E-Paper
Advertisement

తమిళనాడు అసెంబ్లీలో.. సీఎం విజయ్ సంచలన ప్రకటనలు

తమిళనాడు అసెంబ్లీలో.. సీఎం విజయ్ సంచలన ప్రకటనలు
Advertisement

Vijay Schemes: తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్.. అసెంబ్లీ వేదికగా కీలక సంక్షేమ పథకాలను ప్రకటించారు. మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. పేద కుటుంబాలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించనున్నట్లు తెలిపారు. అలాగే రైతుల వ్యతిరేకతతో.. పరందూర్‌ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనని రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

అక్టోబర్ 2 గాంధీ జయంతి..

మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేసే ఉద్దేశంతో.. ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని వెట్రి పయనం పేరుతో విస్తరించారు. వచ్చే అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. మెట్రో పాలిటన్, పట్టణ ప్రాంతాల్లోని ఎక్స్‌ప్రెస్, ఎల్‌ఎస్‌ఎస్, డీలక్స్ బస్సుల్లో.. మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఉచితంగా ప్రయాణించవచ్చు. సబర్బన్, కొండ ప్రాంతాల్లో తిరిగే సాధారణ ఛార్జీల బస్సులకూ ఇది వర్తిస్తుంది. ఈ పథకానికి ఏటా 6 వేల కోట్ల అదనపు భారం పడనుంది.

Advertisement

Also read: ‘యువతులను ట్రాప్ చేస్తున్నారు’.. ఏపీ ప్రభుత్వానికి రాజాసింగ్ కీలక హెచ్చరిక

ఏటా 4 వేల కోట్ల భారం..

అయితే, వార్షిక ఆదాయం రెండున్నర లక్షల్లోపు ఉన్న కోటి 30 లక్షల కుటుంబాలకు.. ఏడాదికి 3 ఉచిత ఎల్పీజీ సిలిండర్లు అందించనున్నారు. వీటి కొనుగోలు మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తారు. వచ్చే పొంగల్ నుంచి ప్రారంభం కానున్న ఈ పథకానికి.. ప్రభుత్వ ఖజానాపై ఏటా 4 వేల కోట్ల భారం పడనుంది. ఇక, రైతులు, స్థానిక ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. పరందూర్‌లో ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రజలు నిరాశ్రయులు కాకుండా.. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత చెన్నై మీనంబాక్కం విమానాశ్రయంలో కొత్తగా టెర్మినల్-5ను నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు.

Advertisement

Also Reda: కొండా సురేఖ వివాదంపై.. పరోక్ష సంకేతాలిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్!

Tags

Related News

ప్లానింగ్‌ లోపం.. జంతర్‌మంతర్‌ 2.0 విఫలం! ప్రచారార్బాటాలకే పరిమితమైన సీజేపీ.. కేంద్రం అలర్ట్‌గా ఉందని తెలిసినా.. తిప్పికొట్టే వ్యూహంలో ఫెయిల్‌..!

కొత్త పార్టీతో తొలి ఎన్నికను ఎదుర్కొనేందుకు రెడీ అయిన కవిత! తొలి ప్రయత్నంలోనే హేమాహేమీలతో ఢీ అంటే ఢీ..! ఏమిటా వ్యూహం..?

ఎండాకాలంలో కనిపించే ఆలయం.. ఈసారి అక్టోబర్‌లోనే దర్శనం.. దేనికి సంకేతం?

ఏపీలో స్థానిక ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. ఆరు వారాల్లో నోటిఫికేషన్‌!

వరి రైతు నోటికాడి ధరను కొల్లగొట్టిన మిల్లర్‌ గద్దలు! ఎంఎస్‌పీ కన్నా వెయ్యి అదనంగా చెల్లిస్తున్న వ్యాపారులకు ధమ్కీ! ఎలా కొంటారని బెదిరించిన మిల్లర్ల అసోసియేషన్‌..!

రాబోయే ఎన్నికలపై.. సీఎం రేవంత్ వేసిన బిగ్ పొలిటికల్ ప్లాన్ ఇదే!

కేసీఆర్‌ ఉన్నప్పుడే గౌరమ్మా..! బతుకంతా పచ్చగ ఉండే గౌరమ్మా..! రెండు పాటలను విడుదల చేసిన బీఆరెస్‌ పార్టీ..!

చంద్రుడిపై ఐదు మెరుపులు.. ఆర్టెమిస్-2 వ్యోమగాములు గుర్తించిన వింత ఏంటి?

Big Stories

Advertisement
×