E-Paper
Advertisement

సెప్టెంబర్ 30న ఆల్ టైమ్ రికార్డ్.. విద్యుత్ వాడకంలో తెలంగాణ సరికొత్త చరిత్ర!

సెప్టెంబర్ 30న ఆల్ టైమ్ రికార్డ్.. విద్యుత్ వాడకంలో తెలంగాణ సరికొత్త చరిత్ర!
Advertisement

Power Demand: సూర్యుడు అస్తమిస్తే చాలు రాష్ట్రం కరెంట్ కోసం తడబడుతోంది. సెప్టెంబర్ 30న రాష్ట్ర చరిత్రలోనే గరిష్ఠంగా 19 వేల 892 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైంది. ఆ ఒక్క రోజే 327 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం జరిగింది. గతేడాది ఇదే సీజన్‌లో గరిష్ఠ డిమాండ్ 16 వేల 613 మెగావాట్లే. అంటే ఏడాదిలోనే వేల మెగావాట్ల పెరుగుదల. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేశాయి. పంటను కాపాడుకునేందుకు రైతులు బోర్లను నిరంతరం నడుపుతున్నారు. ఎత్తిపోతల ప్రాజెక్టులు కూడా పని చేస్తుండటంతో వ్యవసాయ డిమాండ్ భారీగా ఎగబాకిందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. సాయంత్రం వేళ గృహ వినియోగం గరిష్ఠానికి చేరుతుండటం పవర్ సెక్టార్‌ను కలవరపెడుతోంది.

రాత్రి సమయంలో..

పగలు సోలార్ పవర్ ఆదుకుంటోంది. సూర్యుడు అస్తమించగానే సోలార్ ఉత్పత్తి ఒక్కసారిగా పడిపోతోంది. అదే సమయంలో డిమాండ్ మాత్రం పెరుగుతోంది. రాత్రివేళ 13 వేల నుంచి 15 వేల మెగావాట్ల డిమాండ్ ఉంటోందని, కానీ థర్మల్, కేంద్ర వాటా, హైడల్ ద్వారా అందేది పరిమితమేనని విద్యుత్ శాఖ చెబుతోంది. దీంతో రోజూ వేల మెగావాట్ల గ్యాప్ ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ కొరతను తీర్చేందుకే.. కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 7 వేల 800 మెగావాట్ల విద్యుత్ కోసం టెండర్లు పిలవాలని నిర్ణయించింది.

Advertisement

Also read: నలుగురు స్నేహితులకు ఒకేసారి భార్యల నుంచి విడాకుల నోటీసులు… ఫ్యామిలీ థెరపిస్ట్ కే పిచ్చెక్కించే ప్లాన్

విద్యుత్ సంస్థలు సతమతం..

ఇందులో 3 వేల మెగావాట్ల సోలార్, 4 వేల మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ, 800 మెగావాట్ల విండ్ పవర్ ఉంటాయ్. ఇప్పటికే వ్యవసాయ ఫీడర్లపై ఓవర్‌లోడ్, లో-వోల్టేజ్, ట్రిప్పింగ్ సమస్యలతో విద్యుత్ సంస్థలు సతమతమవుతున్నాయి. కొన్ని చోట్ల లోడ్ రిలీఫ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఇంజనీర్లు చెబుతున్నారు. వరి కోతల వరకు వ్యవసాయ డిమాండ్ తగ్గేలా లేదు. వర్షాలు పడకపోతే ఉష్ణోగ్రతలు పెరిగి గృహ వినియోగం మరింత ఎగబాకే ప్రమాదం ఉందని విద్యుత్ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. డిమాండ్ 20 వేల మెగావాట్లకు చేరువవుతోంది. కొత్త కరెంట్ ఎప్పటికి వస్తుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.

Advertisement

Also read: మహాత్మా గాంధీని అవమానించేలా రీల్.. పాపులర్ ఇన్‌ఫ్లుయెన్సర్ అరెస్ట్

Tags

Related News

మహబూబాబాద్ జిల్లాలో విచిత్ర రైల్వే స్టేషన్.. అయోమయంలో ప్రయాణికులు!

తమిళ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు.. శివకార్తికేయన్ సమావేశం వెనుక వ్యూహం ఇదేనా?

మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఆ భూముల కేసులో జోక్యానికి నో!

విమాన ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. పెరగనున్న చార్జీలు!

సిమ్ లేదు.. టవర్ అక్కర్లేదు.. భద్రతా బలగాలకు చుక్కలు చూపిస్తున్న ‘లోరా’ ఆయుధం!

పండుగ సీజన్‌లో గోల్డ్ షాపింగ్ చేస్తున్నారా.. భారీగా పెరిగిన ధరలు, GST లెక్కలివే!

మీ పిల్లలతో వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా.. చరిత్ర కలిగిన ఈ పార్క్ చూసేయండి!

Big Stories

Advertisement
×