,ఏష నాగుల కట్ట మీద సాంగ్స్ కోసం దాదాపుగా మూడు నుండి ఐదు లక్షల పారితోషికం అందుకున్నట్టు సమాచారం.ఇక ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జంగి రెడ్డి తన మాటల్లో చెప్పిన వివరాలని బట్టి చూస్తే కాస్త అటూ ఇటుగా ఇంతే ముట్టినట్టు అర్థమవుతుంది.అయితే తన గొంతుతో పాటల్ని సూపర్ డూపర్ హిట్ చేసి సినిమాని ఎక్కడికో తీసికెళ్ళిన జంగి రెడ్డి కి మరింత పారితోషికం ముట్టజెబితే బాగుండు అన్న కామెంట్స్ కూడా నెట్టింట కాస్త గట్టిగానే వినబడ్డాయి.
జానపద పాటలు కొత్తేమీ కాదు
ఇక జంగి రెడ్డి విషయానికి వస్తే ‘ఏష నాగుల కట్టమీద’ పాట ద్వారా ఇపుడు సోషల్ మీడియాలో బాగా నలుగుతున్న ఈయనకి జానపద పాటలు కొత్తేమీ కాదు. చాలా కాలంగా తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో మంచి అనుబంధం ఉన్న జంగి రెడ్డి ఇప్పటికే ఎన్నో జానపద, పండుగ, బోనాలు, జాతరలకు సంబంధించిన పాటలు పాడి ఎంతో మందిని అలరించాడు.
ముఖ్యంగా యూట్యూబ్ తో పాటు మిగతా మ్యూజిక్ ఫ్లాట్ ఫామ్స్ లలో ‘జంగిరెడ్డి పాటలు’ పేరుతో పాత ఆల్బమ్‌లు, కొత్త సింగిల్స్ ఇప్పటికీ అనేక సందర్బాలలో మారుమ్రోగిపోతుంటాయి. ఇక తెలంగాణాలో ఫేమస్ అయిన ‘మహంకాళి జాతర’, ‘దుర్గమ్మ సాంగ్స్’, ‘ఆషాడం బోనం’, ‘బకారం నల్ల పోచమ్మ బోనాలు’ వంటి తెలంగాణ సంస్కృతిని ఎలివేట్ చేసే ఎన్నో పాటల్లో జంగిరెడ్డి భాగం అవ్వడం విశేషం
ఎలాంటి పాటలతో సంచలనాలు స్ప్రుష్టిస్తాడో !
ఇక ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ‘ఏష నాగుల కట్టమీద ఏసిన ఉయ్యాల’ పాటే రీ సౌండ్ చేస్తుంది. ముఖ్యంగా మ్యూజిక్ రవి చంద్రన్ ఈ తెలంగాణ జానపద గీతాన్ని ఇప్పటి తరానికి తగ్గట్టుగా రీక్రియేట్ చేయడంతో పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా పాటలోని ఫోక్ నేటివిటీ, అనిరుధ్ ఇచ్చిన మాస్ టచ్, నాని స్టెప్పులు కలిసి పాటకు మంచి హైప్ తీసుకొచ్చాయనే చెప్పాలి.చూడాలి మరి ముందు ముందు జంగి రెడ్డి ఎలాంటి పాటలతో సంచలనాలు స్ప్రుష్టిస్తాడో !
also read :సాయి పల్లవి ఫస్ట్ మూవీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?