E-Paper
Advertisement

రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ఇస్తే భూకంపమేం రాదు..ఎప్పటి లాగానే అందరూ క్రికెట్ చూస్తారు

రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ఇస్తే భూకంపమేం రాదు..ఎప్పటి లాగానే అందరూ క్రికెట్ చూస్తారు
Advertisement

Virender Sehwag On Virat, Rohit Retirement:  టీం ఇండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ పూర్తయిన వెంటనే ఈ ఇద్దరు స్టార్లు రిటైర్మెంట్ ప్రకటించి.. రెస్ట్ తీసుకోనున్నారు. అయితే రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే క్రికెట్ చూసే నాధుడే ఉండడని.. వన్డేలు బంద్ చేసుకోవాల్సిందేనని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇద్దరు స్టార్ల రిటైర్మెంట్ పై వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే భూకంపమేం రాదు

రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటిస్తే.. క్రికెట్ కు ఎలాంటి ఢోకా ఉండబోదని వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించారు. వాళ్లు రిటైర్మెంట్ ప్రకటించిన మాత్రాన.. భూకంపం ఏమి రాదని బాంబు పేల్చారు. ఎప్పటిలాగే అందరూ క్రికెట్ చూస్తారని.. ఆ ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించిన మాత్రాన, క్రికెట్ చూడకుండా అభిమానులు ఉండబోరని కుండబద్దలు కొట్టి చెప్పారు. వాళ్లు కాకపోతే, అంతకుమించి తోపు క్రికెటర్లు వస్తారని వెల్లడించారు. వీళ్లు పెద్ద పోటుగాళ్ళు ఏమీ కాదని పరువు తీశారు.

Advertisement

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, సచిన్ రిటైర్మెంట్ టైంలోనూ ఇదే ప్రచారం

రోహిత్ శర్మతో (Rohit Sharma) పాటు విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటిస్తే భూకంపం రాదని వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటిలాగే అభిమానులు క్రికెట్ చూస్తారని తెలిపారు. ఈ ఇద్దరి రిటైర్మెంట్ తర్వాత క్రికెట్ అంతరించిపోతుందని కొంతమంది సినిమా డైలాగులు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ లాంటి ఎంతోమంది తోపు క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు కూడా ఇలాంటి డైలాగులే వేశారని గుర్తు చేశారు.

Advertisement

వాళ్లు రిటైర్మెంట్ ఇచ్చి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, క్రికెట్ కు ఆదరణ పెరిగింది తప్ప.. ఎక్కడ తగ్గలేదని వెల్లడించారు. ప్రస్తుత కాలంలో మొబైల్ లోనే మ్యాచ్ లు చూసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి.. ఎక్కడపడితే అక్కడ క్రికెట్ చూస్తున్నారని వివరించారు. ఇక రో-కో కాంబినేషన్ రిటైర్మెంట్ తర్వాత కూడా క్రికెట్ కు ఆదరణ పెరుగుతుంది తప్ప.. ఏ మాత్రం తగ్గదని కుండబద్దలు కొట్టి చెప్పారు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఇద్దరు టెస్టులు, టి20 లకు రిటైర్మెంట్ ప్రకటించారు. 2024 నుంచి కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు.

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

Related News

క్రికెట్ మానేసి, కిరాణా కొట్టు పెట్టుకోమని అవమానించారు

టీమిండియా ఫిక్సింగ్ చేసి గెలుస్తోంది..ఈ పరికరాలే దానికి సాక్ష్యం!

ఒరేయ్ వైభవ్ జాగ్రత్త..నీకు వినోద్ కాంబ్లీకి పట్టిన గతే పడుతుంది

36 ఏళ్ల ముసలోడిని తీసుకొచ్చి, ఏం పీకుతారు..భువీ రీ-ఎంట్రీపై తన్వీర్ సంచలనం!

పౌరసత్వం ఇస్తే, ఇండియాకు షిఫ్ట్ అవుతా…చివరి శ్వాస వరకు SRHతోనే ఉంటా

రాసిపెట్టుకోండి…కోహ్లీ-రోహిత్ రిటైర్మెంట్ ఇస్తే, వ‌న్డే క్రికెట్ అంత‌రించిపోతుంది

టీమిండియా ముందు పాకిస్తాన్ ప‌సికూనే…ఆస్ట్రేలియాతోనే అస‌లు ఫైట్

Big Stories

Advertisement
×