E-Paper
Advertisement

కోడి గుడ్లు కంటే సోయా చంక్స్‌లో ప్రొటీన్ అధికం.. కానీ ఏది బెస్ట్?

కోడి గుడ్లు కంటే సోయా చంక్స్‌లో ప్రొటీన్ అధికం.. కానీ ఏది బెస్ట్?
Advertisement

Soya Chunks vs Eggs| ప్రోటీన్ మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాల్లో ఒకటి. కండరాల నిర్మాణం, శరీరంలో కణజాలాల మరమ్మతు, ఎంజైమ్స్, హార్మోన్ల తయారీలో ప్రొటీన్ సహాయపడుతుంది. ప్రొటీన్ లభించే అతి తక్కువ ధర ఫుడ్స్‌లో గుడ్లు, సోయా చంక్స్ ఉన్నాయి. ఈ రెండూ మంచి ప్రోటీన్ వనరులుగా చాలామంది రోజువారీలో ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. అయితే వీటిలో ఉండే ప్రోటీన్ పరిమాణంలో గణనీయమైన తేడా ఉంటుంది. డ్రై సోయా చంక్స్‌లో గుడ్ల కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ ప్రోటీన్ కనిపిస్తుంది. కానీ సోయా చంక్స్‌ను నీటిలో నానబెట్టి ఉడికించిన తర్వాత ఈ లెక్క మారిపోతుంది.

డ్రై సోయా చంక్స్‌లో ప్రోటీన్ ఎక్కువ

100 గ్రాముల డ్రై సోయా చంక్స్‌లో సుమారు 52 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అదే 100 గ్రాముల గుడ్లలో సుమారు 13 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. అందుకే డ్రై సోయా చంక్స్ ప్రోటీన్ పరంగా చాలా ఎక్కువగా కనిపిస్తాయి. సోయా చంక్స్‌ను డీఫ్యాటెడ్ సోయా పిండితో తయారు చేస్తారు. వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉండటంతో పాటు కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది.
అందువల్ల వెజిటేరియన్లు, వెగన్లు, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేవారికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

గుడ్లు కూడా మంచి ప్రోటీన్ ఆహార వనరే

Advertisement

గుడ్లలో శరీరానికి అవసరమైన 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి కండరాల నిర్వహణ, కణజాలాల మరమ్మతు వంటి ప్రక్రియలకు సహాయపడతాయి. గుడ్లలో విటమిన్ B12, కోలిన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. కొంతమందికి సోయా ఉత్పత్తులతో పోలిస్తే గుడ్లు సులభంగా జీర్ణమవుతాయి. కాబట్టి ప్రోటీన్ పరిమాణం మాత్రమే చూసి ఆహారాన్ని ఎంచుకోవడం సరైనది కాదు.

సోయా చంక్స్‌ను ఉడికిస్తే ప్రోటీన్ లెక్క ఎందుకు మారుతుంది?

సోయా చంక్స్.. నీటిని ఎక్కువగా పీల్చుకునే లక్షణం కలిగి ఉంటాయి. నానబెట్టి ఉడికించిన తర్వాత వాటి బరువు దాదాపు మూడు రెట్లు పెరగవచ్చు. అందువల్ల 100 గ్రాముల ఉడికించిన సోయా చంక్స్‌లో 100 గ్రాముల డ్రై సోయా పోషకాలు ఉండవు. 100 గ్రాముల ఉడికించిన సోయా చంక్స్‌లో సుమారు 25 నుంచి 30 గ్రాముల డ్రై సోయా ఉంటుంది. అలాంటి పరిమాణం సుమారు 13 నుంచి 15 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి 100 గ్రాముల ఉడికించిన సోయాను 100 గ్రాముల గుడ్లతో నేరుగా పోల్చకూడదు.

