BigTV English
Advertisement

YCP RK Roja: ఏంటీ అక్క ఇంత పని చేసావు.. అరెస్ట్‌కు భయపడి.. మంత్రితో సీక్రెట్ మంతనాలు

YCP RK Roja: ఏంటీ అక్క ఇంత పని చేసావు.. అరెస్ట్‌కు భయపడి.. మంత్రితో సీక్రెట్ మంతనాలు

YCP RK Roja: ఆయన రాయలసీమ ప్రాంతానికి చెందిన మంత్రి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో నమ్మకంతో మంత్రి పదవి కట్టబెడితే.. ఆయన టీడీపీకి బద్దశత్రువైన మాజీ మంత్రి రోజాను తన ఇంటికి ఆహ్వానించారని, ఆమెతో రాజకీయ చర్చలు జరిపి ..ఆమెకు సంబంధించిన పనులు కూడా చేసి పెట్టారని ప్రచారం జరుగుతోంది. విజయవాడలోని సదరు మంత్రి ఇంటికి రోజావెళ్లడం..తరువాత ఆమె పనులు చకచక అవ్వడం.. రాజకీయ, అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ క్రమంలో రోజాను తన ఇంటికి రానిచ్చిన మంత్రిపై టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.


వైసీపీ మౌత్ పీస్‌గా వ్యవహరించిన మాజీ మంత్రి రోజా

ఆర్కే రోజా.. వైసీపీ మౌత్ ఫీస్‌గా వ్యవహరించిన మాజీ మంత్రి. మొదటిసారి వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయమంతా రోజా చుట్టూనే తిరిగింది. అసెంబ్లీలోనూ జబర్దస్త్ ఓవరాక్షన్ చేశారు. దాంతో ఆనాటి స్పీకర్ . ఆమెను ఏడాదికిపైగా సభ నుంచి సస్పెండ్ చేసి సభకు రాకుండా చేశారు. అయితే ఈ సారి సీన్ మారింది. దారుణ పరాజయంతో రోజా ఇంటికే పరిమితమవుతున్నారు. కేసుల భయంతో అల్లాడుతున్న రోజా సైలెంట్‌గా తన పనులు చక్కపెట్టుకునే పనిలో పడ్డారంట


కేబినెట్ మంత్రితో రహస్యంగా సమావేశమైన రోజా

అరెస్టుల లిస్టులో బోరుగడ్డ అనిల్, పోసాని కృష్ణమురళీ, వల్లభనేని వంశీల తర్వాత.. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజాల పేర్లే వినిపిస్తున్నాయి. కొడాలి నాని శస్త్ర చికిత్స చేయించుకుని హస్పటల్లో ఉన్నారు. పేర్ని నాని, పెద్దిరెడ్డి, అంబటి, రోజాల చుట్టూ కేసుల ఉచ్చు బిగుసుకుంటోందంటున్నారు. అదే ఇప్పుడు రోజాను టెన్షన్‌కు గురి చేస్తోందంట. తన అరెస్ట్ పక్కా అని ఫిక్స్ అవడంతో.. ఆమె రాజీబేరాలు మొదలు పెట్టారంట. టీడీపీలో ఉన్న పాత పరిచయాలను కొత్తగా వాడేసుకుంటున్నారట. చంద్రబాబు కేబినెట్‌లో కీలక పోస్టులో ఉన్న ఓ మంత్రితో ఇటీవల రోజా రహస్యంగా సమావేశమయ్యారని తెలుస్తోంది. రాయలసీమకు చెందిన ఆ మంత్రిని రోజా విజయవాడలోని ఆయన ఇంట్లో కలిశారట. అదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది

ఆడుదాం ఆంధ్ర పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు

రోజా పర్యాటక, క్రీడా శాఖల మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర పేరుతో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఆడుదాం ఆంధ్రపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రిమంత్రి రాంప్రసాద్‌‌రెడ్డి ప్రకటించారు. రోజా క్రీడా, పర్యాటక శాఖలను అడ్డంపెట్టుకుని పాల్పడ్డ అక్రమాలపై పక్కా ఆధారాలు ఉన్నాయని.. రేపో, మాపో రోజా అరెస్ట్ ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైమ్‌లో రోజా ఓ మంత్రితో సీక్రెట్ మీటింగ్ పెట్టడం కలకలం రేపుతోంది. విచారణ నుంచి తప్పించుకోవడానిక ఆ మంత్రితో లాబీయింగ్ చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

