BigTV English

Kranti again counter on his father Mudragada: నాన్న.. మీ అనుభవం ఏమైంది? తోలు బొమ్మగా మారొద్దు

Kranti again counter on his father Mudragada: నాన్న.. మీ అనుభవం ఏమైంది? తోలు బొమ్మగా మారొద్దు

Kranti again counter on his father Mudragada: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు విచిత్రంగా ఉన్నాయి. నేతల కామెంట్లకు ప్రత్యర్థులు కౌంటర్లు ఇవ్వడం మనం చూస్తుంటారు. కానీ తూర్పుగోదావరి జిల్లా డిఫరెంట్. తండ్రి కామెంట్లకు కూతురు కౌంటరివ్వడం మొదలుపెట్టింది. ఈ వ్యవహారం తండ్రికి కాసింత ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో తండ్రీకూతురు మధ్య మాటల వార్ తారాస్థాయికి చేరింది. అసలేం జరిగింది.


పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను ఓడించాలని కంకణం కట్టుకున్నారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం. అందుకు తగ్గట్టుగా ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ పోతున్నారు. అంతేకాదు వివిధ కులాల సంఘాలతో భేటీలు నిర్వహించిన ఆయన.. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ గెలవడం ఎంతో ముఖ్యం అన్నది వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తన నోటికి పని చెప్పారు ముద్రగడ. వీలు కుదిరినప్పుడల్లా పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

పరిస్థితి గమనించిన ఆయన కూతురు క్రాంతి యాక్టివ్ అయ్యారు. అంతేకాదు తన తండ్రి ముద్రగడ చేస్తున్న కామెంట్లకు ధీటుగా బదులివ్వడం మొదలుపెట్టేసింది. నార్మల్‌గా అయితే ముద్రగడకు కూటమి నేతలు కౌంటరివ్వాలి, కానీ ఇక్కడ సొంత కూతురు ఆయన కౌంటరివ్వడం ఆయన ఇబ్బందుల్లో పడ్డారు. మా నాన్నకు బోలెడంత రాజకీయ అనుభవం ఉందని, కానీ జగన్ చేతిలో తోలుబొమ్మగా మారడం చాలా విడ్డూరంగా ఉందన్నారు.


ముఖ్యంగా జగన్, ముద్రగడ స్క్రిప్ట్ ఒకేలా ఉందని ఆరోపించారు క్రాంతి. చెడు స్నేహాలు వద్దని తండ్రికి కూతురు హితవు పలికారు. ఓ జోకర్ మాటలు విని మా నాన్న ఎందుకు మీడియా సమావేశాలు ఎందుకు పెడుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఇన్నేళ్ల రాజకీయ అనుభవమున్న మా నాన్న ఈ విషయాన్ని తెలుసుకోకపోవడం చాలా బాధాకరమన్నారు. అంతేకాదు వైసీపీ నేత గిరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ఓడిపోతుందని, రాజకీయ భవిష్యత్తుకు ముగింపు పడుతుందన్నారు. తాటాకు చప్పళ్లకు భయపడేది లేదని కంక్లూజన్‌లో చెప్పుకొచ్చారు క్రాంతి.

ALSO READ:  ఏపీలో ప్రధాని పర్యటన.. నేడు విజయవాడలో రోడ్ షో

తండ్రి-కూతురు మధ్య జరుగుతున్న మాటల వార్‌పై ఆ జిల్లా ప్రజలు రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలైంది. ముద్రగడ వారసునిగా కూతురు క్రాంతికి సరైన ఛాన్స్ వచ్చిందని, ఈ ఎన్నికలను ఆమె బాగానే ఉపయోగించుకుంటున్నారని అంటున్నవాళ్లూ లేకపోలేదు. దీనికితోడు రానున్న ఎన్నికల్లో జనసేన తరపున టికెట్ ఇస్తానని పవన్ బహిరంగంగా ప్రకటించడంతో ఆమెకు లైన్ క్లియర్ అయ్యిందని అంటున్నారు. మొత్తానికి తండ్రికూతురు మాటల వార్‌లో గెలుపెవరిదో చూడాలి.

 

 

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×