ఎక్కువ సోయా తినడం వల్ల జీర్ణ సమస్యలు

Advertisement

డ్రై సోయా చంక్స్‌ను పెద్ద పరిమాణంలో ఉడికిస్తే చాలా ఎక్కువ ఆహారం తయారవుతుంది. ఒకేసారి ఎక్కువ సోయా తినడం వల్ల కొంతమందికి గ్యాస్, ఉబ్బరం రావచ్చు. అధిక ఫైబర్ తీసుకోవడం వల్ల కొందరికి మలబద్ధకం కూడా ఏర్పడవచ్చు. అందుకే మీ ఆహారంలో సోయా చంక్స్‌ను తగిన పరిమాణంలో తీసుకోవడం మంచిది.

Also Read: చనిపోయిన కోటీశ్వరుడు.. భార్యకు ప్రతి నెలా రూ.1000 మాత్రమే.. ఎందుకంటే

సోయా చంక్స్‌లో కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు

సోయా చంక్స్ తక్కువ కొవ్వుతో ప్రోటీన్ పొందడానికి చౌకైన మార్గాన్ని అందిస్తాయి. వాటిలో కొలెస్ట్రాల్ ఉండదు, అలాగే ఐసోఫ్లేవోన్స్ వంటి మొక్కల కాంపౌండ్స్ ఉంటాయి. ఫైబర్ కూడా ఉండటంతో సమతుల్య ఆహారంలో భాగంగా వీటిని తీసుకోవచ్చు. నానబెట్టడం, బాగా ఉడికించడం, నీటితో శుభ్రం చేయడం ద్వారా కొన్ని యాంటీన్యూట్రియెంట్లు తగ్గవచ్చు.

Also Read: మలబద్ధకం సమస్యకు అసలు మూలం ఇదే.. ఈ ఫుడ్స్ తింటే సమస్య ఫినిష్

గుడ్లు, సోయా రెండింటినీ రోజూ తినవచ్చు

సోయా చంక్స్, గుడ్లు రెండూ సమతుల్య ఆహారంలో భాగంగా తినడం మంచిది. సోయా చంక్స్ ఎక్కువ ప్రోటీన్, ఫైబర్, తక్కువ కొవ్వు వంటి ప్రయోజనాలను అందిస్తాయి. గుడ్లు పూర్తి ప్రోటీన్‌తో పాటు అనేక ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. ఒకే ప్రోటీన్ వనరుపై ఆధారపడకుండా వివిధ ఆహారాలను తీసుకోవడం మంచిది. పప్పులు, బీన్స్, పాలు, గింజలు, గుడ్లు, సోయా వంటి ఆహారాలను కలిపి తీసుకోవచ్చు. మీ వయసు, ఆరోగ్య పరిస్థితి, రోజువారీ అవసరాలకు అనుగుణంగా పరిమాణాన్ని నిర్ణయించుకోవడం బెస్ట్.

Related News

నోటికి కారంగా, సూపర్ టేస్టీగా ఆలూ పచ్చి కారం ఫ్రై!

నెల రోజులపాటు నిల్వ ఉండే రవ్వ లడ్డు..క్షణాల్లోనే చేయండిలా!

సేమియా ఉప్మా బోర్ కొట్టిందా? ఇలా ఎగ్ సేమియా ట్రై చేయండి!

అతనంటే ఎంతో ఇష్టం.. కానీ ఐ లవ్ యు చెప్పడానికి భయం.. మనసులో మాట చెప్పేందుకు టిప్స్

ఈ ముగ్గురికి పొరపాటున కూడా సాయం చేయకండి..లేదంటే మీ జీవితమే నాశనం!

నిద్రలో కాలి కండరాలు పట్టేయడానికి కారణమేంటి? ఎప్పుడు ప్రమాదకరమంటే..

నాన్ స్టాప్ డాండియా డాన్స్ చేసినా చెదరని మేకప్.. రాత్రంతా ఫ్రెష్ లుక్ కోసం టిప్స్

సన్‌స్క్రీన్ వాడుతున్నా చర్మం నల్లబడుతోందా? మీరు చేస్తున్న తప్పులు ఇవే

Big Stories

Advertisement
×