E-Paper
Advertisement

కారుమూరిపై రాజకీయ కుట్రా? లిక్కర్ స్కామ్ కేసులో అసలేం జరిగింది ?

కారుమూరిపై రాజకీయ కుట్రా? లిక్కర్ స్కామ్ కేసులో అసలేం జరిగింది ?
Advertisement

ఏపీలో మద్యం రవాణా టెండర్ల వ్యవహారం పొలిటికల్‌గా, దర్యాప్తు పరంగానూ చర్చనీయాంశంగా మారింది. CID దర్యాప్తు నుంచి ED విచారణ వరకు వెళ్లిన ఈ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్‌తో పీక్స్‌కు చేరింది.

ఈ కేసులో మద్యం రవాణా టెండర్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. టెండర్ నిబంధనలను కొందరికి అనుకూలంగా మార్చడం, కాంట్రాక్టులు దక్కిన తర్వాత సబ్‌కాంట్రాక్టింగ్ ద్వారా డబ్బులు మళ్లించడం వంటి అంశాలపై దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టాయి.

Advertisement

ఈ కేసును YCP రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తోంది. కానీ దర్యాప్తు సంస్థలు మాత్రం మనీలాండరింగ్, అక్రమ ఆర్థిక లావాదేవీల కోణంలో ఆధారాలు సేకరిస్తున్నాయి. టెండర్ ప్రక్రియలో నిజంగా ఏం జరిగింది? డబ్బుల లావాదేవీలకు ఆధారాలు ఉన్నాయా? మాజీ మంత్రి పాత్ర ఏంటి? కారుమూరి అరెస్ట్‌తో కేసు ముగిసినట్లేనా?.. అసలు లింకులు ఎక్కడికి వెళ్తాయన్నాయి? ఈ ప్రశ్నలే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో ఇంట్రస్టింగ్‌గా మారాయి.

‘మీట్ ది ఎడిటర్స్‌’లో పూర్తి చర్చను చూడండి

అసలు ఏమైంది?

Advertisement

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం రవాణా టెండర్లు, మనీలాండరింగ్ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేసి, నాంపల్లిలోని పీఎంఎల్‌ఏ కోర్టులో హాజరుపరిచారు.

కారుమూరి విచారణకు సహకరించడం లేదని ఈడీ కోర్టుకు తెలిపింది. విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు ఎనిమిదిసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ స్పందించలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్ట్ చేసినట్లు న్యాయస్థానానికి వివరించారు.

అయితే ఈడీ ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని కారుమూరి తరఫు న్యాయవాదులు వాదించారు. దర్యాప్తుకు ఆయన పూర్తిగా సహకరిస్తారని, ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఇరువర్గాల వాదనలు విన్న నాంపల్లి పీఎంఎల్‌ఏ కోర్టు.. ఈడీ కోరిన మేరకు కారుమూరికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో ఇప్పటికే ఆయన కుమారుడు సునీల్‌ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. మద్యం రవాణా కుంభకోణానికి సంబంధించి పలువురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

తాజాగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు రిమాండ్ విధించడంతో.. ఈ కేసులో దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది. రాబోయే రోజుల్లో ఈడీ విచారణ ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తిగా మారింది.

Also Read: ఇరాన్‌పై అమెరికా ఉక్కుపాదం.. ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఎత్తులు, నెక్ట్స్ ప్లాన్ ఇదే!

Tags

Related News

ఇరాన్‌పై అమెరికా ఉక్కుపాదం.. ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఎత్తులు, నెక్ట్స్ ప్లాన్ ఇదే!

విజ‌య సాయిరెడ్డి ఎవ‌రు విడిచిన బాణం.. ఎవ‌రి పై గురి? బాబుకు క‌లిసొస్తున్న‌ మిత్ర‌బేధం?

తెలంగాణతో మోడీ తీరు ఇదే!? సీఎం కలుపుకుపోదామనుకున్నా.. రాజకీయాలకే బీజేపీ ప్రాధాన్యం!

ఆమె అంటే ఎందుకంత జంకు… గజ్జు మంటున్న ప్ర‌భుత్వ‌ పెద్దలు.. ఆచితూచి వ్య‌వ‌హారం అందుకే!

తమిళనాడు అసెంబ్లీలో.. సీఎం విజయ్ సంచలన ప్రకటనలు

తెలంగాణ ఎమ్మెల్సీ పోరులో జనసేన.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

కొండా సురేఖ వివాదంపై.. పరోక్ష సంకేతాలిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్!

Big Stories

Advertisement
×