మంత్రి తీరుపై మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు

లోకేశ్‌ రెడ్‌బుక్‌‌లో టాప్‌ పొజిషన్లో ఉన్న రోజాను.. ఆ మంత్రి తన ఇంటికి ఆహ్వనించడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్‌, పవన్‌లపై రోజా నోటికి అడ్డుఅదుపు లేకుండా చేసిన కామెంట్స్ గుర్తులేవా? అప్పుడే మర్చిపోయారా? ఆమెతో భేటీ కావాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడుతున్నారు. రోజా మంత్రిగా ఉన్నప్పుడు నిత్యం.. చంద్రబాబును లోకేష్‌ను పరుషపదజాలంతో విమర్శించారు. ముఖ్యంగా లోకేష్‌ను వాడూ..వీడూ అంటూ నోరుపారేసుకున్నారు అసెంబ్లీలో చంద్రబాబు గురించి, ఆయన సతీమణి గురించి, లోకేష్‌ సతీమణి భార్య గురించి కూడా అసహ్యంగా మాట్లాడారు.

Also Read: వేసేశాడు.. నాగబాబుకు గట్టిగా వేసేశాడు!

రోజాని మంత్రి ఇంటికి ఆహ్వానించడంపై మండిపాటు

రోజా విమర్శలపై టిడిపి కార్యకర్తలు తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే..రోజా సంగతి చూస్తామని అప్పట్లో వారు.. తెగ ఇదయ్యేవారు. కానీ.. అధికారంలోకి వచ్చి పది మాసాలు అవుతున్నా.. రోజాను ఇంత వరకు ఏమీ చేయలేకపోయామనే బాధ పార్టీ కార్యకర్తల్లో ఉంది. ఒకవైపు వాళ్లు ఇలా బాధపడుతుంటే మరోవైపు మంత్రి ఆమెను ఇంటికి ఆహ్వానించి మంతనాలు సాగించడం తెలుగు తమ్ముళ్లకు అస్సలు మింగుడుపడటం లేదంట.

రోజాపై మండిపడుతున్న వైసీపీ నాయకులు

టీడీపీలోనే కాదు.. అటు వైసీపీ నేతలు కూడా రోజా తీరుపై ఫైర్ అవుతున్నారు. ఓ వైపు అధికార పార్టీపై తమ అధినేత తీవ్రంగా పోరాడుతుంటే.. ఆ మంత్రితో రోజా రహస్య సమావేశాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. మిగతా మాజీ మంత్రులు తమపై నమోదవుతున్న కేసులపై పోరాడుతుంటే.. రోజా మాత్రం ఇలా సరెండర్ అవ్వాలని చూస్తుండటంపై మండిపడుతున్నారు. ఎవరు ఏమనుకుంటున్నా.. రోజా మాత్రం కేసుల నుంచి ఎలాగైనా బయటపడాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు కనిపిస్తున్నారు. అక్రమ కేసులకు భయపడబోమని మీడియా ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న రోజా తెర వెనుక చేస్తున్న రాజకీయం తీవ్ర చర్చనీయాంశంగా మారిందిప్పుడు.

మంత్రి వ్యవహార శైలిపై ఇప్పటికే పలు విమర్శలు, ఆరోపణలు

అదలా ఉంటే రోజాతో సీక్రెట్ మీటింగ్ పెట్టిన మంత్రి వ్యవహారశైలిపై ఇప్పటికే పలు విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు మందలింపులకే పరిమితమవుతూ ఆయన విషయంలో ఉదారంగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుత మేటర్ చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లిందని.. ఆయన సైతం వాళ్ల భేటీపై సీరియస్‌గా ఉన్నారని అంటున్నారు. మరి మంత్రి విషయంలో, రోజా వ్యవహారంలో సర్కరు ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుందో చూడాలి

Related News

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Kalvakuntla Kavitha: జూబ్లీహిల్స్ బైపోల్‌.. బీఆర్ఎస్‌కు కవిత గండం

Kalvakuntla Kavitha: కవిత టార్గెట్.. కారు పార్టీ.. టచ్‌లో ఆ నేతలు?

Vijayanagaram TDP: టీడీపీ జిల్లా.. రథసారథి ఎవరో?

Big Stories

×