E-Paper
Advertisement

KKR Vs LSG IPL 2024 Preview: నువ్వా..? నేనా..? నేడు కోల్ కతా వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్

KKR Vs LSG IPL 2024 Preview: నువ్వా..? నేనా..? నేడు కోల్ కతా వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్
Advertisement

KKR Vs LSG IPL 2024 Match Prediction: ఐపీఎల్ మ్యాచ్ లకి ఆదివారం అంటే పండగే పండగలా ఉంటుంది. ఒకేరోజు రెండు మ్యాచ్ లు జరుగుతాయి. ఎందుకంటే సెలవు రోజు కాబట్టి స్టేడియంలన్నీ కళకళలాడతాయి. నేడు మధ్యాహ్నం 3.30 గంటలకి కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది.

రెండు జట్లు సమఉజ్జీలుగా ఉన్నట్టే చెప్పుకోవాలి. ఎందుకంటే కోల్ కతా పాయింట్ల టేబుల్ పట్టికలో 2వ స్థానంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ 4వ స్థానంలో ఉంది. కోల్ కతా 4 మ్యాచ్ లు ఆడి 3 గెలిచి ఒక దాంట్లో ఓడిపోయింది. లక్నో అయితే 5 మ్యాచ్ లు ఆడింది. మూడు గెలిచి, రెండు ఓడిపోయింది.

Advertisement

ఇంతవరకు ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్ లు మాత్రమే జరిగాయి. మూడింట్లో లక్నో విజయం సాధించడం విశేషం.

శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో కోల్ కతా చాలా దూకుడుగా ఆడుతోంది. మొదటి నుంచి చివరి వరకు కూడా అందరూ హార్డ్ హిట్టర్స్ ఉండటం వారికి కలిసి వచ్చింది. వారు  వరుసగా క్లిక్ అవుతుండటంతో మ్యాచ్ లు గెలుస్తూ వెళుతున్నారు. వీళ్లతో ఒక చిక్కు ఉంటుంది. ఆడితే దంచి కొడతారు. లేదంటే మొదటి బంతికి లేదా అదే ఓవర్ లో అవుట్ అయిపోతుంటారు. వీళ్లతో ఆట జూదంలాంటిదేనని చెప్పాలి. అన్నివేళలా వీరితో పని కాదు. ఆల్రడీ ఒక మ్యాచ్ అలాగే క్యూ కట్టేశారు. ఓడిపోయారు. మరి ఈసారి లక్నోపై ఎలా ఆడతారో చూడాల్సిందే.

Also Read: ఉత్కంఠ పోరులో చచ్చీ చెడి గెలిచిన రాజస్థాన్ పోరాడి ఓడిన పంజాబ్..

ఇకపోతే లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆధ్వర్యంలో మ్యాచ్ లు నిలకడగానే ఆడుతూ విజయం సాధిస్తున్నారు. కాకపోతే దూకుడుగా ఆడలేకపోతున్నారు. ఇప్పుడు కోల్ కతాపై ఆ విధమైన ఆటతీరు లేకపోతే పరాజయం తప్పకపోవచ్చునని అంటున్నారు. కేఎల్ రాహుల్ తో పాటు మరికొందరు ఆడితే బాగుంటుంది. అలాగే బౌలింగ్ విభాగం కూడా బలోపేతం కావల్సి ఉంది.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×