Corporation Chairman: తెలంగాణలో 37 కార్పొరేషన్ ఛైర్మన్ల పదవీకాలం ముగిసి మూడు నెలలవుతోంది. పదవీకాలం ముగిసిన వారికి రెన్యువల్ చేయలేదు. కొత్తవారికి వాటిని కేటాయించలేదు. రేపో,మాపో వాటిని భర్తీ చేస్తారనే చర్చ మాత్రం కొనసాగుతోంది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్‌కి వెళ్లిన ప్రతిసారీ కార్పొరేషన్ పదవులపై హైకమాండ్‌తో చర్చలు జరుపుతున్నారని లిస్ట్ ఫైనల్ అయిందనే గుసగుసలు వినిపిస్తుంటాయ్.
దాంతో కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఆశిస్తున్న నేతలు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. కానీ, నిరాశే మిగులుతోంది. అయితే, పదవీకాలం ముగిసిన 37 కార్పొరేషన్ ఛైర్మన్‌లలో దాదాపు 15 నుంచి 18 వరకు రెన్యువల్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 30కి పైగా కొత్త నేతలకు ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం. మొత్తంగా ఒకేసారి 50 వరకు నామినేటెడ్ పదవులు భర్తీ చేసేందుకు అధికారం కాంగ్రెస్ సిద్ధమైందనే టాక్ వినిపిస్తోంది.
Also read: తెలంగాణ బీజేపీ త్రిముఖ వ్యూహం.. 3 జోన్లు.. 3 విభిన్న ప్లాన్లు!
ఆగస్ట్ చివరి వారంలోనే నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని పీసీసీ చెప్పింది. కానీ అది జరగలేదు. ఇప్పుడు దసరాకు పదవుల పండగ అనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. రెన్యూవల్ కోసం ఎదురుచూస్తున్న వారు, కొత్తగా పదవులు ఆశిస్తున్న వారంతా.. ఎంతో ఆశతో దసరా కోసం వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతుంది. మరో రెండేళ్ల సమయం ఉంటుంది. కార్పొరేషన్ ఛైర్మన్ పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. ఇలా చూసుకుంటే, కొందరు దసరాకు నామినేటెడ్ పదవుల భర్తీ ఉండకపోవచ్చంటున్నారు. ఎందుకంటే, నవంబర్, డిసెంబర్‌లో పదవుల భర్తీ జరిగితే.. ఎన్నికల సమయం వరకు వారికి పదవులు ఉంటాయనే ఆలోచన పార్టీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, ఇంకా లిస్ట్ ఫైనల్ కాలేదు, ఇంకా చర్చించాల్సి ఉందనే వార్తలు వస్తున్నాయ్. పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి, సీనియర్ మంత్రులంతా.. ఒక్కసారి కూర్చొని చర్చించిన తర్వాతే లిస్ట్ ఫైనల్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దసరా పండుగ పదవి తెస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్న నేతల కోరిన నెరవేరుతుందా? మరోసారి అసంతృప్తే మిగులుతుందా? అనేది తేలాలంటే.. దసరా వరకు వెయిట్ చేయాల్సిందే.
Also read: సినీ ఇండస్ట్రీలో విషాదం..బిల్లా 2 నిర్మాత మృతి.